twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదీ పవన్ స్టామినా : "గోపాల గోపాల"ప్రీ రిలిజ్ బిజినెస్

    By Srikanya
    |

    హైదరాబాద్ :వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ సినిమా "గోపాల గోపాల" . ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరిగింది. కమర్షిల్ సబ్జెక్టు కాకపోయినా, పవన్ కళ్యాణ్ పై ఉన్న ఎక్సపెక్టేషన్స్, మల్టి స్టారర్ క్రేజ్ ఈ బిజినెస్ కు ప్లస్ అయ్యాయి. కొన్ని ఏరియాలు మినహాయిస్తే చిత్రం బిజినెస్ దాదాపు పూర్తయినట్లే... ఆ వివరాలు క్రింద ఇస్తున్నాం....

    https://www.facebook.com/TeluguFilmibeat

    ట్రేడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం....ఈ చిత్రం ఆంధ్రా(18 కోట్లు),తెలంగాణా(20 కోట్లు) కలిపి మొత్తం 38 కోట్లు బిజినెస్ చేసారు. అలాగే...దేశంలో మిగతా ప్రాంతాలు, ఓవర్ సీస్ అన్నీ కలిపి 46 కోట్లు కు చేరింది. ఈ బిజినెస్ చూసిన వారు షాక్ అవుతున్నారు. అన్ని ప్రాంతాల నుంచీ డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడి మరీ ఈ చిత్రం రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు చెప్తున్నారు.

    మరో ప్రక్క ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్లను సందర్భాలను బట్టి రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటీ వరకూ విడుదల చేసిన పోస్టర్లు అన్నింటికీ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం మరోసారి ప్రేక్షకుల ముందుకు గోపాల గోపాల లుక్‌ మరోటి విడుదల చేశారు. ఈ లుక్‌లో పంచకళ్యాణి రథంపై కృష్ణార్జునలను తలపించేలా ఉన్న ఈ పోస్టర్‌ మరింత ఆకట్టుకుంటోంది.

    Big Pre-Release Business for Gopala Gopala

    ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కిషోర్‌ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని డి.సురేష్‌బాబు, శరత్‌మారర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల పై అటు విక్టరీ అభిమానులతో పాటు పవర్‌స్టార్‌ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. '' అని తెలిపారు.

    శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్ర్కీన్‌ప్లేను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.

    ఇక గోపాల గోపాల సినిమాలో కేవలం మూడు పాటలే ఉన్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రంలో సాంగ్స్‌ లేకుండా చేద్దామనుకున్నా సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా మూడు పాటలు ప్లాన్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ టాక్‌. అయితే వీటిలో ఒక పాట మాత్రం వెంకటేష్‌, పవన్‌ల మధ్య సాగుతుందనే వార్తలు వచ్చాయి. మరో మూడు పాటలు చరణాలు మాత్రమే వినబడి బిట్స్‌ లాగా అనిపిస్తాయంట.

    మరీ వీటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే జనవరి (విడుదల) వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో కూడా ఎవరి ఊహకు అందనంతంగా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

    చిత్రం కథ విషయానికి వస్తే..

    దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

    అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారు. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Gopala Gopala film has been sold in 18Cr range in Andhra and around 38Cr AP/N Overall. The Overall WW Theatricals are done at around 46Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X