twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కబాలి'తో లింక్ :అల్లు అరవింద్ వెనక ఉండి నడపిస్తున్నారా, మరి వివాదం?

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన అల్లు అరవింద్ కు ట్రేడ్ గురించి తెలిసినంతగా ఇంకెవరకీ తెలియదంటారు. ఆయన తన తెలివితేటలతో మెగా సామ్రాజ్యం విస్తరించారని అందరికీ తెలుసు. టాలీవుడ్ ట్రేడ్ చక్రాన్ని తిప్పే ఆయన తాజాగా రజనీకాంత్ కబాలి తెలుగు రైట్స్ వెనక కూడా ఆయనే ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    తాము నమ్మదగ్గ ప్రాజెక్టులలో డైరక్ట్ గానో, ఇండైరక్ట్ గానో పెట్టుబడులు పెట్టడం అల్లు అరవింద్ కు మొదటి నుంచి అలవాటే. అలాగే ఈ సారి కూడా ఆయన తాను సీన్ లోకి రాకుండా కబాలికి కొనిపించాడని చెప్తున్నారు.

    గతంలో రోబో సినిమాకు ప్రీ రిలీజ్ టాక్ అద్బుతంగా వచ్చినప్పుడు నిర్మాతలు చెప్పే రేటుకు ఎవరూ కొనటానికి రానప్పుడు తూర్పు గోదావరిలో మొక్క జొన్న వ్యాపారం చేసుకునే ఓ కొత్త వ్యక్తి వచ్చి రోబో రైట్స్ తీసుకుని విపరీతంగా లాభాలు సంపాదించారు. అయితే అప్పుడు కూడా ఆ అన్ నోన్ నిర్మాత సీన్ లోకి రావటానికి కారణం అల్లు అరవింద్ అంటారు. ఆయనే ఆ నిర్మాతకు బినామి అని చెప్పుకున్నారు.

    Is it True?:Allu Aravind is behind Kabali Telugu buyer?

    ఇప్పుడు సైతం కబాలి రైట్స్ ని ట్రేడ్ లో పెద్దగా పరిచయం లేని కొత్త నిర్మాతలు తీసుకున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల్ని సొంతం చేసుకోవడానికి పలువురు పేరుపొందిన నిర్మాతలు ప్రయత్నించారు. షణ్ముఖా ఫిలిమ్స్‌ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆ హక్కుల్ని పొందింది. వీటి కోసం ఆ సంస్థ అధినేతలు ప్రవీణ్‌కుమార్‌, కె.పి. చౌదరి ఇప్పటివరకూ ఏ డబ్బింగ్‌ సినిమాకూ చెల్లించనంత భారీ మొత్తంలో చెల్లించినట్లు సమాచారం.

    30 కోట్లు పెట్టి తీసుకోవటం వెనక ఎంతో రిస్క్ ఉంటుంది. అయినా అంత రిస్క్ తీసుకోవటానికి కొత్త వారు సాహసం చేయరు. ఎంతో అనుభవం, ట్రేడ్ లో బిజినెస్ చేయగలం అని లెక్కలు తెలుసున్న వాళ్లే దిగుతారు.

    అలాగే అల్లు అరవింద్..కబాలి రైట్స్ ని వీరిని అడ్డం పెట్టి తీసుకున్నారని, వారు అల్లు అరవింద్ బినామి అని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకూ అనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఇలా వ్యాపారం చేయటం మాత్రం సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు..తప్పు అసలు కాదు అని సీనియర్స్ అంటున్నారు.

    మరో ప్రక్క రజనీ 'కబాలి' తెలుగు వెర్షన్ రిలీజ్ కి కష్టాలు ఎదురయ్యాయని టాక్. తెలుగులో కబాలిని రిలీజ్ చేయనిచ్చేది లేదని ఓ ప్రొడ్యూసర్ కాలడ్డుపెడుతున్నట్లు చెప్తున్నారు. భారత తొలి ఫొటో రియలిస్టిక్‌ సినిమా రజనీ 'కొచ్చాడయన్‌'. తెలుగులో 'విక్రమసింహ'గా విడుదలై.. అట్టర్ ప్లాప్ గా నిలిచింది. 'విక్రమసింహ'ని లక్ష్మిగణపతి ఫిలింస్‌కు చెందిన శోభన్‌ బాబు భారీ ధరకు కొనుగోలు చేశారు.

    అప్పట్లో ఎగ్రిమెంట్ ప్రకారం....ఒకవేళ సినిమా ప్లాప్ అయితే రూ. 7కోట్లు తిరిగిస్తామని హామి ఇచ్చారట. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ విషయంపై డిస్టిబ్యూటర్స్ తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు శోభన్ బాబు. ఈ నేపథ్యంలోనే విక్రమ సింహ బకాయి డబ్బులు తీర్చే వరకు తెలుగులో కబాలిని రిలీజ్ చేయనిచ్చేది లేదని శోభన్ బాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారమ్.

    పా. రంజిత్ దర్శకత్వంలో తమిళంలో కలైపుల్‌ యస్‌. థాను నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాపై అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. టీజర్‌ విడుదలయ్యాక 'కబాలి' క్రేజ్‌ మరింత పెరిగింది. గ్యాంగ్‌స్టర్‌గా రజనీ కనిపించిన తీరు, ఆయన చెప్పిన డైలాగ్స్‌, ఆయన స్టయిల్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

    'కబాలి' చిత్రంలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటించారు. ఈ నెల 12న ఆన్‌లైన్ ద్వారా పాటలు విడుదల కానున్నట్లు తెలిసింది. జూలై మొదటి వారంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Rumours spread that Allu Aravind was the secret investor for Rajinikanth’s ‘Robot’ and buzz is Geeta Arts acquired ‘Kabali’ rights for a whopping Rs 30crs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X