twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైతూ 'ఒక లైలా కోసం' విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    నాగచైతన్య, పూజా హెగ్డే హీరో,హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం 'ఒక లైలా కోసం'. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున నిర్మాత. ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. నాగచైతన్య, పోసాని కృష్ణమురళి, అలీపై వినోద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    నాగ చైతన్య మాట్లాడుతూ... ''లైలా లాంటి పిల్ల ప్రేమ కోసం మజ్ను లాంటి కుర్రాడు చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. ఇంటిల్లిపాది చూసి ఆనందించేలా చిత్రాన్ని తెరకెక్కించాం. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది ''అన్నారు.

    Naga Chaitanya's Oka Laila Kosam on Oct 17th

    దర్శకుడు మాట్లాడుతూ ‘‘రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కాలేజీ చదువు పూర్తి చేసి కన్‌ఫ్యూజన్‌లో ఉండే కార్త్తీక్‌ పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడు. స్వేచ్ఛను ప్రేమించే కార్తీక్‌ ఓ సందర్భంలో నందనను కలుస్తాడు. ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతన్ని ఇష్టపడదు. అయినా అనుకోని పరిస్థితుల్లో కార్తీక్‌ను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ కార్తీక్‌ ఆమె ప్రేమను గెలుచుకున్నాడా.. లేదా? అనేది ఆసక్తికరం. వైవిధ్యమైన ఇతివృత్తంతో సాగే సినిమా ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. చైతూ, పూజా తమ పాత్రలకు న్యాయం చేశారు.''అని తెలిపారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''ప్రేమకు రీజన్స్‌ ఉండవు. ఓన్లీ ఎమోషన్స్‌' అని నమ్మే యువకుడు. ప్రేమంటే ఆమడ దూరం ఉండే అమ్మాయి. తీపి, పులుపు లాంటి వీరి మధ్య విజయ్‌కుమార్‌ కొండా శైలిలో తెరకెక్కిన ప్రేమకథ ఇది. నేటి యువత మనసులు, ప్రేమలను తెరపై ఆవిష్కరిస్తున్నాం. '' అంటున్నారు నిర్మాత.

    అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రఽధారులు. ఈ సినిమాకు కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.

    English summary
    Naga Chaitanya’s Oka Laila Kosam is finally releasing on 17th of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X