twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్, మహేష్‌లను ఎన్టీఆర్ దాటేస్తాడా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ బాక్సాఫీసు వద్ద ప్రదర్శిస్తున్న స్టామినా చూస్తుంటే సరికొత్త రికార్డులు ఖాయం అంటున్నారు విశ్లేషకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ హై ఓల్టేజ్ పెర్పార్మెన్స్ ఓ రేంజిలో ఉండటం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సూపర్బ్ మౌత్ టాక్ వ్యాపించడంతో సినిమాకు వసూళ్ల పంట పండుతోంది.

    ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచే చేస్తూ ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేయడం ఎన్టీఆర్ స్టామినాకు అద్దం పడుతోంది. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల' చిత్రం కలెక్షన్లు కూడా ఈ రేంజిలో లేవు. గోపాల గోపాల చిత్రం తొలి నాలుగు రోజుల్లో 24 కోట్ల మార్కను అందుకోగా.... ఆ మధ్య విడుదలైన మహేష్ బాబు మూవీ ‘ఆగడు' ఫస్ట్ వీకెండ్(4 రోజులు) రూ. 31.2 కోట్లు వసూలే చేసి నెం.1 స్థానంలో ఉంది.

    పరిస్థితి చూస్తుంటే ఫస్ట్ వీక్ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్....ఇద్దరు స్టార్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లను బీట్ చేసేట్లు కనిపిస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా వారం గడిస్తేగానీ ఏవిషయం అనేది తేలుతుంది.

    ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Jr NTR's TEMPER super growing

    తెలుగులో విడుదలైన ఏ సినిమా జయాపజయాలైనా నైజాం కలెక్షన్ల మీదనే ఆధారపడి ఉంటాయి. అలాంటి కీలకమైన టెర్రిటరీలో ‘టెంపర్' మూవీ తొలి మూడు రోజుల్లో 5.41 కోట్లు వసూలు చేసింది. తొలి మూడు రోజు కలెక్షనే ఈ రేంజిలో ఉందంటే....సినిమా బిజినెస్ పూర్తయ్యే లోపు ఏ రేంజిలో ఉంటుందో? ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు, ట్రేడ్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయం కోసం చాలా కాలంగా కసిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, అతని అభిమానులకు ఈ చిత్ర ఫలితాలు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చాయని చెప్పక తప్పదు.

    అమెరికాలోనూ దుమ్ము రేపుతోంది. అమెరికాలో దాదాపు 120 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఆదివారం వరకు ఈ చిత్రం ఇక్కడ $871000 వసూలు చేసింది. ఈ రోజు లేదా రేపు ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంటుందని భావిస్తున్నారు.

    ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) సూపర్ కలెక్షన్లు సాధించింది. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఈచిత్రం రూ. 17.67 కోట్లు వసూలు చేసింది. మరో వైపు పక్కరాష్ట్రం కర్ణాటకలోనూ రికార్డు స్థాయిలో తొలి మూడు రోజుల్లో రూ. 3 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో ధనుష్ నటించిన ‘అనేగన్', అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్' చిత్రాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సమయంలోనూ ‘టెంపర్' అక్కడ మంచి వసూలు రాబట్టింది.

    ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    Jr NTR's Temper collections has already collected Rs 25 crores in the first three days from its release. Temper has crossed the first four-day collections of Pawan's Gopala Gopala that is approximately Rs 24 crores. However, Mahesh Babu's Aagadu seems to be undisturbed as No.1 movie to get Rs 31.2 crores in the first weekend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X