twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మాండం: ‘బాహుబలి-2’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్, 1000 కోట్లకు చేరువలో...

    తొలి వారం రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు రూ. 860 కోట్లు నమోదు చేసిన ఈచిత్రం మరో రెండు రోజుల్లో రూ. 1000 కోట్ల మార్కును అందుకుంటుదని చెబుతున్నారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసి దూసుకెలుతున్న 'బాహుబలి-2' మూవీ బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. 6వ రోజుకే పికె మూవీ రూ. 743 కోట్ల రికార్డు బద్దలు కొట్టి నెం.1గా అవతరించిన ఈ చిత్రం..... తొలి వారం పూర్తియ్యే సమయానికి రూ. 860 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

    ఇప్పటి వరకు ఇండియన్ సినీ పరిశ్రమలో రూ. 1000 కోట్ల మార్కు అనేది ఎవరూ అందుకోని బ్రహ్మాండంగానే ఉండిపోయింది. ఇపుడు ఆ బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టే దిశగా 'బాహుబలి-2' మూవీ అడుగులు వేస్తోంది. ఈ మార్కును అందుకోవడానికి కేవలం ఒకటి రెండు అడుగుల దూరంలోనే ఉండటం గమనార్మం.

    మరో రెండు రోజుల్లో రూ. 1000 కోట్లు

    మరో రెండు రోజుల్లో రూ. 1000 కోట్లు

    తొలి వారం రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు రూ. 860 కోట్లు నమోదు చేసిన ఈచిత్రం మరో రెండు రోజుల్లో రూ. 1000 కోట్ల మార్కును అందుకుంటుదని చెబుతున్నారు.

    నెట్ అమౌంట్, విత్ టాక్స్

    నెట్ అమౌంట్, విత్ టాక్స్

    ఇండియాలో ఈ సినిమాపై ప్రేక్షకులు తొలి వారంలో మొత్తం రూ. 695 కోట్లు ఖర్చు పెట్టారు. టాక్సులు, ఇతర ఖర్చులు పోను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల చేతికి తొలివారం వసూళ్ల రూపంలో రూ. 545 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ ఈ సినిమాపై ప్రేక్షకులు రూ. 165 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపితే తొలివారం గ్రాస్ కలెక్షన్ రూ. 860 కోట్లకు చేరిందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తెలిపారు.

    భారీ లాభాలే...

    భారీ లాభాలే...

    బాహుబలి-2 నిర్మాణానికి నిర్మాతలు దాదాపు రూ. 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఓవరాల్ బిజినెస్ లో ఈ సినిమా రూ. 1500 కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే నిర్మాతలకు భారీ లాభాలే అన్నమాట.

    ఎవరూ ఊహించని విజయం

    ఎవరూ ఊహించని విజయం

    బాహుబలి-2 భారీ విజయం సాధిస్తుందని అంతా ముందే ఊహించారు కానీ... ఇండియాలో నెం.1 స్థానాన్ని అవలీలగా అందుకుని రూ. 1000 కోట్ల మార్కును సైతం దాటేసి అంతకు మించిన వసూళ్లతో సినిమా పెను ప్రభంజనం క్రియేట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.

    రూ. 2000 కోట్లు

    రూ. 2000 కోట్లు

    బాహుబలి పార్ట్ 1 అప్పట్లో రూ. 600 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. రెండు పార్టులు కలుపుకుంటే మొత్తం బిజినెస్ రూ. 2000 కోట్ల మార్కును అందుకుంటుందని అంటున్నారు. రెండు భాగాలు కలిపి బాహుబలి ఓవరాల్ బడ్జెట్ రూ. 400 కోట్లతో తెరకెక్కించారు.

    English summary
    According to trade analyst Ramesh Bala, the SS Rajamouli epic has earned a net income of Rs 545 crore worldwide. With taxes, the figure comes to Rs 695 crore. Overseas, the film has earned Rs 165 crore. A total estimate brings the final figure to Rs 860 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X