Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఈ పోస్టర్..ఎక్సపెక్టేషన్స్ పెంచేస్తోంది
హైదరాబాద్ : పోస్టర్స్, ప్రోమోలు, ఫస్ట్ లుక్ లు వీటితోనే ఓపినింగ్స్ వచ్చేవి. అందుకే వాటి డిజైనింగ్ లో ప్రత్యేకమైన శ్రద్దని చూపిస్తూంటారు. తాజాగా హృతిక్‌రోషన్ హీరో నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రంలోని కొత్త పోస్టర్ సోమవారం విడుదలైంది. అందులో కత్రినాకైఫ్‌తో కలసి హృతిక్‌రోషన్ కనిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక అనుసంధాన వేదికల్లో ఆ పోస్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రమిది. హాలీవుడ్ చిత్రం 'నైట్ అండ్ డే'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సంస్థపై రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల రెండున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. 'జిందగీ మిలేగీ న దొబారా' చిత్రం తర్వాత హృతిక్, కత్రినా కలసి నటిస్తున్న చిత్రమిది. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు హృతిక్ నటించిన క్రిష్ చిత్రం తెలుగు, తమిళంలో మంచి వసూళ్లు సాధించడంతో....'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాన్ని కూడా తెలుగు తమిళంలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన 'తూ మేరీ' సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగులో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ మధ్య వచ్చే కొన్ని మూమెంట్స్ వావ్ అనే విధంగా ఉన్నాయి.