twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దృశ్యం‌' కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ : కనిపించేదంతా నిజం కాదు అంటూ వచ్చిన వెంకటేష్ తాజా చిత్రం 'దృశ్యం‌' . ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై అందరి మన్ననలూ పొందింది. ఈ చిత్రం ఓపినింగ్స్ పెద్దగా రాలేదు. అయితే మొల్లిగా పికప్ అవుతోంది. టాక్ కి సినిమా కలెక్షన్స్ కు సంభంధం లేదు అంటున్నారు ట్రేడ్ లో. అయితే మెల్లిగా ఫ్యామిలీలకు పడుతోందని, వారు కదిలివస్తే సినిమా మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు. అయితే శని,ఆదివారాల్లో మాత్రం థియోటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. చిత్రం మూడు రోజుల కలెక్షన్స్ ఏరియా వైజ్ పరిశీలిస్తే

     Drishyam picks up slowly but steadily


    ఏరియా షేర్ (కోట్లలో)

    నైజాం 2.00

    సీడెడ్ 0.69

    నెల్లూరు 0.17

    కృష్ణా 0.34

    గుంటూరు 0.40

    వైజాగ్ 0.54

    పశ్చిమ గోదావరి 0.31

    తూర్పు గోదావరి 0.20

    మొత్తం తెలంగాణా,ఆంధ్రా కలెక్షన్స్ 4.65

    కర్ణాటక 0.45

    మిగిలిన ఇండియా 0.10

    ఓవర్ సీస్ 0.80

    మొదటి మూడు రోజుల షేర్ 6.00

    నిర్మాత మాట్లాడుతూ...''గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. వాటి వల్ల ఆయా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టేలా దర్శకురాలు తీర్చిదిద్దాం. అనేక సమకాలీన అంశాల్ని చిత్రంలో పొందుపరిచాం. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపే సన్నివేశాల్ని దర్శకురాలు చక్కగా తెరకెక్కించారు'' అన్నారు.

    మీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో కనిపించటం కూడా ప్లస్ అయ్యింది.

    వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్‌ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్‌ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది.

    నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్‌ సినిమాలు చేశారు. కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్‌ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి అన్నారు.

    English summary
    
 Family thriller Drishyam starring Venkatesh and Meena in lead roles has picked up its collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X