twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం చిత్రం: ‘సర్దార్ ’కు షాక్ ఇస్తున్న జంతువులు

    By Srikanya
    |

    హైదరాబాద్ : కొన్ని వింటూంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. లేకపోతే ఎంతో ఖర్చు పెట్టి తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ కలెక్షన్స్ డ్రాప్ అవటమేంటి... చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ, జంతువులతో నిండిపోయిన 'ది జంగిల్‌ బుక్‌' భాక్సాఫీస్ వద్ద దూసుకుపోవటమేంటి...ఈ వారం రిలీజైన 'ది జంగిల్‌ బుక్‌' చిత్రం పవన్ తాజా చిత్రానికి ఓ రేంజిలో భాక్సాఫీస్ వద్ద పోటీ ఇస్తోంది.

    తొలిరోజు కలెక్షన్స్ తో అదరకొట్టి డిస్ట్రిబ్యూటర్స్ లో ఆనందం కలగచేసిన సర్దార్ గబ్బర్ సింగ్...రెండో రోజు కల్లా ఆ ఉత్సాహం నీరు కార్చేసాడు. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఈ చిత్రం కలెక్షన్స్ చాలా దారుణంగా పడిపోయింది. ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ చాలా మెరుగు. డబ్బై నుంచి ఎనభై శాతం వరకూ ఫుల్స్ అవుతున్నాయి. జంగిల్ బుక్ వంటి చిత్రం సర్దార్ కు ఈ స్దాయిలో పోటి ఇస్తుందని ఎవరూ ఊహించరు.

    Jungle Book Vs Sardaar Gabbar Singh movie

    మరో ప్రక్క జాన్‌ ఫావ్రో దర్శకత్వంలో నీల్‌సేథి ప్రధాన పాత్రధారిగా శుక్రవారం విడుదలైన 'ది జంగిల్‌ బుక్‌' మంచి వసూళ్లు రాబడుతోంది. తొలిరోజే రూ. 9.76 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. అదే నార్త్ ఇండియాలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కేవలం 45 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

    అక్షయ్‌కుమార్‌ హీరోగా 2016లో విడుదలైన 'ఎయిర్‌లిఫ్ట్‌' తరువాత తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'ది జంగిల్‌ బుక్‌' నిలించిందని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్‌ ఖాన్‌, నానా పటేకర్‌ గాత్రం అందించిన సంగతి తెలిసిందే.

    Jungle Book Vs Sardaar Gabbar Singh movie

    మొదటి రోజు 'ది జంగిల్‌ బుక్‌' చిత్రం 90% హౌస్ ఫుల్స్ అయితే రెండో రోజుకు మాగ్జిమం హౌస్ పుల్స్ అవటం మొదలైంది. ఈ ఎఫెక్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ కలెక్షన్స్ పై పడుతోంది. నిజానికి హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు ఎప్పుడూ ఇక్కడ మన స్టైయిట్ చిత్రాలుకు పోటీ పడటం జరగదు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో మాత్రం అది రివర్సైంది. 'ది జంగిల్‌ బుక్‌' గెలుస్తోంది.

    అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్ ల విషయంలోనూ 'ది జంగిల్‌ బుక్‌' ముందుంది. వీకెండ్ లో 'ది జంగిల్‌ బుక్‌' టిక్కెట్లు మల్టిఫ్లెక్స్ లలో దొరకని పరిస్ధితి. దాదాపు 95%-100% ఆక్యుపెన్సీ రేటు ఉండటం, అదీ మల్టిఫ్లెక్స్ లలో కావటంతో 'ది జంగిల్‌ బుక్‌' డిస్ట్రిబ్యూటర్స్ ఆనందానికి అంతేలేదు. సర్దార్ కు అడ్వాన్స్ బుకింగ్ 50% అవ్వటం కూడా కష్టంగా ఉంది.

    English summary
    Sardaar is facing yet another major challenge in the form of Jungle Book. Jungle Book has took the theaters across the country by storm and minted more than 9 crore share on its opening day, while Sardaar's North Indian collections were a shameful 45 lakhs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X