Don't Miss!
- Finance Radakishan Damani: దమానీ భారీ బెట్.. ఆ కంపెనీలో 2.33 లక్షల షేర్లు కొనుగోలు.. స్టాక్ దూకుడు
- News జగన్ పై దాడి కేసులో పురోగతి-పోలీసుల అదుపులో 10 మంది-అప్ డేట్ ఇదే..!
- Technology iPhone SE 4 భారీ డిస్ప్లే, మెరుగైన బ్యాటరీలతో ఐఫోన్ SE 4 స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Sports రాయల్ ఛాలెంజర్స్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
- Lifestyle శ్రీరామనవమికి పానకం, వడపప్పు.. ఈ కొత్త స్టైల్ ట్రై చేయండి..
- Automobiles ఇన్నోవా హైక్రాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది - ధర, వివరాలు ఇక్కడ చూడండి
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
హాట్ టాపిక్: ‘సన్నాఫ్ సత్యమూర్తి’ బాగా పొడుగే
హైదరాబాద్ : ‘రేసుగుర్రం' లాంటి సూపర్ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం‘సన్నాఫ్ సత్యమూర్తి' . ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయన సంగతి తెలిసిందే. ఏప్రియల్ 9న విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రం రన్ టైం లెంగ్త్ మాత్రం కాస్త ఎక్కువే. 162 నిముషాలు తో చిత్రం సెన్సార్ అయింది. దాదాపు రెండు గంటలకే పరిమితం చేయటానికి దర్శక,నిర్మాతలు ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో ఈ లెంగ్త్ కాస్త ఎక్కువే అనిపిస్తుంది. అయితే త్రివిక్రమ్ మార్క్ హాస్యం, అల్లు అర్జున్ స్టైల్ తో ఆ లెంగ్త్ ...ఎక్కువని మాత్రం అనిపించదనేది అభిమానుల నమ్మకం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక ఇప్పటికే ప్రచార చిత్రాలు, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, రిలీజ్ కు ముందే సంచనాలు,రికార్డులు ను నమోదు చేసింది. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇటీవలే దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఆడియో విడుదలై సూపర్‌హిట్ అయ్యింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ‘s/o సత్యమూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈరోజు సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఎటువంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికేట్ రావటం విశేషం అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ తో మా బ్యానర్లో చిత్రీకరిస్తున్న's/o సత్యమూర్తి' చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుంది.దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు సెన్నారు పూర్తిచేసుకుని చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తున్నాం.
మాచిత్రానికి U/A సర్టిఫికేట్ ఎటువంటి కట్స్ లేకుండా రావటం సంతోషంగా వుంది.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ మరియు లక్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అని అన్నారు.