twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెరీర్ లోనే హైయిస్ట్ గ్రాసర్ అంటున్నాడు..లెక్కలు చూడండి

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో హిట్ కు మొహం వాచిన హీరోల్లో మొదటగా చెప్పుకోవాల్సింది గోపీచంద్ నే. అయితే అతని తాజా చిత్రం లౌక్యం మాత్రం అతన్ని ఒడ్డున పడేసిందనే చెప్పుకోవాలి. ఘన విజయం సాధించకపోయినా హిట్ టాక్ తో రన్ అవుతోంది. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ ని ప్లస్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మహేష్ ఆగడు ఫ్లాప్ కావటం, కృష్ణ వంశీ గోవిందుడు అందరి వాడేలే చిత్రం యావరేజ్ అవ్వటం గోపీ కి కలిసి వచ్చింది. దాంతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు.

    లౌక్యం విజయం గురించి గోపీచంద్ మాట్లాడుతూ... తన కెరీర్ లోనే హైయిస్ట్ గ్రాసర్ అని చెప్పారు. తన గత హిట్స్ శౌర్యం, లక్ష్యం, సాహసం ల కన్నా ఈ చిత్రం ఎక్కువ కలెక్టు చేసిందని చెప్పుకొచ్చాడు. చిత్రం మొదటి నుంచి చివరి వరకూ హీరోయిజం ని ప్రక్కన పెట్టి నవ్వించటమే పనిగా పెట్టుకోవటంతో సినిమా ఒడ్డున పడిపోయింది. ముఖ్యంగా టాక్సీ డ్రైవర్ గా బ్రహ్మానందం, టీవీ సీరియల్ స్టార్ గా ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ ల కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.

    Loukyam highest grosser in Gopi’s career

    ట్రైడ్ లో చెప్పుకోబడుతున్న ఈ చిత్రం 10రోజుల కలెక్షన్స్ ని ఓసారి చూస్తే..

    నైజాం - 3.61 కోట్లు

    సీడెడ్ - 1.85 కోట్లు

    ఉత్తరాంధ్ర -1.35 కోట్లు

    తూర్పు గోదావరి- 88 లక్షలు

    పశ్చిమ గోదావరి- 59 లక్షలు

    కృష్ణా -84 లక్షలు

    గుంటూరు - 1.11 కోట్లు

    నెల్లూరు - 40 లక్షలు

    లౌక్యం 10 రోజులు ఎపి, తెలంగాణ కలెక్షన్స్ షేర్స్ 10.63 కోట్లు

    కర్ణాటక - 1.41 కోట్లు

    మిగిలిన భారత్ దేశం - 0.30 కోట్లు

    ఓవర్ సీస్ - 0.78 కోట్లు

    లౌక్యం 10 రోజులు ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ 13.12 కోట్లు

    English summary
    Speaking about Loukyam success Gopichand said, The film would be highest grosser in his career, much more than Souryam, Lakshyam and Sahasam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X