twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడుదల తేదీ ఓ రోజు ముందుకు తోసారు

    By Srikanya
    |

    హైదరాబాద్: నవదీప్‌, తేజస్వి జంటగా రూపొందిన చిత్రం 'ఐస్‌క్రీమ్‌'. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోందని అన్నారు కానీ ఇప్పుడది ఓ రోజు వాయిదా పడింది. మరుసిట రోజు అంటే 12 వ తేదీన మన ముందుకు రానుంది. కొత్త తరహా కెమెరా టెక్నిక్ వాడారని, నగ్నంగా నటించారని చెప్పబడుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

    రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఓ సంచలనం. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా అది వార్త అయి కూర్చుంటుంది. ఆఖరికి ఆయన పెట్టిన సినిమా పేర్లు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న సినిమా పేరు 'ఐస్‌క్రీమ్‌'. నవదీప్‌ హీరో. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్లు', 'హార్ట్‌ఎటాక్‌','మనం' సినిమాలో చలాకీ అమ్మాయిగా కనిపించిన తేజస్వి హీరోయిన్. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వర్మ శైలికి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఇందులో తొలిసారిగా వర్మ 'ఫ్లో కెమెరా' అనే నూతన పరిజ్ఞానాన్ని వినియోగించానని చెప్తున్నారు.

    Ice Cream postponed to July 12th

    దర్శకుడు మాట్లాడుతూ ''సినిమా కోసం దేశంలోనే తొలిసారిగా ఫ్లో కెమెరా పరిజ్ఞానాన్ని వినియోగించాం. సినిమాలో హీరోయిన్ తేజస్వి కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా కనిపిస్తుంది. చిత్రంలో ఈ సన్నివేశాలకు ప్రాధాన్యముంది. అంతేగాని ఇరికించినవి కావు'' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''పరిశ్రమకు కొత్తదనాన్ని తీసుకురావడం వర్మకే చెల్లింది. ఫ్లోకామ్‌ పరిజ్ఞానంతో 20 నిమిషాల సన్నివేశాలు చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు'' అన్నారు.

    టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ఐస్‌క్రీమ్' చిత్రానికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. తన మొదటి సినిమా 'శివ'తో స్టడీకామ్ కెమెరాను పరిచయం చేసిన రాము తాజాగా ఈ చిత్రంలో ఫ్లోకామ్ అనే కెమెరాను ఉపయోగించారు. దీనిని ఆసియాలోనే తొలిసారిగా ఉపయోగించిన దర్శకుడు వర్మ అని చెప్పాలి. ఫ్లోకామ్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని యూనిట్ సభ్యులు చెప్పారు.

    English summary
    Navdeep, Tejaswi starrer Ice Cream was set to hit the screens on 11th of this month, but has now been postponed by a day to July 12th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X