twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి-2' కోసం అదిరిపోయే మార్కెట్‌ వ్యూహం

    By Srikanya
    |

    హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాతలు అనుసరించిన మార్కెట్‌ వ్యూహం వూహించని ఫలితాల్ని ఇచ్చింది. విభిన్నంగా, వినూత్న ప్రచార శైలితో ఈ చిత్రానికి కావల్సినంత క్రేజ్‌ తీసుకొచ్చి భాక్సాఫీస్ ని కొల్లగొట్టారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ముఖ్యంగా 'బాహుబలి' వసూళ్లు ఈస్థాయిలో ఉన్నాయంటే వారి మార్కెటింగ్‌ శైలి ప్రధాన కారణమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దాంతో 'బాహుబలి 2'కి కూడా రాజమౌళి ఆయన టీమ్...ఇప్పటి నుంచే మార్కెటింగ్‌ వ్యూహాల్ని రచిస్తున్నారు.

    'బాహుబలి' బ్రాండ్‌ విలువని పెంచేందుకు, చిన్న పిల్లల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచేందుకు ఇప్పుడు 'బాహుబలి' బొమ్మల్ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ నడిచే చిత్రమిది.

    'BAAHUBALI' Characters as soft toys

    'బాహుబలి', 'భళ్లాలదేవ', 'దేవసేన', 'శివగామి', 'అవంతిక'.. ఇలా ఒకొక్క పాత్రకూ ఒక్కో విశిష్టత ఉంది. ఆపాత్రల్ని పోలిన బొమ్మల్ని రూపొందించి, త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

    వాటితోపాటు 'బాహుబలి' వీడియో గేమ్స్‌నీ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని అంతర్జాతీయ సంస్థలతో 'బాహుబలి' చిత్రం యూనిట్ చర్చలు జరుపుతోంది. హాలీవుడ్‌లో 'స్పైడర్‌మేన్‌', 'సూపర్‌మేన్‌' సిరీస్‌ సినిమాలు విడుదల చేసే సమయంలో ఆ పాత్రల్ని పోలిన బొమ్మలు, వీడియో గేమ్స్‌, కొన్ని వినియోగ వస్తువులు మార్కెట్‌లో విడుదల చేస్తుంటారు.

    అటు ప్రచారం, ఇటు వ్యాపారం రెండూ జరిగిపోతుంటాయి. అదే వ్యూహాన్ని 'బాహుబలి' కోసం అనుసరిస్తున్నారు రాజమౌళి. వచ్చే ఏడాది జనవరిలోగా ఈ బొమ్మలు మార్కెట్‌లోకి వస్తాయి.

    English summary
    Baahubali makers are planning to come up with a merchandise. A range of soft toys depicting the characters of Baahubali such as Bhallaladeva, princess Avantika, Sivudu, Kattappa and others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X