twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివర్స్ లో జరుగుతోందేంటి?: చైతూ‘ప్రేమమ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

    By Srikanya
    |

    హైదరాబాద్: నాగచైతన్యకు చాలా కాలానికి సోలో హిట్ దొరికింది. చైతూ పేరు చెప్పి చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఎగ్జిటర్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ దసరాకు పేరుకు ఐదు సినిమాలు రిలీజ్ అయినా లీడ్ ఉన్నది మాత్రం ప్రేమమ్ చిత్రమే కావంటతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులే లేవు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పస్ట్ వీక్ కలెక్షన్స్ ఏరియావైజ్ అందిస్తున్నాం.

    ముఖ్యంగా నాగచైతన్య ఈ చిత్రంలో చూపెడుతున్న మూడు వేరిషేయన్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రానికి యూత్ ఆడియన్స్ ఎక్కువ వస్తారనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తున్నారని ట్రేడ్ టాక్.

    దాంతో మళయాళంలో యూత్ వల్లే ఆ రేంజి హిట్ అయిన ఈ చిత్రం ఇక్కడ ఫ్యామిలీల చొరవతో ముందుకు వెళ్లటం ఆశ్చర్యమే. ముఖ్యంగా వీకెండ్స్ మొత్తం ఆడియన్స్ తో ధియోటర్స్ కళకళ్లాడాయి. అలాగే ప్రేమమ్ ఒరిజనల్ మళయాళి చిత్రం కలెక్షన్స్ తో పోల్చనంతవరకూ ఈ కలెక్షన్స్ అద్బుతమే.

    'మలర్ ' మిస్సైంది కానీ...మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది (చైతూ 'ప్రేమమ్'రివ్యూ )

    మొదట వారం షేర్ ఎంతంటే

    మొదట వారం షేర్ ఎంతంటే

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఫస్ట్ వీక్ లో 16.5కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అందులో యుఎస్ నుంచి 2.08 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే కర్ణాటక నుంచి 1.58 కోట్లు, బారత్ లో మిగిలిన ఏరియాల నుంచి 0.55 నుంచి వస్తోంది. నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ వీక్ గా దీన్ని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటే రిలీజైన మిగతా సినిమాలేవీ ఈ స్దాయిలో కాదు కదా దగ్గరగా కూడా కలెక్ట్ చేయటం లేదు.

    ఎదురేలేకుండా పోయింది

    ఎదురేలేకుండా పోయింది

    దసరా సెలవులు ఈ సినిమాకు బాగా కలిసి వచ్చాయి. అలాగే శుక్రవారం వచ్చేవరకూ ఇజం తప్ప పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రేమమ్ కలెక్షన్స్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాంగ్‌రన్‌లో నాగ చైతన్య కెరీర్‌కు ప్రేమమ్ సోలో హీరోగా పెద్ద హిట్‌గా నిలుస్తుందన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

    నైజాం లో ప్రేమమ్ కలెక్షన్స్

    నైజాం లో ప్రేమమ్ కలెక్షన్స్

    చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నైజాం ఏరియాలో ఫస్ట్ వీక్ 4.45 కోట్లు వసూలు చేసి , డిస్ట్రిబ్యూటర్స్ ని ఆనందపరిచింది.

    సీడెడ్ ప్రాంతంలో ప్రేమమ్ ఎంతంటే

    సీడెడ్ ప్రాంతంలో ప్రేమమ్ ఎంతంటే

    మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో చైతన్య తన నటనతో అందరినీ కట్టిపడేస్తున్నారు. చైతన్య సరసన శృతి హాసన్‌, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సీడెడ్ ప్రాంతంలో ఫస్ట్ వీక్ 1.95 కోట్లు వచ్చింది.

    ఉత్తరాంద్రలో ప్రేమమ్ ఫస్ట్ వీక్

    ఉత్తరాంద్రలో ప్రేమమ్ ఫస్ట్ వీక్

    వాస్తవానికి మళయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్'రీమేక్ చేయాలనుకోవటం అతి పెద్ద సాహసం. ఎందుకంటే అందరూ ఒరిజనల్ తో పోల్చి చూడటానికి ఆసక్తి చూపెడతారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ని ప్రేమమ్ మళయాళ అభిమానులు చీల్చి చెండాడేసారు. ఓ రేంజిలో సోషల్ మీడియాలో ట్రోల్ చేసేసారు. అయితే ఆ విషయంలోనే తెలుగు ప్రేమమ్ సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఉత్తరాంధ్రలో తొలి వారం ....1.58 కోట్లు కలెక్ట్ చేసింది.

    కృష్ణాలో ప్రేమమ్ ఫస్ట్ వీక్

    కృష్ణాలో ప్రేమమ్ ఫస్ట్ వీక్

    దర్శకుడు చందు మొండేటి ఒరిజనల్ సినిమాలోని సోల్ ను తీసుకుని, తనదైన శైలిలో నేటివిటిని,ఫన్ ని, ఫ్యాన్ ఎలిమెంట్స్ ని అద్దుతూ రీరైట్ చేసి సినిమా చేసాడు. ఆ విషయంలో చందు వందకు వెయ్యి మార్కులు వేయించుకున్నారు. కృష్ణా జిల్లాలో ఈ చిత్రం ఫస్ట్ వీక్ 1.06 కోట్లు కలెక్ట్ చేసింది.

    గుంటూరు ప్రేమమ్ ఫస్ట్ వీక్ రిపోర్ట్

    గుంటూరు ప్రేమమ్ ఫస్ట్ వీక్ రిపోర్ట్

    అయితే మళయాళంలో ఉన్న మ్యాజిక్ 'మలర్' పాత్ర. దాన్ని మాత్రం తెలుగులోకి అంతే సమర్దవంతంగా పట్టుకుని రాలేకపోయారనే విమర్శలు వచ్చాయి. అయితే చైతూ కూడా తన నిజ జీవితంలో ప్రేమ ఫేజ్ లో ఉండటం వలనో ఏమో కానీ ఎప్పుడూ లేనంత బాగా సీన్స్ పండించిదాన్ని దాటే ప్రయత్నం చేసాడు. గుంటూరు లో ఈ చిత్రం ఫస్ట్ వీక్ 1.19 కోట్లు కలెక్ట్ చేసింది.

    తూర్పు గోదావరి ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్

    తూర్పు గోదావరి ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్

    ప్రేమమ్ సినిమాలో నాగార్జున వాయిస్ ఓవర్ చెప్పటమే కాకుండా ఓ పాత్రను కూడా పోషించాడు. అలాగే వెంకటేష్ సైతం ఓ పాత్రలో వచ్చి దడదడాలించాడు. వీళ్లద్దరి పాత్రలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఈస్ట్ గోదావరి లో ఈ చిత్రం ఫస్ట్ వీక్ 0.95 కోట్లు కలెక్ట్ చేసింది.

    వెస్ట్ గోదావరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ..

    వెస్ట్ గోదావరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ..

    సినిమాలో హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ల నటన ఆసక్తికరంగా బాగుంది. మడోనా సెబాస్టియన్‌ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించింది. వెస్ట్ గోదావిరి ఏరియాలో ఈ చిత్రం ఫస్ట్ వీక్... 0.74 కోట్లు కలెక్ట్ చేసింది.

    నెల్లూరు ఫస్ట్ వీక్ కలెక్షన్స్

    నెల్లూరు ఫస్ట్ వీక్ కలెక్షన్స్

    ఈ చిత్రంలో శృతి హాసన్ ని ఒరిజనల్ లోని పాత్రతో పోల్చి చూడకపోతే బాగుందనిపిస్తుంది. శృతి తన శక్తి మేరకు బాగానే చేసింది. ముఖ్యంగా డాన్స్ చేసి చూపించేటప్పుడు శృతి చాలా బాగా చేసింది. అనుపమ పరమేశ్వరన్‌ పక్కింటి అమ్మాయిని గుర్తుకు తెస్తుంది. నెల్లూరు ఏరియా ఫస్ట్ వీక్ 0.52 కోట్లు వసూలు చేసింది.

    ఆంధ్రా, నైజం కలిసి

    ఆంధ్రా, నైజం కలిసి

    ప్రేమకథలకి ముగింపు ఉండొచ్చు కానీ.. ప్రేమ తాలూకు జ్ఞాపకాలకి మాత్రం కాదని చెప్పే ఈ కథ కేవలం తెరపై విక్కీ ప్రేమకథే కాదు.. ప్రతి ఒక్కరి ,మనందరి ప్రేమకథ కనిపిస్తుంది. ప్రేమలో గెలవడం.. ఓడిపోవడం కంటే అందులో పడడమే కీలకమైన విషయం అని.. ప్రేమలో గెలిస్తే అమ్మాయి మన పక్కన ఉంటుంది.. ఓడితే ఆ జ్ఞాపకాలు మనతో ఉంటాయని చెప్పే ఓ అందమైన పాయింటే ఈ సినిమాకు హైలెట్, అదే ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఈ చిత్రం ఏపి, నైజాం ఏరియాల కలెక్షన్స్ కలిపి మొదటి వారం 12.44 కోట్లు వసూలు చేసింది.

    వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్

    వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్

    చందు మొండేటిలో మంచి దర్శకుడు మాత్రమే కాదు ..అంతకు మంచి రచయిత కూడా ఉన్నాడన్న విషయాన్ని ఈ సినిమా చెప్పేస్తుంది. చాలా చోట్ల పంచ్‌లు బాగా పేలటం కలిసొచ్చే అంశం. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 16.65 కోట్లు కలెక్టు చేసింది.

    ఈ టీమే ఇంత కలక్షన్స్ తెచ్చి పెట్టింది

    ఈ టీమే ఇంత కలక్షన్స్ తెచ్చి పెట్టింది

    బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: నాగచైతన్య, శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్, చైతన్యకృష్ణ, జోష్ రవి, ప్రవీణ్‌, శ్రీనివాస్‌రెడ్డి, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, జీవా.నాగార్జున - వెంకటేష్‌ (అతిథి పాత్రల్లో), వైవాహర్ష తదితరులు
    కథ: ఆల్ఫోన్స్‌ పుథరెన్‌
    సంగీతం: గోపీసుందర్‌, రాజేశ్‌ మురుగేశన్‌
    ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
    కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
    నిర్మాణం: ఎస్‌.రాధాకృష్ణ, పి.డి.వి.ప్రసాద్‌, ఎస్‌, నాగవంశీ
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.
    విడుదల తేదీ: 7-10-2016

    English summary
    'Premam' has set the cash registers ringing at the Box Office. It collected Rs 16.65 crore Share in the first week. That's a pretty good figure considering the opposition from five other flicks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X