twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అల్లుడు శ్రీను’ 50 డేస్... ఎన్ని సెంటర్స్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వి.వి.వినాయక్ దర్శకత్వంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరచయం చేస్తూ శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్ పతాకంపై బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన భారీ చిత్రం ‘అల్లుడు శ్రీను' 63 కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవం దిశగా పరుగులు తీస్తోందంటూ నిర్మాతలు ప్రకటన విడుదల చేసారు.

    ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ...‘నా తొలి చిత్రాన్ని ఇంత బాగా ఆదరించి అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన వి.వి.వినాయక్ గారికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. నాన్నగారు ఖర్చుకు వనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించి హీరోగా నన్ను చాలా పెద్ద లెవెల్ లో లాంచ్ చేసారు. వినాయక్ గారి టేకింగ్, నాన్నగారి మేకింగ్ ‘అల్లుడి శ్రీను' చిత్రాన్ని పెద్ద రేంజికి తీసుకెళ్లాయి. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు ముఖ్యంగా సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం గార్లకు, స్పెషల్ సాంగ్ చేసిన తమన్నాకు అందరికీ నా థాంక్స్.

    Alludu Seenu completes 50 days

    అలాగే దేవిశ్రీ ప్రాసాద్, చోటా కె. నాయుడు, గౌతంరాజు, బాబీ, కోన వెంకట్, గోపీ మోహన్, ఎ.ఎస్.ప్రకాష్ లాంటి పెద్ద టెక్నీషియన్స్ ఈ చిత్రం ఇంత మంచి హిట్ అవడానికి కారణం అయ్యారు. నా తొలి చిత్రం 63 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

    వివి వినాయక్ మాట్లాడుతూ...‘అల్లుడు శ్రీను కమర్షియల్‌గా పెద్ద హిట్టయి 50 రోజులు పూర్తి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా శ్రీనివాస్ ముందు ముందు మరిన్ని విజయాలు సాధించి హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాడు. అల్లుడు శ్రీను చిత్రాన్ని సూపర్ హిట్ చేసి శ్రీనివాస్‌కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు.

    English summary
    Debutante actor Bellamkonda Srnivas-starrer Alludu Seenu has completed a successful 50-day run at 63 centers across Telangana and AP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X