twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గోపాల గోపాల’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే

    By Srikanya
    |

    హైదరాబాద్ : వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల' . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శనివారం (10వ తేదీ) విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్‌ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది.

    Gopala Gopala First day collections

    నైజాం: 2.82 కోట్లు

    సీడెడ్ : 1.62 కోట్లు

    ఉత్తరాంధ్ర: 87 లక్షలు

    తూర్పు గోదావరి: 1.21 కోట్లు

    పశ్చిమ గోదావరి: 76 లక్షలు

    కృష్ణా : 61.3 లక్షలు

    గుంటూరు: 1 కోట్లు

    నెల్లూరు : 30.14 లక్షలు

    మొత్తం ఎపి+నైజాం : 9.19 Crore

    గమనిక: ఇవన్నీ ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే

    చిత్రం కథేమిటంటే...

    దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.

    దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.

    ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటించారు.

    English summary
    Venkatesh and Pawan Kalyan starer Gopala Gopala amassed 9 plus Crore share on its first day of release in both the Telugu States.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X