Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఏప్రియల్ 3 న మళ్లీ భయపెడతాడు
హైదరాబాద్: రవిబాబు గతంలో రూపొందించిన హిట్ చిత్రం ‘అవును' చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘అవును-2' అనే పేరును నిర్ణయించి ఆ మధ్యన ట్రైలర్ ని సైతం విడుదల చేసారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ పొస్టర్ ని విడుదల చేసారు. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకాలపై రవిబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హర్షవర్థన్ రానె, పూర్ణ జంటగా రూపొందింది. ఈ చిత్రం ఏప్రియల్ 3 వ తేదీన విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. రవిబాబు గత చిత్రం లడ్డూ బాబు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ఈ చిత్రం తో ఎలాగయినా తిరిగి ఫామ్ లోకి రావాలని కృత నిశ్చయింతో ఉన్నాడు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రవిబాబు మాట్లాడుతూ ‘‘అవును సినిమా ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే అవును-2 మొదలవుతుంది. ఆ సినిమాలోని పాత్రలతోనే ఈ సినిమా సాగుతుంది. మరో రెండు, మూడు కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతాయి. ఈ సినిమాలో సెల్‌కాన్ ట్యాబ్ కీలక పాత్ర పోషించింది. నిఖిత పాత్ర కూడా ముఖ్యమైనదే. తొలి భాగంలో కనిపించని కెప్టెన్ రాజు గురించి ఈ సినిమాలో చూపిస్తున్నాం'' అని అన్నారు.
డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘అవును-2 సినిమాను రవిబాబు చాలా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 కంటే 2 ఇంకా బావుంటుంది. హారర్ సినిమాలను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే: సత్యానంద్, కెమెరా: ఎన్.సుధాకర్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్, ఆర్ట్: భూపే్‌శ ఆర్.భూపతి, రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.