twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దండిగా వసూలు చేస్తోంది: ‘దంగల్’ మరో రికార్డ్.... ప్రపంచంలో 5వ స్థానం!

    దంగల్’ మూవీ మరో రికార్డ్ తన సొంతం చేసుకుంది. ఈ వారం 300 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. నాన్-ఇంగ్లీష్ చిత్రాల కేటగిరీలో వరల్డ్ 5వ స్థానం దక్కించుకుంది.

    By Bojja Kumar
    |

    ముంబై: బాహుబలి సినిమాను సైతం దాటేసి వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'దంగల్' మూవీ మరో రికార్డ్ తన సొంతం చేసుకుంది. ఈ వారం 300 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఈ చిత్రం నాన్-ఇంగ్లీష్ చిత్రాల కేటగిరీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వరల్డ్ 5వ స్థానం దక్కించుకుంది.

    అంతకు ముందు బాహుబలి-2 మూవీ కంటే వెనక ఉన్న ఈచిత్రం..... చైనాలో రిలీజ్ తర్వాత భారీ వసూళ్లు తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెలుతోంది. ఈ చిత్రం ఇండియాలో 84.4 మిలియన్ డాలర్లను వసూలు చేయగా, చైనాలో 179.8 మిలియన్ డాలర్లు రాబట్టింది.

    ఓవరాల్ 300 మిలియన్ డాలర్లు

    ఓవరాల్ 300 మిలియన్ డాలర్లు

    ‘దంగల్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని ఏరియాల్లో కలిపి మొత్తం అపీషియల్ గా 300 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో అత్యధిక వసూళ్లను సాధించిన నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది.

    మొదటి స్థానంలో ది మేర్మెయిడ్

    మొదటి స్థానంలో ది మేర్మెయిడ్

    చైనాకు చెందిన ‘ది మెర్మేయిడ్' అనే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 533 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో ఈ చిత్రం వరల్డ్ నెం.1 స్థానంలో ఉంది.

    ది ఇన్ టచబుల్స్

    ది ఇన్ టచబుల్స్

    ఫ్రాన్స్‌కు చెందిన ‘ది ఇన్ టచబుల్స్' అనే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 427 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం వరల్డ్ నెం. 2 స్థానంలో ఉంది.

    మాన్ స్టర్ హంట్

    మాన్ స్టర్ హంట్

    చైనాకు చెందిన ‘మాన్ స్టర్ హంట్' అనే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 386 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం వరల్డ్ నెం. 3 స్థానంలో ఉంది.

    యువర్ నేమ్

    యువర్ నేమ్

    యువర్ నేమ్ అనే జపాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 354 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం నాలుగవ స్థానంలో ఉంది.

    English summary
    Aamir Khan's 'Dangal' has now achieved a new and huge milestone which has only been reached by four other movies in history. According to a report from Forbes, global ticket sales for the sports biopic now stand at $301 million, with $179.8 million coming from China and $84.4 million from India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X