twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' డాక్యుమెంట్ డిటేల్స్ ... ట్రైలర్ రిలీజ్ డేట్

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా కీలక పాత్రధారి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం దర్శక,నిర్మాతలు... పూర్తిగా ప్రమోషన్ పై దృష్టి పెట్టడానికి సిద్దపడుతున్నారు. మే 10 న ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ విడుదల కానుందని సమాచారం. అలాగే ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన డాక్యుమెంట్ ని సైతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిత్రానికి సంభందించిన ప్రమోషన్ ...ఏప్రియల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రియల్ 25 న చిత్రానికి సంభిందించిన షార్ట్ టీజర్ వస్తుందని తెలుస్తోంది. అలాగే...చిత్రానికి సంభిందించిన వాల్ పోస్టర్స్ డిజైన్స్ ఫైనల్ చేస్తున్నారని,సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వాటిని విడుదల చేస్తారని వినికిడి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఊపందుకుంది. త్వరలోనే ఇక టీజర్స్ వచ్చి మనని అలరిస్తాయి.

    తన వూహల రాజ్యం మహిష్మతి నేపథ్యంలో ఓ డాక్యుమెంట్‌ని రూపొందించబోతున్నారు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆ రాజ్యంలో ప్రజల జీవన స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, రాజకీయాలు, వైద్యం, కుటుంబ అనుబంధాలు... ఎలా ఉండేవో చెబుతూ ఆ డ్యాక్యుమెంట్‌ని రూపొందిస్తారు. 'బాహుబలి' వెయ్యేళ్ల క్రితం నాటి కథ కావడంతో... నాటి వాతావరణాన్ని వూహిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉండేలా డాక్యుమెంట్‌ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం.

    రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'బాహుబలి'లో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొలి భాగం చిత్రాన్ని వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    బాహుబలి కి చెందిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు...

    అలాంటిదే

    అలాంటిదే

    రాజులు,రాణి, వారి ప్రేమ కథ వింటున్నప్పుడు మాత్రం ఓ ప్రత్యేకమైన వూహాలోకంలోకి వెళ్లిపోతుంటాం. ఎవరి స్థాయిలో వాళ్లు వూహిస్తూ తృప్తి పొందుతుంటాం. మరి ఆ వూహలకే దృశ్యరూపం ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడదే చేస్తున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి... 'బాహుబలి' చిత్రంతో. మహిష్మతి రాజ్యం నేపథ్యంలో 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన.

    ఎక్కడా లేదు కానీ...

    ఎక్కడా లేదు కానీ...

    నిజానికి... మహిష్మతి పేరుతో చరిత్రలో ఎక్కడా రాజ్యం లేదు. కేవలం రాజమౌళి వూహల నుంచే ఆ రాజ్యం ఆవిష్కృతమైంది. ఆ రాజ్యంలో బోలెడన్ని కోటలు, రాజుల నివాసాలు, ఆయుధాగారాలు, యుద్ధ యంత్రాలు, పరికరాలు ఉంటాయి. అవన్నీ సెట్స్‌గా తీర్చిదిద్ది చిత్రాన్ని తెరకెక్కించారు.

    అన్నీ జాగ్రత్తలు

    అన్నీ జాగ్రత్తలు

    రాజమౌళి సినిమా వూహలకు అందని స్థాయిలో ఉంటుంది. ప్రతీ సన్నివేశంలోనూ భారీదనం ఉట్టిపడుతుంటుంది. ప్రస్తుతం తీస్తున్న 'బాహుబలి' కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకొన్నారాయన.

    సెట్స్ ...

    సెట్స్ ...

    రాజసం ఉట్టిపడేలా కనిపించే మహిష్మతి కోసం వేల సంఖ్యలో రేఖా చిత్రాల్ని గీయించి సెట్స్‌ వేశారు. అందులో ప్రతీ సెట్‌ కూడా ఓ కళాఖండంలా ఉంటుందని ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌ చెబుతున్నారు. ఇటీవల కొన్ని రేఖా చిత్రాల్ని విడుదల చేసింది చిత్రబృందం. అందులో వంద అడుగుల ఓ విగ్రహంతో పాటు, ఏనుగుతో నడిచే వార్‌ మెషిన్లు, కోటగోడలు దర్శనమిస్తున్నాయి.

    భల్లాలదేవ విగ్రహం

    భల్లాలదేవ విగ్రహం

    'బాహుబలి'లోరానా భల్లాలదేవ అనే పాత్రలో నటిస్తున్నారు. కథ రీత్యా ఆయన వంద అడుగుల నిలువెత్తు విగ్రహం సినిమాలో ఉంటుంది. దాన్ని సాబు సిరిల్‌, ఆయన బృందం నెలల పాటు కష్టపడి రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్‌గా తీర్చిదిద్దారు. ఆ విగ్రహం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. దానికి సంబంధించిన కాన్సెప్ట్‌ రేఖాచిత్రం కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ చిత్రం చూస్తుంటే సినిమాలో కూడా వంద అడుగుల విగ్రహాన్ని పైకి ఎత్తే సన్నివేశాలుంటాయేమో అనిపిస్తోంది.

    యుద్ధ యంత్రాలు

    యుద్ధ యంత్రాలు

    ఇప్పుడంటే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. మరి వెయ్యేళ్లక్రితం ఇంత సాంకేతికత ఎక్కడా? కానీ అప్పటి ఆలోచనలకు అనుగుణంగా సినిమాకోసం కొన్ని యుద్ధ యంత్రాల్ని తయారు చేశారు. ఏనుగుల సహాయంతో నడిచే ఆ యంత్రాలు కూడా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని తెలుస్తోంది. అలాగే సింహం ఆకారంలో ఉండే కొన్ని యంత్రాల రేఖా చిత్రాలు కూడా బయటికొచ్చాయి.

    భీకర యుద్ధం

    భీకర యుద్ధం

    సినిమాలో భీకరమైన ఓ యుద్ధ సన్నివేశాలుంటాయని సమాచారం. ఆ యుద్ధానికి కూడా ఓ ప్రత్యేకమైన పేరుందని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో 2 వేల మంది జూనియర్‌ ఆర్టిస్టుల నేపథ్యంలో ఆ సన్నివేశాల్ని తెరకెక్కించారు.

    సీజీ వర్క్

    సీజీ వర్క్

    సుధీర్ఘకాలం పాటు చిత్రీకరణ జరిపి ఆ ఎపిసోడ్‌ని తెరకెక్కించారు. వాటికి అదనంగా సీజీ హంగుల్ని జోడించి తెరపైకి తీసుకొస్తారు. సృజనాత్మక వూహలకు తోడుగా, సాంకేతికతని కూడా వినియోగించి సెట్స్‌ని తీర్చిదిద్దామని ప్రొడక్షన్‌ డిజైనర్‌, కళాదర్శకుడు సాబు సిరిల్‌ చెబుతున్నారు.

    ద్విపాత్రాభినయం

    ద్విపాత్రాభినయం

    బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది.

    అత్యాస పాయింట్

    అత్యాస పాయింట్

    మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు .రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.

    ఎప్పటికప్పుడు ఇన్ఫో

    ఎప్పటికప్పుడు ఇన్ఫో

    ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫోని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... వాట్స్ అప్ యాప్ లో దొరుకుతుందని చెప్తున్నారు. ఈ మేరకు 809675522 నెంబర్ ని విడుదల చేసారు. ఈ నెంబర్ ని మీరు వాట్సప్ లో యాడ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు చిత్రం గురించి ఎక్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.

    ఒకేసారి

    ఒకేసారి

    గత రెండు సంవత్సరాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రాణా, అనుష్క, తమన్న , నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మళయాళీ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Prabhas 's Bahubali directed by Rajamouli is readying for a grand release soon. And buzz is they will be releasing theatrical trailer treat on May 10th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X