» 

ఎన్టీఆర్ 'బాద్‌షా' క్లోజింగ్ కలెక్షన్స్

Posted by:

హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బాద్‌షా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ మొదటి వారం బాగున్నా..తర్వాత డ్రాప్ అవటం ప్రారంభం అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ట్రేడ్ లో చెప్పుకునేదాని ప్రకారం...

నైజాం : 13.24 కోట్లు
సీడెడ్ : 8.85 కోట్లు
వైజాగ్ : 4.04 కోట్లు
వెస్ట్ గోదావరి :1.98 కోట్లు
ఈస్ట్ గోదావరి : 2.44 కోట్లు
గుంటూరు: 3.80 కోట్లు
కృష్ణా: 2.27 కోట్లు
నెల్లూరు: 1.68 కోట్లు

మొత్తం ఆంధ్రప్రదేశ్ : 38.30 కోట్లు
కర్ణాటక: 4.32 కోట్లు
మిగిలిన ప్రాంతాలు ఇండియాలో : 1.60 కోట్లు

యుఎస్ ఎ లో ...$ 1,281,249

మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ : 51.24 కోట్లు


ఇక ఊహించిన విధంగా కామెడీ క్లిక్ కాకపోవటం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అందులోనూ ఎన్టీఆర్ బాద్షా గెటప్ పేలలేదు. దాంతో సినిమా రేంజి తగ్గిపోయింది. పబ్లిసిటీ కూడా మొదటి ఓ రేంజిలో ఊపారు కానీ ఇప్పుడు తగ్గించేసారు.

దానికి తోడు నితిన్ తాజా చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే కూడా ఈ చిత్రానికి పోటీగా మారింది. గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం భాక్సాఫీస్ వద్ద మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. దాని ఎఫెక్టు బాద్షా పై పడింది.

Read more about: baadshah, jr ntr, kajal, srinu vytla, జూ ఎన్టీఆర్, బాద్ షా, శ్రీను వైట్ల, కాజల్
English summary
The last release movie of Ntr is Baadshah movie. The movie has collected a good box – office collection. Here is the closing collection list. Total closing collections : 51.24Cr
Please Wait while comments are loading...