twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగడు : సల్మాన్‌ ఖాన్‌కు షాకిచ్చిన మహేష్ బాబు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు రేంజ్ ఏమిటి? సల్మాన్ ఖాన్ రేంజ్ ఏమిటి? ఈ ఇద్దరు సినిమాల బిజినెస్ సర్య్కూట్ పూర్తిగా భిన్నమైంది. ఏ విధంగా చూసుకున్నా మహేష్ బాబు సినిమాల కంటే సల్మాన్ ఖాన్ సినిమాల వ్యాపార పరిధి ఎక్కువగా ఉంటుంది. అందుకే కలెక్షన్ల పరంగా కూడా సల్మాన్ ఖానే టాప్‌లో ఉంటాడు.

    అలాంటి సల్మాన్ ఖాన్‌కు...మహేష్ బాబు తాజా సినిమా ‘ఆగడు' షాకిచ్చింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్' సినిమాకు అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల ద్వారా రాబట్టిన కలెక్షన్ కంటే ‘ఆగడు' సినిమాకు అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా వచ్చి కలెక్షనే ఎక్కువంట. కిక్ సినిమాకు రూ. 3 కోట్లు వస్తే....‘ఆగడు' సినిమా 3.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పలు హిందీ పత్రికల్లో, టీవీ ఛానల్స్‌లో కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ఈ వార్తలను ప్రచురించారు.

    'Aagadu' breaks Salman Khan's 'Kick' record in US

    తెలుగు సినిమా చరిత్రలో రికార్డు స్థాయిలో ‘ఆగడు' చిత్రాన్ని దాదాపు 2వేల థియేటర్లలో విడుదల చేసారు. ‘దూకుడు' కాంబినేషన్ అయిన శ్రీను వైట్ల-మహేష్ బాబు సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో అధిక ధర చెల్లించి ప్రీమియర్ షోలోలు చూసేందుకు సైతం ప్రేక్షకులు ఎగబడ్డారు.

    ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిసి దాదాపు 25 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు రూ. 11.20 కోట్లు, సెకండ్ డే 7.20 కోట్లు, థర్డ్ డే 6.60 కోట్లు వసూలు చేసింది. అయితే ఇది ట్రేడ్ వర్గాల అంచనా మాత్రమే. అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

    English summary
    Mahesh Babu 's Aagadu which released yesterday has opened up to the record collections on the first day across the globe. 'Aagadu' breaks Salman Khan's 'Kick' record in US.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X