Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘బాహుబలి’ : బయ్యర్ కు రిలీజ్ కు ముందే 3 కోట్లు లాభం
హైదరాబాద్ : రీసెంట్ గా తిరుపతి ఎస్వీయూ మైదానంలో అత్యంత ఘనంగా ‘బాహుబలి' ఆడియో వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకతో,అంతకు ముందు వదిలిన ట్రైలర్ తో ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని కి విపరీతమైన క్రేజ్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
USA థియోటర్ రైట్స్ ని తొమ్మిది కోట్లకు అంతుకు ముందే కొనుగోలు చేసిన బయ్యర్ 12 కోట్లు కు తిరిగి రీజనల్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. అంటే 2.4 మిలియన్ డాలర్లుకు అన్నమాట. దానర్దం సినిమా రిలీజ్ కు ముందే మూడు కోట్లు లాభం చూసారన్నమాట. ఇంకా ఇలా ఎంతమందికి ఈ చిత్రం డబ్బులు పంట పండించనుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.