twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి 'బాహుబలి2' మరో సంచలనం! అంతా షాక్

    By Srikanya
    |

    హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతోన్న బాహుబలి2 (ద కంక్లూజన్)కు రిలీజ్ కు ముందే రికార్డులు బ్రద్దలు కొడుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నైజాం రైట్స్ ను ఎసియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 40 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

    తాజాగా 'బాహుబలి2' చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ ను సోనీ టీవీ 51కోట్లకు దక్కించుకుంది. ఈ మొత్తానికి సర్వీస్ ట్యాక్స్ లు అదనం. బాహుబలి పార్ట్ 1(ద బిగినింగ్) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులను కొల్లగొట్టడంతో పార్ట్ 2కు మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో బాహుబలి కోసం మార్కెట్ వర్గాలు క్యూకడుతున్నాయి. ప్రీ రిలిజ్ బిజినెస్ దుమ్మురేపుతోంది.

    ఇప్పటికే, బాహుబలి2 ఓవర్సీస్ రైట్స్ తెలుగు, తమిళం, హిందీ కలిసి థియేటర్ రైట్స్ 47కోట్లకు అమ్మినట్టు ఇప్పటికే వార్తలు వినిపించాయి. మొత్తానికి ఏ హక్కులైన మినిమం 50కోట్లకు ఏమాత్రం తగ్గకుండా మార్కెట్ కావడం ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.

    ఇదిలా ఉండగా... ఏప్రిల్ 28,2017న విడుద‌ల కానున్న ఈ సినిమా ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మూడు వెర్షన్స్ (తెలుగు, తమిల, మళయాళం) కు గానూ 45 కోట్లు కు అమ్ముడయ్యాయి. ఓవర్ సీస్ రైట్స్ ఈ స్దాయిలో అమ్ముడవటం ఓ ఇండియన్ సినిమాకు రికార్డే. యుఎస్ లోని టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో ఒకటైన గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ వారు ఈ మొత్తాన్ని వెచ్చించి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

    ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ విషయానికి వస్తే... ప్రస్తుతం ముంబయి ఫిలిం ఫెస్టివల్ వైభవంగా జరుగుతోంది. ఫిలిం సెలెబ్రెటీలతో ముంబయి నగరం కళకళలాడుతోంది. అదే వేడుకలో 'బాహుబలి: ది కంక్లూజన్' ఫస్ట్ రిలీజ్ చేస్తే మంచి ప్రచారం దక్కుతుందని భావించారు దర్శక నిర్మాతలు. బాహుబలి హిందీ సమర్పకుడు కరణ్ జోహార్ తో పాటు బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో 'ది కంక్లూజన్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

     హిందీ వెర్షన్ కు మాత్రం

    హిందీ వెర్షన్ కు మాత్రం

    అలాగే ఈ చిత్రం హిందీ వెర్షన్ ని ఇదే సంస్ద వారు ఓవర్ సీస్ లో కమీషన్ బేసిస్ లో రిలీజ్ చేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇక ఈ రైట్స్ కోసం చాలా పెద్ద పెద్ద సంస్దలు రంగంలోకి దిగాయి. కానీ ఊహించని రేట్ తో గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ వారు క్లోజ్ చేసారు.

     రివకరీ రెండు వారాలకే..

    రివకరీ రెండు వారాలకే..

    ఇక గ్రేట్ ఇండియా ఫిల్మ్ వారు గతంలో పోకిరి, కిక్, రన్ రాజా రన్, టెంపర్, బాద్షా, ప్రేమమ్ (మళయాళం) వంటి సూపర్ హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నారు. బాహుబలి 2 కూడా ఘన విజయం సాధిస్తుందని, ఓపినింగ్స్ విపరీతంగా ఉంటాయని అంతా భావిస్తున్నారు. 45 కోట్లు పెద్ద మొత్తంగా కనపడినా, రెండు వారాల్లో రికవరీ ఉండి , లాభాల్లో పడిపోతారని చెప్తున్నారు.

     52 కోట్లకు అక్కడ రైట్స్

    52 కోట్లకు అక్కడ రైట్స్

    ఈ సినిమా త‌మిళ హక్కులను ‘కే ప్రొడక్షన్స్‌' సంస్థ అధినేత ఎస్‌ఎన్‌ రాజరాజన్‌ పొందారు. అంతేకాకుండా తమిళనాట తెలుగు వెర్షన్‌ను విడుదల చేసే హక్కులను కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయ‌న దాదాపు రూ.52 కోట్లు బాహుబ‌లి నిర్మాత‌ల‌కు చెల్లించాడ‌ని టాక్.

     ఆయనకే తమిళనాట తెలుగు రైట్స్

    ఆయనకే తమిళనాట తెలుగు రైట్స్

    ఈ సినిమా త‌మిళ హక్కులను ‘కే ప్రొడక్షన్స్‌' సంస్థ అధినేత ఎస్‌ఎన్‌ రాజరాజన్‌ పొందారు. అంతేకాకుండా తమిళనాట తెలుగు వెర్షన్‌ను విడుదల చేసే హక్కులను కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయ‌న దాదాపు రూ.52 కోట్లు బాహుబ‌లి నిర్మాత‌ల‌కు చెల్లించాడ‌ని టాక్. తెలుగు రైట్స్ పై కూడా ఆయనకి మంచి ఆదాయం వస్తుందని ఆయన లెక్కలు వేసుకునే తీసుకున్నట్లు చెప్తున్నారు.

     రానా సీన్ లోకి వచ్చి బిజినెస్

    రానా సీన్ లోకి వచ్చి బిజినెస్

    తమిళ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 'బాహుబలి 2' రైట్స్ ను కోలీవుడ్ లో అదేవిధంగా మాలీవుడ్ లో 'కె ప్రొడక్షన్ హౌస్' భారీ మొత్తానికి అమ్మడం వెనుక రానా చేసిన రాయబారాలే ప్రధాన కారణం అని అంటున్నారు. 'బాహుబలి 2' తెలుగు తమిళ వెర్షన్స్ అదేవిధంగా మలయాళ వెర్షన్స్ కు సంబంధించి తమిళనాడు కేరళా రాష్ట్రాలలో అత్యంత భారీ మొత్తానికి 'బాహుబలి 2' ను మార్కెట్ చేయటం వెనక రానా, ఆయన తండ్రి సురేష్ బాబు ఉన్నట్లు టాక్.

    పోటీ పడి మరీ హిందీ శాటిలైట్ రైట్స్ ని

    పోటీ పడి మరీ హిందీ శాటిలైట్ రైట్స్ ని

    'బాహుబలి 2' ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే దిమ్మతిరిగిపోతోంది. బాహుబలి క్రియేట్ చేసిన క్రేజ్ దృష్ట్యా పార్టు 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అన్నీ ఏరియాల్లోనూ బాహుబలి కి ఫుల్ డిమాండ్ నెలకొంది. పోటీపడి మరీ.. బాహుబలి రైట్స్ ని దక్కించుకొంటున్నారు. హిందీ వెర్షన్ శాటిలైట్ హక్కులను జీఈసీ ఛానల్ వారు 55 కోట్లకు తీసుకున్నట్లు చెబుతున్నారు.

    నిజమేనా లేక రూమరా

    నిజమేనా లేక రూమరా

    బాహుబ‌లి-2పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. వ‌చ్చే ఏడాది రానున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా, ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది. తెలిసిన స‌మాచారం ప్ర‌కారం బాహుబ‌లి-2 ఇప్ప‌టికే 400 కోట్ల రూపాయ‌ల బిజినెస్ దాటేసింద‌ని చెబుతున్నారు. ఇంకా చాలా ఏరియాల్లో బిజినెస్ చేయాల్సి ఉంది. దీంతో ఇంకా బిజినెస్ పెరుగుతుంద‌ని ట్రేడ్ పండితులు అంటున్నారు. మొత్తానికి దేశంలో సినీ చ‌రిత్ర‌లోనే సంచ‌ల‌న చిత్రంగా ఉంటుంద‌ని అనుకుంటున్నారు.

    సెకండ్ పార్ట్ లో స్వీటి నే మొత్తం

    సెకండ్ పార్ట్ లో స్వీటి నే మొత్తం

    బాహుబలి పార్ట్ 2లో హవా అంతా అనుష్కదే ని మీడియాలో బలంగా వినిపిస్తోంది. బాహుబలి ద కంక్లూజన్ లో రెండు అదిరపోయే యుద్ధ సన్నివేశాలు ఉన్నా ... కీలకపాత్ర పోషించేది హీరోయిన్‌ అనుష్కేనట. ఒక యుద్ధం ప్రభాస్‌-అనుష్క మధ్య, మరో యుద్ధం రానా-అనుష్క నడుమ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ రెండు వార్ సీన్సే సినిమాకు హైలైట్ అన్నది ఫిల్మ్ నగర్ టాక్. రానా-అనుష్క మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయట. 'బాహుబలి' మొదటి భాగంలో పెద్దగా ప్రాధాన్యం దక్కకపోయినా.. రెండో భాగంలో మాత్రం ఆ లోటు తీరుస్తుందన్నమాట స్వీటీ.

    అంత కలెక్షన్స్ వస్తాయా..మరీ ఓవర్

    అంత కలెక్షన్స్ వస్తాయా..మరీ ఓవర్

    వచ్చే సంవత్సరం విడుదల కాబోతున్న రాజమౌళి 'బాహుబలి 2' పై ఒక ఆశ్చర్యకరమైను జోక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ జోక్ వివరాలలోకి వెళితే 'బాహుబలి 2' 1000 కోట్ల సినిమాగా మారుతుందని, వెయ్యికోట్లు కలెక్షన్స్ దాటినా ఆశ్చర్యపడక్కర్లేదని ఆ సినిమాను కొనుక్కోవడానికి ఆసక్తి కనపరుస్తున్న బయ్యర్ల దగ్గర ఈసినిమా నిర్మాతలు కామెంట్ చేస్తున్నట్లు టాక్. అయితే బాహుబలి-2 ఎంత పెద్ద హిట్టైనా వెయ్యి కోట్లు కోట్లు రావటం అనేది జరగని పనే అనే విషయం నిర్మాతలకు తెలియదా. వాళ్ల మీద బురద జల్లటం కాకపోతే

     బాహుబలి 2 కు పోటీ ఇచ్చేది అదే

    బాహుబలి 2 కు పోటీ ఇచ్చేది అదే

    బాహుబలి రికార్డుల్ని ఏ సినిమా తిరగ రాస్తుంది? బాహుబలి - 2 ఆ పని చేస్తుందా? లేక రోబో -2 డిసైడ్ చేస్తుందా? ఇదే ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారింది. బాహుబలి రికార్డుల్ని చూసి శంకర్ ...రోబోకు సీక్వెల్ గా రోబో -2 ప్లాన్ చేశాడని కొందరు అనుకుంటున్నారు. రోబో -2 కంటే బాహుబలి -2 ముందు రిలీజ్ అవుతుంది. ఇప్పటికే బాహుబలి 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా రోబో 2 విడుదల తేదీపై క్లారిటీ లేదు. రెండింటిలోనూ గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

     ఈ రొమాన్స్ పార్ట్ 2 కు హైలెట్

    ఈ రొమాన్స్ పార్ట్ 2 కు హైలెట్

    బాహుబలి 2 చిత్రానికి సంబంధించి యుద్ద సన్నివేశాలు పూర్తి కాగా రాజమౌళి ఇప్పుడు పాటలపై ప్రత్యేక దృష్టి పెట్టాడట. ఈ చిత్రంలో అమరేంద్ర బాహుబలిగా నటిస్తున్న ప్రభాస్, దేవసేనగా నటిస్తోన్న అనుష్క పై వచ్చే కొన్ని సాంగ్స్ చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం భారీ బరువు పెరగిన అనుష్క అది తగ్గించుకోవడం కోసం ఇన్నాళ్ళు టైం తీసుకుంది. ఇప్పుడు స్వీటీ సన్నగా మారడంతో అనుష్క పై వచ్చే డ్రామా, పాటల సన్నివేశాలను జక్కన్న తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

     రాజమౌళి మాట్లాడుతూ...

    రాజమౌళి మాట్లాడుతూ...

    ‘రెండు పాటలు మినహా బాహుబలి-2 షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 5న అభిమానులను ఆశ్చర్యపరచనున్నాం. వర్చ్యువల్ రియాల్టీ ద్వారా ప్రేక్షకులను మాహిష్మతి రాజ్యంలోకి తీసుకెళ్లబోతున్నాం. మేము తయారు చేసిన ప్రత్యేక కార్ బోర్డు ద్వారా స్మార్ట్ ఫోన్లు వాడే ప్రతీ వ్యక్తి ఈ అనుభూతిని పొందుతాడని' తెలిపారు. బాహుబలి వృక్షంలో ఎన్నో కొమ్మలున్నాయని, బాహుబలి ఆరంభం కాదు..ముగింపు కాదని తెలిపాడు రాజమౌళి .

     డిసెంబర్ నాటికి

    డిసెంబర్ నాటికి

    నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.... ముఖ్యమైన సీన్స్ అన్ని షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ నాటికి పాటలతో పాటు మొత్తం చిత్రీకరణ అంతా పూర్తి చేసేస్తాం. ఏప్రిల్‌ 28న బాహుబలి 2 విడుదల చేస్తాం. జనవరిలో ట్రైలర్ వస్తుందన్నారు.

     ఫస్ట్ లుక్ ఆ రోజే

    ఫస్ట్ లుక్ ఆ రోజే

    ప్ర‌భాస్ మాట్లాడుతూ ``బాహుబ‌లి కామిక్ బుక్స్ విడుద‌ల చేస్తున్నాం. అక్టోబ‌ర్ 22న విడుద‌ల చేస్తాం. నా ఫ్యాన్స్, అంద‌రూ ఎదురుచూస్తున్న ఫ‌స్ట్ లుక్‌ను అక్టోబ‌ర్ 22న నా పుట్టిన‌రోజుకు ఒక రోజు ముందు ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేస్తున్నాం`` అని చెప్పారు.

     హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగిన నేను..

    హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగిన నేను..

    రానా మాట్లాడుతూ చిన్నతనం నుంచి యుద్ధ నేపథ్యంలో సాగే హాలీవుడ్ చిత్రాలు చూస్తూ పెరిగాను. అవంటే చాలా ఇష్టపడే వాడిని. మనం కూడా ఆ తరహా సినిమాలు చేయలేమా అనిపించేది. అప్పుడే రాజమౌళి మాహిష్మతి సామ్రాజ్యం గురించి చెప్పారు అని తెలిపారు.

    ఇక్కడకు చాలు

    ఇక్కడకు చాలు

    బాహుబలి మూడోపార్ట్ విషయమై రాజమౌళి మాట్లాడుతూ..... తాను 'బాహుబలి-3' తీయడం లేదని, ప్రస్తుతం వెలువడుతున్న పుకార్లను నమ్మొదంటూ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు.'బాహుబలి-2'తోనే కథ ముగిసిపోతుందని... దీన్ని కొనసాగించడం లేదని వెల్లడించారు. అయితే మునుపెన్నడూ లేని రీతిలో అనుభూతిని పంచే విధంగా 'బాహుబలి' కొనసాగుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాల సమయానుకూలంగా ప్రకటిస్తానని తెలిపారు.

     ఉంది కానీ ఆమెపై కాదు అనుష్క పైనే

    ఉంది కానీ ఆమెపై కాదు అనుష్క పైనే



    ''అవును.. బాహుబలి 2 తమన్నా పాత్ర నిడివి తక్కువే. మొత్తం అంతా అనుష్క చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తమన్నా సీన్లలో ఎంతవరకు అవసరమో అంతవరకే కనిపిస్తుంది. అసలు ప్రభాస్-తమన్నాపై ఒక్కటంటే ఒక్కపాట కూడా ఉండదు'' అన్నారు రాజమౌళి.

    ఆయనకు ఒక్కరికే తెలుసు

    ఆయనకు ఒక్కరికే తెలుసు

    బాహుబలి 2 కథలో తర్వాత ఏం జరుగుతుంది అనే విషయమై బయిట అనేక రూమర్స్ వస్తున్నాయని, అయితే ఏం జరుగుతుందన్న విషయం కేవలం తనకు ఒక్కరికి మాత్రమే తెలుసంటూ రాజమౌళి ట్వీట్‌ చేసి క్లారిటీ ఇచ్చారు. దాంతో బయిట వస్తున్న వార్తలను నమ్మాలో వద్దో అనే డైలమోలో అభిమానులు పడ్డారు. ఎందుకంటే కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడన్నదే ఇక్కడ కీలకం కదా.

    గ్రాఫిక్ వర్క్ అంతా అక్కడే..

    గ్రాఫిక్ వర్క్ అంతా అక్కడే..

    బాహుబలి 2 చిత్రానికి సంభందించిన..గ్రాఫిక్స్ వర్క్ అంతా.. లాస్ ఏంజెల్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ కంపెనీల్లో సీజీ వ‌ర్క్ జ‌రుగుతోంది. వ‌ర్చువ‌ల్ రియాలిటీకి సంబంధించింది ముఖ్యంగా అక్క‌డ జ‌రుగుతోంది. సీఎన్‌సీపీటీ అనే కంపెనీ లాబీ పాట్స్ ను ఇస్తోంది. వీఆర్ ఎక్స్ పీరియ‌న్స్ అనేది జాన్ రిఫెల్ కి చెందిన కంపెనీ అది. వ‌ర్చువ‌ల్ రియాలిటీకి సంబంధించిన పార్ట్స్ కోసం వేరే కంపెనీలతో క‌లిసి చేస్తున్నామని రాజమౌళి తెలిపారు.

     బాహుబలి 2 బడ్జెట్ ఎంతంటే

    బాహుబలి 2 బడ్జెట్ ఎంతంటే

    బాహుబలి ది కంక్లూజన్ కోసం.. ఏకంగా వంద రోజుల షూటింగ్ ప్లాన్ చేయడమే కాకుండా.. 5వేల మంది ఆర్టిస్టులను ఉపయోగిస్తున్నారనే విషయం తెలిసిందే. కేవలం క్లైమాక్స్ చిత్రీకరణే 30 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు దర్శక నిర్మాతలు. ఒక క్లైమాక్స్ కే 30 కోట్ల చొప్పున.. మొత్తం సినిమాకి 200 కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

    English summary
    Now, Sony TV closed the deal with 'Baahubali' makers for satellite rights. The entertainment channel bought the Hindi version's satellite rights for a whopping Rs 51 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X