twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కబాలి’...‘బాహుబలి’అడుగుపెట్టిన చోటే...

    By Srikanya
    |

    పారిస్‌: యూరప్‌లోనే అతి పెద్ద థియేటర్‌ 'ది గ్రాండ్‌ రెక్స్‌'. ఇక్కడ సినిమా రిలీజ్ అవటమే గొప్ప విశేషంగా అభిమానులు పేర్కొంటూ ఉంటారు. అయితే మన దేశం నుంచి అలాంటి అరుదైన అవకాశాన్ని 'బాహుబలి'సొంతం చేసుకుంది.

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రాన్ని ఈ ఏడాది జూన్‌లో రెక్స్‌ థియేటర్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు 'కబాలి' రెక్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తం 2500 మంది ఒకేసారి మూవీ చూడగల సామర్ధ్యం ఈ థియేటర్‌కు ఉంది.

    Kabali To Be Screened At World’s Biggest Theatre

    యూరప్‌లోని ప్రఖ్యాత థియేటర్‌లో చిత్రాన్ని ప్రదర్శించబోతూండటంతో రజనీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పా రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది.

    కబాలి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్‌. విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో దేశవ్యాప్తంగా రజనీకాంత్‌ అభిమానులు సందడి షురూ చేశారు. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న కబాలి మరో అరుదైన విశేషాన్ని సొంతం చేసుకుంది.

    English summary
    Kabali To Be Screened At World’s Biggest Theatre in France. The makers are planning to screen Superstar Rajinikanth’s Kabali Movie on The Grand Rex Cinema at Paris and other Nations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X