twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి రికార్డ్ జస్ట్ మిస్: ‘ఖైదీ నెం 150’ ఫస్ట్ డే యూఎస్ రిపోర్ట్! (టాప్ 10 లిస్ట్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి... రీ ఎంట్రీలోనూ తన సత్తా చాటారు. పదేళ్ల తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆయన నటించిన 'ఖైదీ నెం 150' మూవీ ఓపెనింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండటమే ఇందుకు నిదర్శనం.

    తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో కూడా ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. యూఎస్ఏలో ఈ చిత్రం ప్రీమియర్ షోలకు వచ్చిన కలెక్షనే ఇందుకు నిదర్శనం. యూఎస్ఏ వ్యాప్తంగా 157 లొకేషన్లలో ప్రీమియర్ షోలో నిర్వహించగా 1.27 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇంచు గ్యాపులో బాహుబలి రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని ఈ చిత్రం కోల్పోయింది.

    కేవలం ప్రీమియర్ షో ద్వారా.... 1 మిలియన్ డాలర్ మార్కును అందుకున్న సినిమా బాహుబలి తర్వాత ఖైదీ సినిమాయే కావడం గమనార్హం.

    బాహుబలి టాప్

    బాహుబలి టాప్

    ఇప్పటి వరకు యూఎస్ఏ ప్రీమియర్ షో వసూళ్లలో బాహుబలి సినిమా టాపులో ఉంది. అప్పట్లో బాహుబలి యూఎస్ఏ ప్రీమియర్ షోల ద్వారా $1.36 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే కేవలం కొద్ది పాటి తేడాతో ఖైదీ మూవీ రికార్డ్ మిస్సయింది.

    ఖైదీ నెం 150

    ఖైదీ నెం 150

    చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 చిత్రం ప్రీమియర్ షో ద్వారా $1.27 మిలియన్ డాలర్ వసూలు చేసి రెండో స్థానంలో ఉంది.

    సర్దార్ గబ్బర్ సింగ్

    సర్దార్ గబ్బర్ సింగ్

    పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం $616k డాలర్లు వసూలు చేసి మూడో స్థానంలో ఉంది.

    జనతా గ్యారేజ్

    జనతా గ్యారేజ్

    ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్' చిత్రం $584k డాలర్ల వసూళ్లతో మూడో స్థానంలో ఉంది.

    బ్రహ్మోత్సవం

    బ్రహ్మోత్సవం

    మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం చిత్రం ప్రీమియర్ షో ద్వారా $560k డాలర్లు వసూలు చేసింది.

    శ్రీమంతుడు

    శ్రీమంతుడు

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు మూవీ $535k వసూలు చేసింది.

    ఆగడు

    ఆగడు

    మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు చిత్రం ప్రీమియర్ షోల ద్వారా $527K డాలర్లు వసూలు చేసింది.

    నాన్నకు ప్రేమతో

    నాన్నకు ప్రేమతో

    ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' మూవీ ప్రీమియర్ షోల ద్వారా $355K డాలర్లు వసూలు చేసింది.

    సన్నాఫ్ సత్యమూర్తి

    సన్నాఫ్ సత్యమూర్తి

    అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' మూవీ $ 347K డాలర్లు వసూలు చేసింది.

    అత్తారింటికి దారేది

    అత్తారింటికి దారేది

    పవర్ స్టార్ పవన్ క ళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం $345K డాలర్లు వసూలు చేసింది.

    English summary
    In the US, Khaidi No.150 grossed a sensational $1,270,524 from 157 locations from the premieres alone and stood as Tollywood’s all-time second highest grossing movie in the US. Khaidi No.150 missed Baahubali’s $1.36 million record by an inch, but this is just the beginning and the long weekend is sure to help the movie’s collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X