twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆగడు’ థియేటర్లను ఆక్రమించిన ‘పవర్’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మాస్ మహరాజ్ రవితేజ నటించిన ‘పవర్' చిత్రం రెండో వారంలోనూ మంచి బిజినెస్ చేస్తోంది. మహేష్ బాబుఆగడు' చిత్రం విడుదలైనా ‘పవర్' చిత్రంపై పెద్దగా ప్రభావం చూపలేక పోయిందని ట్రేడ్ టాక్. ‘ఆగడు' సినిమాకు మిక్డ్స్ టాక్ రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

    ‘ఆగడు' చిత్రం నైజాం ఏరియాలో దాదాపు 298 థియేటర్లలో విడుదలైంది. తొలి మూడు రోజులు గడిచిన తర్వాత దాదాపు 50 థియేటర్లలో ‘ఆగడు' చిత్రాన్ని తీసేస్తున్నట్లు సమాచారం. ఆయా థియేటర్లను సోమవారం నుండి ‘పవర్', ‘గీతాంజలి' సినిమాలతో రీప్లేస్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక మిగిలిన థియేటర్లలో ‘ఆగడు' చిత్రం విజయవంతంగా రన్ అవుతోంది.

    Power replaces some Aagadu Screens

    శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘ఆగడు' చిత్రంలో మహేష్ బాబు-తమన్నా జంటగా నటించారు. సినిమా విడుదలైన తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్టాఫ్ వినోదాత్మకంగా ఉన్నప్పటికీ సెకండాప్ రొటీన్ రివేంజ్ డ్రామా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే మహేష్ బాబు టాప్ స్టార్ కావడంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి.

    ఇక ‘పవర్' సినిమా విషయానికొస్తే....బాబీ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రవితేజ, హన్సిక, రెజీనా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా నాలుగైదు హిట్ సినిమాల్లోని స్టోరీ లైన్స్, సీన్లు కాపీ కొట్టి తీసారనే విమర్శలు సొంతం చేసుకుంది. అయితే రవితేజ పెర్ఫార్మెన్స్ వినోదాత్మకంగా ఉండటంతో విజయవంతంగా రన్ అవుతోంది.

    English summary
    Meanwhile , Aagadu , which was released in 298 theaters in Nizam , has lost more than 50 theater by 3rd day of the release. Some of the Aagadu theatres will be replaced with Geetanjali and Power from Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X