twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ముకుందా’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి??

    By Srikanya
    |

    హైదరాబాద్ : క్రిసమస్ కు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ ముకుందా చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన వరుణ్ తేజ్ మొదటి సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తొలిరోజే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే చిత్రం యూనిట్ మాత్రం ఎక్కడా నిరాశపడకుండా ఓ రేంజిలో పబ్లిసిటీని పెంచారు.ఈ నేపధ్యంలో చిత్రం కలెక్షన్స్ కు అది ఏ మాత్రం కలిసివచ్చిందో చూద్దాం.

    https://www.facebook.com/TeluguFilmibeat

    ఈ చిత్రం రిలీజైన మొదటి రెండు తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవటం ప్రారంభమయ్యింది. ఓవరాల్ ప్రీ రిలీజ్ తో పోల్చితే...వీకెండ్ లో బిలో యావరేజ్ గా నడిచింది. ట్రేడ్ లో అందుతున్న సమాచారాన్ని బట్టి... మొదటి ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ... 9.6 కోట్లు సంపాదించింది. అయితే అది బిజినెస్ తో పోల్చితే నిరాసపరిచే నెంబరే. అయితే ఈ వారంలో పూర్తి డ్రాప్ అవకుండా ఉంటే కొంతలో కొంత సేఫ్ అంటున్నారు. చిన్నదాన నీకోసం చిత్రం కూడా ఫ్లాఫ్ టాక్ మూట కట్టుకోవటంతో ఈ చిత్రం కలెక్షన్స్ కాస్త స్టడీగా ఉండే అవకాసాలు కనపడుతున్నాయి.

    Mukunda Below Average Weekend

    చిత్రం కథేమిటంటే... స్నేహితులే ప్రాణంగా తిరిగే ముకుందా(వరుణ్ తేజ్)కి బెస్ట్ ప్రెండ్ అర్జున్. అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు మున్సిపల్ ఛైర్మన్ సుబ్రమణ్యం(రావు రమేష్)పెద్ద కుమార్తె. అన్ని సినిమాల్లో లాగానే హీరో ఆ ప్రేమకు సహకరిస్తూ అడ్డు వచ్చిన వాళ్లను అడ్డంగా కొడ్తూంటాడు. పనిలో పనిగా 'పరుగు' సినిమా చూసినట్లు... ఆయన రెండో కుమార్తె పూజ(పూజ హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఇది సుబ్రమమ్యాణికి బాగా కాలుతుంది. ఈ లోగా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. సుబ్రమణ్యాన్ని దెబ్బ కొట్టడానికి ముకుందా... ఆయనకు పోటీగా ఆ ఊళ్లో చదువుకుని ప్రస్టేషన్ తో తిరిగే ప్రకాష్ రాజ్ ని పోటీకి నిలబెడతాడు...ప్రచారం చేస్తాడు. ఆ పరిస్దితుల్లో మిగతా కథ ఏమౌతుంది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

    లియో ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్, పూజాహెగ్డే , రావు రమేష్, రఘుబాబు, ప్రకాష్‌రాజ్, రావు రమేష్, నాజర్, రఘుబాబు, తదితరులు నటించారు. సంగీతం: మిక్కీ.జే.మేయర్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కెమెరా:మణికందన్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత: నల్లమలుపు బుజ్జి, సమర్పణ: ఠాగూర్ మధు

    English summary
    Mukunda film did around 9.6 Cr WW Share in 5 days which is a decent number, but is way below the required rate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X