twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘చంద్రకళ’ శాటిలైట్ రైట్స్ ఎంతకి అమ్మారంటే

    By Srikanya
    |

    హైదరాబాద్ : హన్సిక ప్రధాన పాత్ర పోషించిన డబ్బింగ్ చిత్రం ‘చంద్రకళ' ఈ నెల 19న విడుదల అయిన సంగతి తెలిసిందే. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అరన్మణి' సినిమాను ‘చంద్రకళ' పేరుతో తెలుగులోకి అనువదించారు శ్రీ శుభశ్వేత ఫిల్మ్స్‌ సంస్థ. ఈ చిత్రం విడుదలై ఇక్కడ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ వైజ్ ఫరవాలేదనిపిస్తోంది. హన్సిక నటించటం ప్లస్ అయ్యింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ధర్డ్ పార్టీకి రీసెంట్ గా అమ్మారు. 90 లక్షలకు ఈ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం.

    నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘తమిళంలో ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. తెలుగులో కూడా విజయం సాధిస్తోంది. హారర్‌ టచ్‌తో థ్రిల్లింగ్‌గా ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌ ఆడియన్స్‌కి కొత్త అనుభూతి కలిగిస్తాయి. ఈ సినిమా షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. మా బేనరులో ‘చందమామ' చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయిందో అంతకుమించి ‘చంద్రకళ' విజయం సాధిస్తుంది' అని తెలిపారు.

    Hansika's Chandrakala satellite rights sold

    మురళి(వినయ్ రాయ్)కుటుంబానికి చెందిన ఓ జమీందారు బంగ్లా అమ్మకానికి పెడతారు. దాన్ని శుభ్రం చేయటానికి వచ్చిన వారంతా ఒకరు తర్వాత మరొకరు మాయమవుతూంటారు. దాంతో ఆ భవంతిలో దెయ్యం తిరుగుతోందని,అదే ఇదంతా చేస్తోందని అందరూ భావించి,భయపడతారు. అప్పుడు ఆ ఇంటికి మురళి భార్య అన్న అయిన రవి(సుందర్.సి) వస్తాడు. ఆయన ఈ సంఘటనలు వెనక ఉన్న కారణాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఈ లోగా తన చెల్లిలే(ఆండ్రియా) ఈ హత్యలన్నీ చేస్తోందని తెలుసుకుని షాక్ అవుతాడు. అప్పుడు రవి ఏం చేసాడు...తన చెల్లికీ చంద్రకళ(హన్సిక) కీ సంభంధం ఏమిటి.. ఇంతకీ చంద్రకళ ఎవరు..ఆ భవంతికి చంద్రకళకూ ఉన్న సంభంధం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే మిగతా కథ తెలుసుకోవాల్సిందే.

    హన్సిక, విమల్‌, లక్ష్మీరాయ్‌, ఆండ్రియా, సుందర్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, సంతానం నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, పాటలు: వనమాలి, సంగీతం: కార్తీక్‌రాజా, భరద్వాజ్‌, ఫొటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌, సహనిర్మాత: పద్మారావు వాసిరెడ్డి, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్‌ సి.

    English summary
    Hansika, Andhra,Raai Lakshmi's Chandrakala's satellite rights have been sold to the third party for Rs 90 lakhs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X