twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లరి నరేష్ చిత్రం అంటే బిజినెస్ వర్గాల్లో క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే అతని సినిమాలకు ఫ్యామిలీస్ రావటం మెయిన్ రీజన్. అయితే గత కొంత కాలంగా అతని సినిమాలు భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. ఈ నేపధ్యంలో ఆయన తాజా చిత్రం 'బద్రరాఫ్‌ బొమ్మాళీ' మీద కూడా ఎఫెక్టు పడిందంటున్నారు. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని తనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాడు.

    షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి హీరోగానే కాకుండా ఈ చిత్ర సమర్పకుడిగా కూడా అల్లరి నరేష్ భాద్యత తీసుకున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అడుగుపెడుతున్నట్లు సమాచారం.

    చిత్రం గురించి నరేష్ మాట్లాడుతూ...ఏ ఇంట్లో అయినా అన్నయ్యదే ఆధిపత్యం. ఆ అల్లరిని చెల్లెమ్మలు భరించాల్సిందే. కానీ ఆ ఇంట్లో మాత్రం అలా కాదు. చెల్లెమ్మ ఓ మినీ సూరేకాంతంలా రెచ్చిపోతుంటే, అన్నయ్య అన్నమయ్యలా శాంతంగా ఉంటుంటాడు. వీధిలో చెల్లాయి బొమ్మాళిలా మారి రౌడీయిజం చేస్తుంటే, వాళ్లందరినీ పాపం ఈ బ్రదర్‌ సముదాయిస్తుంటాడు. వీరిద్దరి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అల్లరి నరేష్‌.

    Allari Naresh wants to release Brother of Bommali in Nizam

    అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం 'బద్రరాఫ్‌ బొమ్మాళీ'. చెల్లెమ్మగా కార్తీక కనిపిస్తుంది. మోనాల్‌ గజ్జర్‌ కథానాయిక. అమ్మిరాజు కానుమల్లి నిర్మాత. శేఖర్‌చంద్ర స్వరాలు అందించారు. ఓ ప్రత్యేక గీతానికి శ్రీవసంత్‌ బాణీ సమకూర్చారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

    దర్శకుడు చిన్నికృష్ణ మాట్లాడుతూ ''అన్నాచెల్లెళ్ల సినిమా అంటే సెంటిమెంట్‌మయం అనుకొంటారు. ఇది అలా కాదు. ఆద్యంతం నవ్వులు పంచిస్తుంది. సినిమా టైటిల్‌కీ, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వస్తోంది. నరేష్‌కి ఇది మరపురాని చిత్రమవుతుంది''అన్నారు.

    నరేశ్‌ మాట్లాడుతూ ‘‘హీరోయిన్‌గా చేస్తున్న టైమ్‌లో సిస్టర్‌గా చెయ్యడానికి ఒప్పుకున్న కార్తీకకు థాంక్స్‌ చెప్పాలి. ఇందులో అందరి బెండు తీసే అమ్మాయిగా వంద శాతం ఆ పాత్రకు న్యాయం చేసింది. ఆమెను ఆపడానికి ప్రయత్నించే బ్రదర్‌గా నానా తంటాలుపడే కేరక్టర్‌ చేశాను. ఇటీవల నా సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్‌ మిస్సవుతున్నారనే ఫీలింగ్‌ ఉంది. ఈ సినిమా వాళ్లకు బాగా నచ్చుతుంది'' అని చెప్పారు. దర్శకుడు చిన్ని మాట్లాడుతూ ఇందులో నరేశ్‌ ఫ్రెష్‌లుక్‌తో కనిపిస్తారనీ, ఈ సినిమా తర్వాత శేఖర్‌చంద్ర మంచి మాస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతారనీ అన్నారు.

    నరేశ్‌ జోడీగా మోనాల్‌ గజ్జర్‌, కార్తీక సరసన హర్షవర్థన్‌ రాణే నటించిన ఈ చిత్రంలో భానుశ్రీ మెహ్రా, బ్రహ్మానందం, అలీ, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, నాగినీడు, ఎల్బీ శ్రీరామ్‌, జీవా, కెల్లీ డోర్జీ, అభిమన్యుసింగ్‌, వెన్నెల కిశోర్‌, శ్రీనివాసరెడ్డి, సుధ, సురేఖావాణి తారాగణం. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల రవికుమార్‌, శ్రీమణి, స్టంట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, కూర్పు: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.

    English summary
    Allari Naresh-Monal Gajjar’s Brother of Bommali finally gets a release date. November 7th has been fixed as the date
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X