twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శుక్రవారం రిలీజ్ లు: ఏ సినిమా ఎలా ఉంది?

    By Srikanya
    |

    హైదరాబాద్‌: స్టార్‌ హీరోల సినిమాల సందడి తగ్గడంతో మొన్న శుక్ర వారం మూడు చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'దిక్కులు చూడకు రామయ్య', 'రోమియో', 'పాఠశాల' చిత్రాలు విడుదలయ్యాయి. మూడింటిలో రోమియో చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, 'దిక్కులు చూడకు రామయ్య', 'పాఠశాల' ఓకే అనిపించుకున్నాయి.

    నాగశౌర్య, సన మక్బూల్‌, అజయ్‌, ఇంద్రజ ప్రధానపాత్రల్లో రూపొందించిన 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రాన్ని వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించారు. త్రికోటి దర్శకత్వం వహించగా... ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలున్నాయి. అయితే అంచనాలను అందుకోలేకపోయిందీ చిత్రం. కానీ ఫస్టాఫ్ కామెడీ పండటం, విభిన్న కధాంశం కావటంతో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.

    Ajay's Dikkulu Choodaku Ramayya wins the race

    నందు, శివ, శంశాక్‌, అనుప్రియ, శిరీష, సాయికిరణ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'పాఠశాల'. మహి వి రాఘవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్‌ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి టాక్ ఫరవాలేదనిపించినా కలెక్షన్స్ మాత్రం డల్ గా ఉన్నాయని తెలుస్తోంది. యూత్ కు కనెక్టు అయ్యేలా ప్రమోషన్ చేస్తే కలెక్షన్స్ ఊపందుకునే అవకాసం ఉందంటున్నారు.

    పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌, అడోనికా జంటగా తెరకెక్కిన చిత్రం 'రోమియో'. గోపీ గణేష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూరి జగన్నాథ్‌ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడం విశేషం. అయితే ఈ చిత్రం మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటంతో కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి.

    English summary
    Dikkulu Choodaku Ramayya comes from the production house that gave us the heart-warming rom-com Oohalu Gusagusalade a few months ago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X