»   » అయ్యో పాపం మణిరత్నం.. పూలమ్మిన చోటే.. మెగా క్యాంపులో కలవరం..

అయ్యో పాపం మణిరత్నం.. పూలమ్మిన చోటే.. మెగా క్యాంపులో కలవరం..

సంచలన దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం చెలియా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రంపై తొలి ఆట నుంచే ప్రేక్షకులు పెదవి విరిచారనే వార్తలు జోరందుకున్నాయి.

Posted by:
Subscribe to Filmibeat Telugu

సంచలన దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం చెలియా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రంపై తొలి ఆట నుంచే ప్రేక్షకులు పెదవి విరిచారనే వార్తలు జోరందుకున్నాయి. గతంలో వచ్చిన కడలి కంటే దారుణమైన టాక్‌ను ప్రస్తుతం చెలియా సంపాదించుకొన్నది. ప్రేక్షకుల ప్రతికూల స్పందన కారణంగా వారంతంలో కూడా థియేటర్లలో ఆశాజనక పరిస్థితి కనపించలేదని టాక్. ప్రస్తుతం లాభాలు రాకపోయినా పర్వాలేదు పెట్టిన పెట్టుబడి వస్తే చాలూ అనే భావనలో డిస్టిబ్యూటర్లు ఉన్నట్టు తెలుస్తున్నది.

రెహ్మాన్ ఆడియోతో మంచి రెస్పాన్స్

రెహ్మాన్ ఆడియోతో మంచి రెస్పాన్స్

ఇటీవల కాలంలో వచ్చిన మణిరత్నం చిత్రాలను పోల్చుకుంటే చెలియా చిత్రం ఆడియో చాలా బెటర్‌గా ఉంది. విడుదలకు ముందు విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌ బాగుండటంతో బ్రహ్మండమైన అంచనాలు నెలకొన్నాయి. రెహ్మాన్ రూపొందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పిరియాడిక్ ఫిలిం, కార్గిల్ వార్ నేపథ్యం అనే వార్తలతో చెలియా మరో రోజా అనే భావన అనే ప్రేక్షకుల్లో నెలకొంది. భారీ అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు సినిమా చుక్కలు చూపించదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

ఈసారి హీరో రవివర్మన్

ఈసారి హీరో రవివర్మన్

గత చిత్రాల్లో పోల్చుకుంటే ఏ సినిమానైనా మణిరత్నం హీరో. కానీ ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ రవివర్మన్ హీరో అనే మాట వినిపిస్తున్నది. బలహీనమైన కథ, పేలవమైన సన్నివేశాలు, స్క్రీన్ ‌ప్లే ఉన్నప్పటికి రవివర్మన్ తన పనితనం, ప్రతిభతో చెలియాకు కొంత గౌరవాన్ని కల్పించాడనే వాదన వినిపించింది. కశ్మీర్, లేహ్, లడక్ లాంటి అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన దృశ్యాలు ప్రేక్షకుడిని మరో లోకానికి తీసుకెళ్లయనేది టాక్.

 అదితి అందం, అభినయం హైలెట్

అదితి అందం, అభినయం హైలెట్


ఇక హీరోయిన్ అదితి రావు హైదరీ అందం, అభినయం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలువడం చెలియా తొలివారంలో కాస్తయినా నిలబడగలిగింది. రవివర్మన్, అదితి లేకపోతే చెలియా పరిస్థితి మరింత దారుణంగా అయ్యేదనే వాదన వినిపిస్తున్నది.

 తమిళ పరిశ్రమలో కూడా అదే..

తమిళ పరిశ్రమలో కూడా అదే..

చెలియా సినిమా పరిస్థితి కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. తమిళంలో కూడా రివ్యూస్ ప్రతికూలంగానే వచ్చాయి. దాంతో అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్ వచ్చిన పరిస్థితి కనిపించలేదనే మాట వినిపిస్తున్నది. గతంలో మణిరత్నం చిత్రమంటే క్లాస్, మాస్ ఆడియెన్స్ గుడ్డిగా ఇరగబడి చూసేవారు. కడలి తర్వాత మణిరత్నం సినిమా వస్తే ప్రేక్షకులు ఆలోచించి థియేటర్‌కు వెళ్లే పరిస్థితి దాపురించింది.

దిల్ రాజు బ్రేక్ ఈవెన్..

దిల్ రాజు బ్రేక్ ఈవెన్..

గతంలో ఒకే బంగారం చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు పంపిణీ చేశారు. గతంలో మణిరత్నం దాదాపు అన్ని చిత్రాలను పంపిణీ చేసిన రికార్డు దిల్ రాజుకు ఉంది. చెలియా చిత్రానికి రూ. 7.5 కోట్లు (అనధికారికంగా) చెల్లించి డిస్టిబ్యూషన్ రైట్స్ తీసుకొన్నట్టు సమాచారం. అయితే ఆ మొత్తం కూడా వస్తుందా? రాదా అనే పరిస్థితి నెలకొనడం చెలియా కలెక్షన్ల స్థితిని తెలియజేస్తుంది.

మెగా క్యాంపులో అంతర్మధనం

మెగా క్యాంపులో అంతర్మధనం

ఈ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో మణిరత్నం సినిమాను పట్టాలెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. చెలియా చిత్రం తర్వాత మెగా క్యాంపులో ఆంతర్మధనం ప్రారంభమైందనే మాట ఫిలింనగర్‌లో వినిపిస్తున్నది. చెలియా చిత్ర ప్రభావం రాంచరణ్ సినిమాపై పడే అవకాశముందా అనేది ప్రస్తుతం జోరుగా నడుస్తున్న టాపిక్. ఇప్పటికిప్పుడు రాంచరణ్ వెనుకడుగు వేసే ఛాన్స్ లేకపోయినప్పటికీ.. కథ, కథనంపై ఒకటికి రెండుసార్లు దృష్టిపెట్టే అవకాశమైతే స్పష్టంగా కనిపిస్తున్నది.

English summary
Maniratnam's latest movie cheliyaa not upto mark according to the media report. This first time maniratnam got this kind of response through out his career. In this situation Ram Charan is taking appropriate actions for his next movie with Maniratnam.
Please Wait while comments are loading...