twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలా జరుగుతుందని ఊహించని వాళ్లకు షాకే : ‘ఖైదీ నంబర్ 150’టోటల్ కలెక్షన్స్

    'ఖైదీ నెం 150' సినిమా టోటల్ కలెక్షన్ల్ ట్రేడ్ లెక్కలు ప్రకారం..164 కోట్లు(గ్రాస్) దాటాయి.

    By Srikanya
    |

    హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ళ తర్వాత 'ఖైదీ నంబర్ 150' అంటూ వచ్చి అభిమానులకు సంబరాలను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఆయన రీ ఎంట్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోయింది.

    రీసెంట్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో అతి త్వరగా 100 కోట్ల గ్రాస్ వసూళ్ళు రాబట్టిన సినిమాగా 'ఖైదీ నంబర్ 150' నిలిచిందని ఇప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఇప్పటివరకూ వచ్చిన టోటల్ కలెక్షన్స్ ఎంత అనేది ఆసక్తకరమైన విషయంగా మారింది.

    వాస్తవానికి గత రెండు మూడేళ్లుగా టాలీవుడ్ సినిమాల మార్కెట్ భారీగా పెరిగిపోయింది. పెద్ద స్టార్స్ సినమాలు ఇప్పుడు మినిమం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి. కిందటేడాది నుంచి ఈ పోటీ మరీ పెరిగింది. కొన్ని నెలల కిందట ఉన్న కలెక్షన్స్ రికార్డును ఓవర్ కమ్ చేసి కొత్త సినిమాలు దూసుకెడుతున్నాయి. ఈ సంక్రాంతికి రిలీజైన ఖైదీ నంబర్ 150 కలెక్షన్స్ లో న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది.

    ఇంకో రికార్డ్

    ఇంకో రికార్డ్

    అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 164 కోట్లు షేర్ గ్రాస్ వసూలు చేసింది. అందులో 104 కోట్లు షేర్ వచ్చింది. దాంతో వంద కోట్లు దాటిన రెండో చిత్రంగా ఈ సినిమా రికార్డ్ చేసింది.ఈ విషయం తెలిసిన మెగాభిమానులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు.

     ఆల్ టైమ్ రికార్డ్

    ఆల్ టైమ్ రికార్డ్

    ఇక ఈ చిత్రం ఉత్తరాంద్రలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మిగతా ఏరియాల్లో మాత్రం బాహుబలి ...ది బిగినింగ్ ఆల్ టైమ్ రికార్డ్ గా ఉంది. అలాగే ఈ చిత్రం ఐదవ హైయిస్ట్ గ్రాసింగ్ సౌత్ మూవిగా ఇంకో రికార్డ్ ని సైతం క్రియేట్ చేసింది. బాహుబలి, రోబో, కబాలి, ఐ తర్వాత ఈ సినిమా ఐదవ ప్లేసులోకి వచ్చింది.

    అమెరికాలో వెనకబడ్డా

    అమెరికాలో వెనకబడ్డా

    కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ ఖైదీ ఏకంగా 78+ కోట్లు షేర్ వసూలు చేశాడు. ఆ తరువాత అమెరికాలో రికార్డుల్లో కాస్త వెనుక బడినా కూడా.. షుమారు 2.5 మిలియన్ డాలర్ల వరకు గ్రాస్ రాబట్టి. ఏకంగా 8.98 కోట్లు షేర్ వసూలు చేశాడు.

    అన్ని చోట్ల నుంచీ..

    అన్ని చోట్ల నుంచీ..

    చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. అమెరికాలో కంటే కూడా కర్ణాటక నుండి ఈ ఖైదీ నెం 150 .. 9.1+ కోట్లు వసూలే చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగతా దేశాల నుండి వచ్చిన కలక్షన్లను కలుపుకుంటే.. మొత్తంగా ఖైదీ నెం 150.. 104+ కోట్లు షేరు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

    ఇదీ లెక్క (షేర్ మాత్రమే)

    ఇదీ లెక్క (షేర్ మాత్రమే)

    నైజాం:రూ 19.5 కోట్లు

    సీడెడ్ :రూ 15.3 కోట్లు

    ఉత్తరాంధ్ర:రూ 12.90 కోట్లు

    గుంటూరు:రూ 7.30 కోట్లు

    కృష్ణా:రూ 5.75 కోట్లు

    ఈస్ట్ గోదావరి:రూ 8.15 కోట్లు

    వెస్ట్ గోదావరి:రూ 6.05 కోట్లు

    నెల్లూరు:రూ 3.45 కోట్లు

    ఖైదీ నెంబర్ 150 టోటల్ కలెక్షన్స్ (షేర్) :రూ 78.4 కోట్లు

    వరల్ట్ వైడ్ టోటల్ కలెక్షన్స్

    వరల్ట్ వైడ్ టోటల్ కలెక్షన్స్

    అమెరికారూ 8.98 కోట్లు, కర్ణాటక :రూ 9.10 కోట్లు, మనదేశంలో మిగిలిన ప్రాంతాలు:రూ 1.45 కోట్లు, అమెరికా కాకుండా మిగిలిన దేశాలు:రూ 3.32 కోట్లు, అన్ని చోట్లా ఓవర్ ప్లోల్ :రూ 2.75 కోట్లు). మొత్తంరూ 104 కోట్లు

    భయమేస్తోందన్నారు

    భయమేస్తోందన్నారు

    గీతా ఆర్ట్స్ అధినేత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఖైదీ నెంబర్ 150 తొలిరోజు కలెక్షన్లు చూసిన తర్వాత చిరంజీవితో 151వ సినిమా తీయాలంటే భయమేస్తోందని చెప్పారు. అంటే ఆ స్దాయిలో కలెక్షన్స్ అందుకునే సినిమా మళ్లీ తీయాలంటే కష్టమని ఆయన అభిప్రాయం.

    ఖర్చు అప్పుడే వచ్చేసింది

    ఖర్చు అప్పుడే వచ్చేసింది

    తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రల్లోనే కాకుండా అమెరికాలో కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తోందని ఆ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. ఈసినిమాకు సంబంధించి చిరు రెమ్యూనరేషన్ మినహాయిస్తే.. ఈ సినిమాకు పెట్టి ఖర్చు దాదాపు రూ.30 కోట్లు అని ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజునే రూ.47 కోట్ల షేర్ వచ్చేసిందని చెబుతున్నారు.

    మామూలు విషయం కాదు

    మామూలు విషయం కాదు

    సంక్రాంతి రేసులో విడుదలైన ఈ చిత్రం 53 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొన్నది. కలెక్షన్లపైనే దృష్టిపెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఓ భారీ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. కలెక్షన్లతోపాటు 50 రోజులు నడవడం సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చు. 50 రోజుల పండుగ అనే మాటే వినపడని ఈ రోజుల్లో బాస్ దెబ్బ‌కు అర్ధ‌శ‌త‌దినోత్స‌వం అనే మాట‌ను మ‌రోసారి గుర్తు చేసుకోవాల్సి వ‌చ్చింది. ‘ఖైదీ నంబ‌ర్ 150' చిత్రం 53 సెంట‌ర్ల‌ల‌లో 50 రోజుల‌ను పూర్తిచేసుకోవడం గమనార్హం.

    పరుగే పరుగు

    పరుగే పరుగు

    జిల్లా వారీగా పరిశీలిస్తే వైజాగ్‌లో 17 థియేటర్లు, ఈస్ట్ గోదావరి 2, వెస్ట్ గోదావరి 2, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా 3, నెల్లూరు 3, సీడెడ్-20, నైజాం, క‌ర్ణాట‌క‌లో ఒక సెంట‌ర్ల‌లో 50 రోజుల‌ను పూర్తిచేసుకుని శతదినోత్సవానికి పరుగులు పెడుతున్నది.

    ఎవరికి ఎంతెంత

    ఎవరికి ఎంతెంత

    ‘ఖైదీ నెం 150' చిత్రాన్ని తాను రూ. 60 కోట్లతో నిర్మించినట్లు ఇన్ కం టాక్స్ అధికారులకు రామ్ చరణ్ వెల్లడించినట్లు సమాచారం. ఈ సినిమాకు రూ. 75 కోట్లు కలెక్షన్ వచ్చినట్లు, ఈ సినిమా వల్ల తనకు రూ. 15 కోట్లు లాభం చేకూరినట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. చిరు, వినాయక్ రెమ్యూనరేషన్ ఇన్ కం టాక్స్ అధికారులకు సమర్పించిన లెక్కల్లో రామ్ చరణ్ ‘ఖైదీ నెం 150' సినిమాకు గాను చిరంజీవికి రెమ్యూనరేషన్ గా రూ. 20 కోట్లు, వినాయక్ కు రెమ్యూనరేషన్ గా రూ. 10 కోట్లు ఇచ్చినట్లు నిర్మాత రామ్ చరణ్ చూపించినట్లు సామాచారం.

    ఆ స్దాయిలో ...

    ఆ స్దాయిలో ...

    ‘ఖైదీ నంబర్ 150'చిత్రాన్ని చూడటానికి ..గుంటూరు జిల్లాలోని తక్కెళ్ళపాడు గ్రామవాసులంతా బళ్లు కట్టుకెళ్లారు. గుంటూరు జిల్లాలోని తక్కెళ్ళపాడు గ్రామవాసులంతా చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని చూపాలన్న ఉద్దేశంతో తమ ఎడ్లబండ్లను కట్టుకొని నారాయణపురం అనే పక్కనే ఉండే ఊర్లోని అలంకార్ థియేటర్‌కు ‘ఖైదీ నంబర్ 150' చిత్రం చూడటానికి వెళ్ళారట.

    హృతిక్ తో ..

    హృతిక్ తో ..

    ఇప్పుడు హిందీలోనూ రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోగా బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌గా అభిమానులు పిలుచుకునే హృతిక్‌ రోషన్‌ నటిస్తున్నట్లు సమాచారం. ముందు ఇందులో హీరోగా సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నాడని ఈ విషయమై సల్మాన్‌, మురగదాస్‌ల మధ్య చర్చలు కూడా జరిగాయని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత అక్షయ్‌ నటిస్తున్నట్లు కూడా వదంతులు వినిపించాయి. కానీ అక్షయ్‌ లిస్ట్‌లో వరుస సినిమాలు ఉండడంతో ఆ అవకాశం హృతిక్‌ని వరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మురగదాస్ డైరక్ట్ చేస్తారని తెలుస్తోంది.

    English summary
    Chiru's Khaidi No.150 Total Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X