twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2016: అమెరికా లో కలెక్షన్లు కురిపించిన తెలుగు సినిమాల లిస్ట్,ఆశ్చర్యపరిచజే నిజాలు

    2016 వ సంవత్సరంలో తెలుగులో పెరిగిన ఓవర్ సీస్ మార్కెట్ కు కలిసి వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి.

    By Srikanya
    |

    హైదరాబాద్: 2016 సంవత్సరానికి కొన్ని రోజుల్లో గుడ్ బై చెప్పనున్నాం. ఈ నేపధ్యంలో ఏ సినిమాలు హిట్, ఏవి ఫ్లాఫ్, సక్సెస్ రేటు ఎలా ఉంది అనే విషయాలు సగటు సిని ప్రేక్షకుడుకి ఆసక్తికరం. వాస్తవానికి టాలీవుడ్ ఈ ఇయర్ ని విజయం తో స్వాగతించిందనే చెప్పాలి. మంచి హిట్స్ తో సంవత్సరం మొదలై కంటిన్యూ అయ్యింది. అయితే ఊహించని ఫ్లాఫ్ లు సైతం భయపెట్టాయి.

    కొంతకాలం క్రితం వరకు కేవలం తెలుగు నేల మీదే సత్తా చూపే టాలీవుడ్‌ సినిమాలు ఇప్పుడు ఓవర్సీస్‌లోనూ దుమ్ము రేపి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఓవర్ సీస్ కలెక్షన్స్ కు వేదికగా ముఖ్యంగా అమెరికా మంచి మార్కెట్‌గా నిలిచింది. ఈ 2016 సంవత్సరం ఓ రోజులో ముగుస్తన్న సందర్భంగా అక్కడ రికార్డ్ లు క్రియేట్ చేసిన చిత్రాలని పరిశీలిద్దాం.

    తెలుగుకి పెద్ద మార్కెట్ గా మారిన ఓవర్ సీస్ లో స్టార్ హీరోల సినిమాలు ఆడుతున్నాయా..లేక చిన్న సినిమాలకు ఆదరణ ఎక్కువ ఉంటోందా..ఓవర్ సీస్ ప్రేక్షకులు ఏమి కోరుకుంటన్నారు, వారికి నచ్చే సినిమాలు ఏమిటి..ఓవర్ సీస్ ని టార్గెట్ చేయాలంటే ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి వంటి విషయాలు ఇలాంటి లిస్ట్ లతో ఓ అవగాహనకు వస్తాయి.

    త్రివిక్రమ్ మ్యాజిక్ ..

    త్రివిక్రమ్ మ్యాజిక్ ..

    ఏడాదిలో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో ‘అఆ' యూఎస్‌లో మంచి కలెక్షన్లు రాబట్టి నెంబర్‌ వన్‌ స్థానం దక్కించుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సృష్టించిన ఈ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ దాదాపు 16.37 కోట్లు కలెక్ట్‌ చేసింది.

    నాన్నకు ప్రేమతో ...

    నాన్నకు ప్రేమతో ...

    ఆ తర్వాతి స్థానంలో ‘నాన్నకు ప్రేమతో' (13.43 కోట్లు) నిలిచింది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఇదే టాప్‌ గ్రాసర్‌. సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అక్కడ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. క్లాస్ టచ్ ఉన్న మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కావటంతో అందరూ బాగా చూసారు.

    ఎన్టీఆర్ దే ఇంకోటి

    ఎన్టీఆర్ దే ఇంకోటి

    ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్ లో కొరటాల శివ రూపొందించిన జనతాగ్యారేజ్ చిత్రం ఓవర్ సీస్ లో .. $1.80 M వరకూ కలెక్టు చేసి మూడో ప్లేస్ లో ఉంది. ఎన్టీఆర్ నటన, కొరటాల క్లాస్ డైరక్షన్ , మోహన్ లాల్ ఎమోషన్స్ ని పండించే తీరు ఆకట్టుకున్నాయి.

    నాగ్, కార్తీ మ్యాజిక్

    నాగ్, కార్తీ మ్యాజిక్

    నాగార్జున, కార్తి కాంబినేషన్ లో పివిపి సంస్ద నిర్మించిన ఊపిరి చిత్రం అక్కడ మంచి విజయమే సాధించింది. 10.45 కోట్లు వరకూ తెచ్చిపెట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ కావటం, ఎంటర్టైన్మెంట్ సినిమాకు ప్లస్ లుగా నిలిచాయి.

    రామ్ చరణ్ కు అక్కడ తొలి హిట్

    రామ్ చరణ్ కు అక్కడ తొలి హిట్

    రామ్ చరణ్,సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ధృవ చిత్రం ఓవర్ సీస్ లో $1.40 M వరకూ ఇప్పటివరకూ కలెక్ట్ చేసింది. ఇంకా స్టిల్ కలెక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ కలెక్షన్స్ ఎక్కడికి వెళ్లి ఆగుతాయా అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    చిన్న సినిమా పెద్ద విజయం

    చిన్న సినిమా పెద్ద విజయం

    ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సైలెంట్‌గా రిలీజైన ‘పెళ్లి చూపులు' సినిమా యూఎస్‌ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టింది. $1.22 M వరకూ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ కు ..కలెక్షన్స్ కు సంభందమే లేదు. సినిమా బాగుంటే ..మిగతావన్నీ పట్టించుకోరని ప్రూవ్ చేసిందీ సినిమా.

    కాంబినేషన్ ప్లస్ ...

    కాంబినేషన్ ప్లస్ ...

    మహేష్, శ్రీకాంత్ అడ్డాల... కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మోత్సవం చిత్రం ఓవర్ సీస్ లో 7.77 కోట్లు వసూలు చేసింది. పివీపి లాంటి భారీ నిర్మాణ సంస్ద ప్రొడ్యూసర్స్ కావటం, ఇదేకాంబినేషన్ లో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ అవటం ఈ స్దాయి కలెక్షన్స్ కు దోహదం చేసింది. నిజానికి బ్రహ్మోత్సవం డిజాస్టర్ చిత్రం.

    డిజాస్టర్ అయినా...

    డిజాస్టర్ అయినా...

    ఓవర్ సీస్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజే వేరు. దానికి తోడు పవర్ వంటి హిట్ ని ఇచ్చిన బాబి దర్శకుడు కావటంతో ...సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఇక్కడ డిజాస్టర్ అయినా ...అక్కడ ఓవర్ సీస్ లో ...7.12 కోట్లు వసూలు చేసింది.

    మంచి హిట్..

    మంచి హిట్..

    నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ధ్రిల్లర్ చిత్రం జెంటిల్‌మెన్‌ . నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. ఈ చిత్రం ఓవర్ సీస్ లోనూ బాగానే కలెక్ట్ చేసింది. .. .6.07 కోట్లు వసూలు చేసింది.

    బెస్ట్ కాంబో ఫిల్మ్

    బెస్ట్ కాంబో ఫిల్మ్

    అల్లు అర్జున్, బోయపాటి దర్సకత్వంలో వచ్చిన సరైనోడు చిత్రం ఇక్కడ భాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయం సాధించింది. అక్కడ ఓవర్ సీస్ లోనూ... సరైనోడు సినిమా 5.93 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియోట్ చేసింది.

    నాగ్ చిత్రం

    నాగ్ చిత్రం

    నాగ్ చేసిన సోషియో ఫాంటసీ...సోగ్గాడే చిన్ని నాయినా హై సక్సెస్ ఫుల్ మూవీ గా నమోదు చేసింది. అంతేనా ఓవర్ సీస్ లోనూ $838k కలెక్ట్ చేసి దుమ్ము రేపింది. . ఈ చిత్రం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం తెచ్చిపెట్టింది.

    అక్కడ సూపర్ హిట్

    అక్కడ సూపర్ హిట్

    ఈ దసరాకు పేరుకు ఐదు సినిమాలు రిలీజ్ అయినా లీడ్ ఉన్నది మాత్రం ప్రేమమ్ చిత్రమే కావంటతో ఉన్నంతలో బాగానే వర్కవుట్ అయ్యింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...ఈ చిత్రం 22 కోట్లుకు అమ్మారు. ఫైనల్ రన్ లో 23 కోట్లు షేర్ వచ్చింది. కాబట్టి లాభమూ లేదు, నష్టమూ లేదు అని చెప్పాలి. ఇక ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం డీసెంట్ ప్రాఫెట్స్ $829k వచ్చాయని తెలుస్తోంది.

    మరో నాని సినిమా

    మరో నాని సినిమా

    నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమా ఇక్కడ పెద్దగా వర్కవుట్ కాకపోయినా ఓవర్ సీస్ లో మాత్రం $772k దుమ్ము రేపింది. ఈ సినిమాతో నానికు మంచి పేరు వచ్చింది. దర్శకుడుగా హను రాఘవపూడి నిలబడిపోయాడు.

    మళ్లీ ఫామ్ లోకి ..

    మళ్లీ ఫామ్ లోకి ..

    హారర్‌ కామెడీ సినిమాల హావ తగ్గుతున్న సమయంలో అటువంటి సబ్జెక్ట్ తో తెరకెక్కిన సినిమా "ఎక్కడికి పోతావు చిన్నవాడా". నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో రిలీజ్ అయి హిట్ అందుకుని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఓవర్ సీస్ లో $716k కలెక్ట్ చేసింది.

    రామ్ ని కలిసొచ్చింది

    రామ్ ని కలిసొచ్చింది

    2016 లో ఇండస్ట్రీ కి తొలి విజయం నేను శైలజ చిత్రం ద్వారా దక్కింది. జనవరి ఫస్ట్ న విడుదలైన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తండ్రి, కూతురు సెంటిమెంట్ తో సాగిన ఈ చిత్రం ఎనర్జిటిక్ హీరో రామ్ కి గొప్ప విజయాన్ని అందించింది. "నేను శైలజ" 40 కోట్లను వసూల్ చేసి రామ్ స్థాయిని పెంచింది. ఓవర్ సీస్ లో $632k కలెక్టు చేసి నిర్మాతకు ఆనందం కలిగించింది.

    అవసరాల ప్లస్ అయ్యాడు

    అవసరాల ప్లస్ అయ్యాడు

    నారా రోహిత్ .. నాగశౌర్య .. రెజీనా ప్రధానమైన పాత్రలను పోషించిన 'జ్యో అచ్యుతానంద' చిత్రం ఇక్కడ ఓకే అనిపించుకున్నా...ఓవర్ సీస్ లో $614k కలెక్టు చేసింది. అవసరాల శ్రీనివాస్. "ఊహలు గుసగుసలాడే" లాంటి సినిమాతో దర్శకుడిగా పరిచయయిన అవసరాల.. డైరక్టర్ కావటం కలిసొచ్చిన అంశం.

    నాని మరో సినిమా

    నాని మరో సినిమా

    నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై 'ఉయ్యాలా జంపాలా' ఫేమ్ విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం 'మజ్ను'. నాని సరసన ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇక్కడ సోసోగా ఆడింది. ఓవర్ సీస్ లో $512k కలెక్టు చేసి ఫ్లాఫ్ అనిపించుకుంది.

    వెంకీ కి ఇది ఫ్లాఫ్

    వెంకీ కి ఇది ఫ్లాఫ్

    వెంకటేష్, మారుతి కలిసి చేసిన 'బాబు బంగారం'పై మొదట్నుంచి ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది. విడుదలకు ముందు అంచనాలు మరింత పెరిగాయి. మాంచి హైప్ మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. అయితే ఫ్లాఫ్ అయి కూర్చుంది. ఈ సినిమా ఓవర్ సీస్ లో $488 k కలెక్ట్ చేసి ఫ్లాఫ్ అయ్యింది.

    కలెక్షన్స్ రాజా...

    కలెక్షన్స్ రాజా...

    హీరో శర్వానంద్ కి రన్ రాజా రన్ చిత్రంతో ఓ మంచి కమర్శియల్ హిట్ దొరికింది . దాన్ని ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో కంటిన్యూ చేస్తూ కలక్షన్స్ అదరగొట్టాడు. రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాల హిట్ తో మంచి జోష్ లో ఉన్న ఈ హీరోకి మరో హిట్ తో హ్యాట్రిక్ సోంతం అయ్యింది. ఓవర్ సీస్ లో కూడా $416k కలెక్ట్ చేసింది.

    యావరేజ్ ..రేంజే

    యావరేజ్ ..రేంజే

    విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో' లేటుగా అయినా లేటెస్ట్ గా రిలీజ్ అయింది. యువ సామ్రాట్ నాగచైతన్య, మలయాళ నటి మంజిమ మోహన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ యువతకి కొత్త ఫీల్ ని అందించింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఓవర్ సీస్ లో $304k యావరేజ్ అయ్యింది.

    నాగశౌర్య సినిమా

    నాగశౌర్య సినిమా

    'అలా మొదలైంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఓ తాజాదనంతో కూడిన వినోదాన్ని పంచింది నందిని రెడ్డి. కానీ ఆమె మీద పెట్టుకున్న అంచనాలన్నీ 'జబర్దస్త్' నీరు గార్చేసింది. దీంతో ఈసారి బాగా గ్యాప్ తీసుకుని కళ్యాణ వైభోగమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య, ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ చిత్రం ఓవర్ సీస్ లో .. $258k కలెక్ట్ చేసింది.

    ధ్రిల్లర్ అయినా

    ధ్రిల్లర్ అయినా

    సింపుల్ లైన్. ..కానీ కథలో క్షణం..క్షణం ట్విస్టులు.. చివరి వరకు కొనసాగిన సస్పెన్స్ "క్షణం" చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది. కోటి రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా రూ. 8 కోట్లు వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది. ఓవర్ సీస్ లోనూ ఈ చిత్రం $137k వసూలు చేసింది.

    English summary
    Here are the list of Tollywood movies that crossed the one-million dollars mark plus USA market, also check out all the movies that brought profits to the distributors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X