twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నైజాంలో ‘టెంపర్’ సునామీ: ఇదీ తాజా లెక్క...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నైజాం ఏరియాలో ‘టెంపర్' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 5 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏకంగా రూ. 7.8 కోట్లు వసూలు చేసింది. తెలుగు సినిమాలకు ప్రధాన మైన మార్కెట్ నైజాం ఏరియానే. తెలుగులో విడుదలైన ఏ సినిమా జయాపజయాలైనా నైజాం కలెక్షన్ల మీదనే ఆధారపడి ఉంటాయి. అలాంటి కీలకమైన టెర్రిటరీలో ‘టెంపర్' మూవీ కలెక్షన్లు సునామీ సృష్టిస్తోంది.

    ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    వీకెండ్‌ తొలి మూడు రోజుల్లో రూ. 5.41 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం....ఏ మాత్రం డ్రాప్ కాకుండా సోమ, మంగళ వారాల్లో కూడా బాక్సాఫీసును దడదడలాడించింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యే నాటికి ఈచిత్రం రూ. 10 కోట్ల మార్కును అందుకుంటుందని భావిస్తున్నారు.

    Nizam area: Temper has collected 7.8 crores in 5 days

    సినిమా బిజినెస్ పూర్తయ్యే లోపు ఏ రేంజిలో ఉంటుందో? ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు, ట్రేడ్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయం కోసం చాలా కాలంగా కసిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, అతని అభిమానులకు ఈ చిత్ర ఫలితాలు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చాయని చెప్పక తప్పదు.

    ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    NTR’s latest action entertainer in Puri Jagannadh’s direction opened to packed houses last Friday. According to the latest reports, Temper has collected 7.8 crores in the Nizam area(5 days).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X