twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గోవిందుడు...’ ఓవర్ సీస్ పరిస్ధితి??

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ చరణ్ హీరోగా మొన్న బుధవారం ‘గోవిందుడు అందరివాడేలే'విడుదలైన సంగతి తెలిసిందే. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం 4 కోట్లకు ఓవర్ సీస్ లో అమ్మినట్లు సమచారం. ఇప్పటిదాకా రామ్ చరణ్ చిత్రాల్లో ఇది రికార్డు. కృష్ణ వంశీ డైరక్ట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్టైర్ కావటంతో ఆ రేటుకి అమ్మారు. అయితే మొదటి రోజు మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్నా తర్వాత సెకండ్ డే నుంచి డ్రాప్ అవటం మొదలెట్టింది. దాంతో పెట్టిన పెట్టుబడి నాలుగు కోట్లు రివకరీ అవటం కష్టం అంటున్నారు.

    అక్టోబర్ 2నుండి 6(బక్రీద్) వరకూ వరుసపెట్టి శెలవులు రావడంతో ఈ సినిమా కలెక్షన్లకు ఇబ్బంది ఉండటం లేదు. అలాగే వచ్చే వారం కూడా పెద్ద సినిమాలు ఏమి విడుదల కాని నేపధ్యంలో ఈ గోవిందుడి విజయానికి అడ్డు లేదని అంటున్నారు. అయితే అనుకున్నంతగా మాత్రం రికార్డు క్రియేట్ చేయటం లేదు.

    Govindudu Andarivaadele overseas in loss due to Ram Charan?

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... కృష్ణవంశీ కలనీ, కథనీ ప్రేక్షకుల మధ్యకి తీసుకెళ్లడానికి చిత్రబృందం అంతా చేసిన కృషిలో నేనూ ఓ చేయి వేశానంతే. ఏ ఒక్కరి వల్ల సినిమా ఆడదు. ఓ అందమైన చిత్రంలో ప్రతి రంగుకీ ప్రాధాన్యం ఉంటుంది. ఈ రంగు వల్లే బొమ్మకి అందం వచ్చింది అని చెప్పలేం. 'గోవిందుడు..' సెట్స్‌కి నేనెప్పుడూ హోం వర్క్‌ చేసి వెళ్లలేదు. బాలరాజు వయసు నాది కాదు. ఆ జీవితం నాది కాదు. కృష్ణవంశీ అనుభవాలు, ఆయన జీవితాన్ని, సమాజాన్ని చూసిన విధానం.. ఇవన్నీ రంగరించి ఆ పాత్రను ఆయనే మలిచాడు అన్నారు.

    ఇక ఈ చిత్రం కథ... ఎన్నారై అభిరామ్(రామ్ చరణ్)కి చిన్నప్పటి నుంచి భారతీయ సంప్రదాయాలంటే మక్కువ. తన తండ్రి ద్వారా తన కుటుంబం విడిపోయిన తీరు తెలుసుకుని, దాన్ని సరిచేసి తన తండ్రి కళ్లల్లో ఆనందం చూడటానికి ఇండియా వస్తాడు. అక్కడ తన తాత బాలరాజు(ప్రకాష్ రాజ్) అనే గ్రామ పెద్ద కి తనెవరో చెప్పకుండా ఆ కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. తన బాబాయ్ (శ్రీకాంత్) ని కలిసి అతని ప్రేమ సమస్యను తీరుస్తాడు. తన మనవడు అని తెలిసాక బాలరాజు ఎలా స్పందిచాడు. ఎలా తన కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చి కుటుంబాన్ని ఒకటి చేసాడు అనేది మిగతా కథ.

    English summary
    Ram Charan Tej's ‘GAV’ was reportedly sold for more than Rs.4 crore for overseas , but it looks, that chances of covering the total investment, are not bright enough.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X