twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదెలాగో రిలీజ్ అయ్యేటట్లు లేదు...ఇదైనా వస్తే రిలీఫ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : కెరీర్ పరంగా నాని పరిస్ధితి ఏం బాగోలేదు. వరస ఫ్లాపులతో ఉన్న నాని చిత్రం అంటే పంపిణీదారుల్లో ఉత్సాహంగా కొనేవాళ్లు లేరు. దాంతో ఆయన చిత్రం జెండాపై కపిరాజు రిలీజ్ ఆగిపోయింది. మరోప్రక్క నాని హీరోగా శేఖర్ కమ్ముల శిష్యుడు నాగి దర్శకుడిగా పరిచయమవుతూ ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్‌పై నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకదత్ నిర్మిస్తోంది. ఈ చిత్రం అయినా రిలీజ్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు.

    ఎవడే సుబ్రహ్మణ్యం అనే టైటిల్‌ తో రూపొందుతున్న ఈచిత్రంలో నానికి జోడీగా కీలక పాత్రలో చేస్తోంది. ఇటీవలే మౌంట్ ఎవరెస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. తన జీవితం గురించి తెలుసుకోవడానికి ఓ కుర్రాడు మొదలు పెట్టె జర్నీలో తనకు ఎదురైన అనుభవాలు సమాహారమే కథాంశం.

    శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసిన నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని సరసన ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘నా రాకుమారుడు' ఫేం రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కొంత భాగాన్ని నేపాల్ లో కూడా షూట్ చేస్తున్నారు.డిసెంబర్ లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి 2015 ప్రారంభంలో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

    Nani waiting for Evade Subrahmanyam movie

    అమలా పాల్ తో నాని కలిసి చేసిన 'జెండా పై కపి రాజు' చిత్రం ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు .నాని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'జెండాపై కపిరాజు'. తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.

    నాని మాట్లాడుతూ... గెలుపంటే అతడికి ఇష్టం. అయితే ఎదుటివాడిని ఓడించేందుకు ముందు తనపై తాను గెలవాలనుకొంటాడు. అదే సిసలైన విజయమని నమ్ముతాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ...ఇప్పటికి చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాని ఇందులో చేసే రెండు పాత్రలూ చాలా వైవిధ్యంగా ఉంటాయి. శరత్‌కుమార్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది అని చెప్పారు. అమలాపాల్‌ హీరోయిన్ . సముద్రఖని దర్శకుడు. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, కె.ఎస్‌.శివరామ్‌ నిర్మాతలు.

    ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్‌ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

    English summary
    Nani waiting for his latest Evade Subrahmanyam which will be directed by Nag Ashwin, a former associate of Sekhar Kammula. Now the latest news is that, Ritu Verma has been confirmed as the female lead opposite Nani. Ritu made her Tollywood debut with Pavan Sadineni’s Prema Ishq Kadhal and Naa Rakumarudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X