twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వసూళ్లు కేక: రూ. 300 కోట్ల దిశగా పరుగులు...

    By Bojja Kumar
    |

    ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ తాజా సినిమా ‘హ్యాపీ న్యూఇయర్' బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో షారుఖ్, దీపిక జంటగా నటించిన ఈ చిత్రం భారీవసూళ్లతో దూసుకుపోతోంది. షారుఖ్ నటించిన చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూఇయర్ చిత్రాలు వరుసగా విజయాలు సాధించి బాక్సాఫీసును షేక్ చేశాయి.

    ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లో దాదాపు 237 కోట్లు వసూలుచేసి, 300 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధమైంది. ఈ చిత్రం విదేశాల్లో దాదాపు 50కోట్లకు పైగా వసూలుచేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మరో వారంలో ఈ సినిమా 300 కోట్లు వసూళ్లు చేస్తుందని అంటున్నారు.

    Happy New Year 10 Days Box Office Collection

    అంతా ఊహించినట్లుగానే ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం అంచనాలు ఏ మాత్రం తప్పలేదు. తొలిరోజే రూ. 44 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఈ చిత్రం ద్వారా షారుక్ ఖాన్ చిన్న కొడుకు అబ్ రామ్ కూడా వెండి తెర ఎంట్రీ ఇచ్చాడు. సినిమా విజయం కంటే తన చిన్న కుమారుడు అబ్ రామ్ తెరపై కనిపించడమే ఆనందంగా ఉందని, ఈ క్రెడిట్ అంతా దర్శకురాలు ఫరా ఖాన్ కే దక్కుతుందని షారుక్ ఖాన్ తెలిపారు. ఒకసారి షూటింగు స్పాటుకు వచ్చిన అబ్ రామ్‌ను ఫరా ఖాన్ చొరవ తీసుకుని ఓ సీన్ షూట్ చేసారని, సనిమా ఎండింగులో టైటిల్స్ పడే సమయంలో అబ్ రామ్ కనిపిస్తాడని షారుక్ తెలిపారు. షారుక్-గౌరీ దంపతులకు అబ్ రామ్ సరోగసీ పద్దతి ద్వారా కలిగిన సంతానం.

    షారుక్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రానికి ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ‘మైహూనా', ‘ఓం శాంతి ఓం' తర్వాత షారుక్ ఖాన్ హీరోగా లేడీ డెరైక్టర్ ఫరా ఖాన్ రూపొందించిన మూడో చిత్రమిది. ఈ సినిమాను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ నిర్మించారు.

    English summary
    Shahrukh Khan's multi-starrer Bollywood flick Happy New Year has maintained a steady pace at the Indian Box Office even on its second weekend with a fine collection on second Sunday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X