twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మస్ మసాలా ఎఫెక్టు: 90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్

    By Srikanya
    |

    హైదరాబాద్ :మాస్,మసాలా చిత్రాలకు మన సౌతిండియాలో మంచి బిజినెస్ ఎప్పుడూ ఉంది. పెద్ద స్టార్, మాస్ ట్రైలర్, ఫస్ట్ లుక్ ఉంటే బిజినెస్ ఏ రేంజిలో జరుగుతుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు అలాంటి మ్యాజిక్కే తమిళ సూపర్ స్టార్ సూర్య తాజా చిత్రం అంజాన్ కి జరుగుతోంది. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం బిజినెస్ ఈ క్రింద విధంగా జరిగింది.

    అంజాన్:
    తమిళనాడు డిస్ట్రిబ్యూశన్ రైట్స్ - Rs. 38 కోట్లు

    ఓవర్ సీస్ - Rs. 10 కోట్లు

    కర్ణాటక, కేరళ & మిగతా చోట్ల - Rs. 7 కోట్లు

    శాటిలైట్ మరియు మ్యూజిక్ రైట్స్ - Rs. 17 కోట్లు

    Power of Anjaan: 90 Crore Rupees!

    సికిందర్ :

    ఆంధ్రప్రదేశ్ & నైజాం రైట్స్ - Rs. 15 కోట్లు

    శాటైలైట్ - Rs. 3 కోట్లు

    లింగుస్వామి దర్శకత్వంలో సూర్య, సమంత జంటగా నటించిన 'అంజాన్‌' దక్షిణాదిలో ప్రత్యేకత చాటుకుంటోంది. తెలుగులోనూ 'సికిందర్‌'గా విడుదలవుతోంది. తెలుగు, తమిళంలో దాదాపు 1,500 థియేటర్లలో విడుదలవుతున్నట్లు సమాచారం. చెన్నైలోనే ఏకంగా 37 థియేటర్లలో రానుంది. నగర హక్కులను అభిరామి రామనాథన్‌ కొనుగోలు చేశారు.

    రామ్ నాధన్ మాట్లాడుతూ.. ''గతంలో చెన్నైలో ఐదు థియేటర్లలోనే సినిమా విడుదలయ్యేది. రజనీకాంత్‌ నటించిన 'శివాజి' గరిష్ఠంగా 18 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు 'అంజాన్‌'ను 37 హాళ్లలో విడుదల చేస్తున్నాం. అభిమానులకు టికెట్లు లభించలేదని తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. పైరసీ సీడీలను అడ్డుకోవడానికి కూడా ఈ చర్య ఉపయోగపడుతుంది. అభిరామి థియేటర్లలో రిజర్వేషన్‌ ప్రారంభించిన రెండు గంటలకే 5,000 టికెట్లు అమ్ముడయ్యాయి. తప్పకుండా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది''అని తెలిపారు.

    'మాట్రాన్‌' పరాజయం తర్వాత సూర్య 'సింగం-2'తో మళ్లీ బాక్సాఫీసు వద్ద గర్జించారు. తన తదుపరి చిత్రానికి కూడా మాస్‌ కథనే ఎంచుకున్నారాయన. ఆయనకు జంటగా సమంత తొలిసారిగా కనిపించనుంది. యువన్‌శంకర్‌రాజా స్వరాలు సమకూర్చుతుండగా.. సంతోష్‌ శివన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సూర్య ఇందులో ముంబయి డాన్‌గా కనిపించనున్నారు.

    విద్యుత్‌ జమ్వాల్‌, మనోజ్‌బాజ్‌పాయ్‌, వివేక్‌, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, తిరుపతి బ్రదర్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.

    English summary
    Sikinder Telugu dubbing rights were bought by Lagadapati Sridhar. He has already made very good profits on the film. Anjaan is directed by Linguswamy who is known for making successful mass masala movies. This film's business is sheer power of a mass cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X