twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ డబ్బింగ్ చిత్రానికి ఇంత క్రేజా? డిస్ట్రిబ్యూటర్స్ , బయ్యర్లు నుంచి నిర్మాతకు ఫోన్స్

    మోహ‌న్‌లాల్ మరో హిట్ ఒప్పం సినిమాని క‌నుపాప‌ పేరుతో తెలుగైజ్ చేసేస్తున్నారు. ఈ చిత్రానికి మంచి క్రేజ్ ట్రేడ్ లో వచ్చింది.

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇప్పుడు టాలీవుడ్ లో మోహన్ లాల్ హవా ప్రారంభమైంది. ఊహించని విధంగా ఆయన క్రేజ్ ఇక్కడ స్టార్టైంది. ఆయన సినిమాలకు ట్రేడ్ సర్కిల్స్ లో డిమాండ్ ఏర్పడింది. ఆయన సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. మినిమం గ్యారెంటీగా సినిమా ఉంటుందని నమ్మి మోహన్ లాల్ బ్రాండ్ పై డబ్బు పెట్టడానికి సిద్దపడుతున్నారు.

    ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్, యేలేటి 'మనమంతా', రీసెంట్ గా విడుదలైన 'మన్యం పులి' (పులి మురగన్ డబ్బింగ్ )చిత్రాలతో లాల్ హ‌వా మ‌ళ్లీ టాలీవుడ్‌లో మొద‌లైంది. చాలా గ్యాప్ త‌ర్వాత ఒకే ఏడాదిలో మూడు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం అంటే గ్రేట్. ప్ర‌స్తుతం ఇదే పాజిటివ్ టాక్ మోహ‌న్‌లాల్‌కి బాగా క‌లిసొస్తోంది. ఈ హుషారులోనే .. లాల్ న‌టించిన సినిమాల‌న్నీ టాలీవుడ్‌లో క్యూ క‌ట్టేస్తున్నాయి.

    Huge demand for Mohanlal's Oppam dubbing

    అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం ఏఎన్నార్, బాలకృష్ణల 'గాడీవం' చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన ఆయన మళ్ళీ ఈ 2106 లోనే తెలుగు ప్రేక్షకులకు దర్శనమిచ్చాడు. తెలుగు వాళ్ళు కూడా ఆయన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు. 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఆయన పాత్రకు మంచి ఆదరణ దక్కగా ఆయన సోలోగా చేసిన 'మనమంతా', రీసెంట్ గా విడుదలైన 'మన్యం పులి' చిత్రాలు మంచి సినిమాలనే టాక్ తెచ్చుకుని డబ్బులు తెచ్చిపెడుతున్నాయి.

    ఆ స్పీడులో మోహ‌న్‌లాల్ న‌టించి మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఒప్పం సినిమాని క‌నుపాప‌ పేరుతో తెలుగైజ్ చేసేస్తున్నారు. ఓ పాప‌, చూపులేని వ్య‌క్తి, ఓ హ‌త్య కేసు చుట్టూ ఇంట్రెస్టింగ్ ట్విస్టుల‌తో సాగే ఈ సినిమా తెలుగువారిని మెప్పిస్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. డిసెంబ‌ర్ 30న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి బిజినెస్ సర్కిల్ లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యిందని సమాచారం.

    ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి క్రేజీ ఆఫర్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ సందడి చేస్తున్నట్లు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ముఖ్యంగా ఒప్పం చిత్రం మళయాళంలో ఘన విజయం సాధించటం, ప్రియదర్శన్ కాంబినేషన్ కావటం, మోహన్ లాల్ నటన, సినిమా లో పాప సెంటిమెంట్ , యాక్షన్ ఎపిసోడ్స్ , ధ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచేస్తున్నాయి. తెలుగులో ఒప్పం డబ్బింగ్ వెర్షన్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

    మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Mohanlal's another Malayalam blockbuster 'Oppam' has got its Telugu title. The film has been titled 'Kanupapa'.The film is now being craze to buyers with tremendous interest, so much so that distributors are fighting for its rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X