twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దృశ్యం' రీమేక్ : లాభమా? నష్టమా? నిజం ఏంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ : వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొంది విడుదలైన చిత్రం 'దృశ్యం'. ఓపినింగ్స్ పెద్దగా తెచ్చుకోలేక పోయిన ఈ చిత్రం బడ్జెట్, బిజినెస్ పరంగా భాక్సాఫీస్ వద్ద భారీగా సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం అందుతున్న సమాచారం ప్రకారం లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.

    24 రోజులకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ షేర్ 23.75 కోట్లు కలెక్టు చేసింది. అలాగే... శాటిలైట్ రైట్స్ నిమిత్తం...5.5 సంపాదించింది. అలాగే...వీడియో రైట్స్ నిమిత్తం ...40 లక్షలు వచ్చాయి. మొత్తం ఈ రెవిన్యూ..29.65 వచ్చింది. ఫైనల్ రన్ కి మొత్తం 30 కోట్లు వస్తుందని అంటున్నారు. ఇప్పటికీ వీకెండ్ లలో ఈ చిత్రం హౌస్ ఫుల్ అవుతోంది.

    ఇక ఈ చిత్రం ఖర్చు విషయానికి వస్తే...రీమేక్ రైట్స్ , ప్రింట్స్ , పబ్లిసిటి తో కలిపి 8 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం మిగతా ఖర్చులు పోను దాదాపు 20 కోట్లు లాభాలు వచ్చినట్లే అంటున్నారు.

    Drushyam Final Run: Collection & Business

    దర్శకురాలు శ్రీప్రియ తన దర్శకత్వ ప్రతిభ ని కేవలం అక్కడ సీన్స్ ని ఇక్కడ అనువదించటానికి మాత్రమే ఉపయోగించని విమర్శలు వినపడ్డాయి. అయితే వెంకటేష్ మాత్రం భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా చేయడంతో, అతనికో ల్యాండ్ మార్క్ సినిమాగా మారుతుందని అంటున్నారు.

    మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ హిట్ సినిమా 'దృశ్యం'కు రీమేక్ ఇది. డా.డి.రామానాయుడు సమర్పించారు. వెంకటేష్ తొలిసారి ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా నటించారు. మీనా కీలక పాత్రధారి. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అరకు, విజయనగరం, వైజాగ్, హైదరాబాద్, కేరళలో షూటింగ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేసారు.

    నరేష్, నదియ, రవి కాలే, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సమర్పణ: డా.డి.రామానాయుడు, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: శరత్, కథ: జీతూ జోసెఫ్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: స్వామి, ఆర్ట్: వివేక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సురేష్ బాలాజి, జార్జ్ పైయస్.

    English summary
    Based on statistics, The profit of 'Drushyam' will be over Rs 20 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X