twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాంగ్ టీజర్ కేక‌: అల్లు అరవింద్ కు ఆనందం, తల పట్టుకుంటున్న మిగతా ఇండస్ట్రీ

    By Srikanya
    |

    హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పా రంజిత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కబాలి'. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని తమిళ సాంగ్ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. నేను వచ్చానని చెప్పు, కబాలి తిరిగి వచ్చాడని చెప్పు అంటూ రజనీ చెప్పిన డైలాగు అదిరిపోయింది.

    'నిరుప్పుడా' అనే సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేయగా..టీజర్‌లో రజనీ తనదైన స్టైల్‌లో అద్బుతం, అదరహో అనిపించాడు. దాంతో ఈ చిత్రం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాతలు, వారికి బినామిగా ఉన్న అల్లు అరవింద్ చాలా ఆనందపడ్డారని అంటున్నారు. అయితే ఇదే సమయంలో తెలుగు సినీ వర్గాల్లో గుబులు మొదలైందని సమాచారం.

    సాంగ్ టీజరే ఈ రేంజిలో ఉంది, సినిమా ఎలా ఉంటుందో అని, ఈ సంవత్సరం పెద్ద హిట్ గా ఈ చిత్రం నమోదు అవుతుందని, కలెక్షన్స్ రికార్డ్ లో కొత్త శకం ఆరంభం అవుతుందని అంచనాలు వేస్తున్నారు.

    సాంగ్ టీజర్ విడుదలైన పది నిమిషాల్లోపే లక్ష వ్యూస్ రావడం రజనీ ఇమేజ్ గురించి మరోసారి చెప్తే...తెలుగు పరిశ్రమలో వరసపెట్టి పెద్ద సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం డిజాస్టర్ అవటం గురించి చర్చ మొదలైంది. ఈ సినిమా ఇక్కడ అద్బుతాలు సృష్టిస్తే...తదుపరి వచ్చే రజనీ చిత్రం రోబో 2 బిజినెస్ తెలుగులో ఎలా ఉండబోతోందో అని లెక్కలు వేస్తున్నారు.

    ఇప్పటికే ఈ చిత్రం తెలుగు టీజర్‌ విడుదలైంది. ఎప్పటిలాగే తలైవా తనదైన స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో అదరగొట్టేశాడు.

    అంతేకాక...ఈ సినిమా హిట్టైన తర్వాత ఇక డబ్బింగ్ సినిమాలు వర్గం మొదలవుతుందని, గతంలోనూ ఇలాగే జరిగిందని,అప్పుడు మళ్లీ స్ట్రైయిట్ సినిమాలకు ధియేటర్స్ దగ్గరనుంచి అన్నిటా సమస్యలు వస్తాయని అంటున్నారు. సినిమా ప్రియులు ఈ టీజర్ ని చూసి ఎంజాయ్ చేస్తూంటే , సినిమా జనం మాత్రం టెన్షన్ తో ఈ సినిమా వంక చూస్తున్నారు.

    కబాలి కొత్త పోస్టర్స్ ఇక్కడ చూడండి...

    తెలుగులో..

    తెలుగులో..

    ఇక సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే తమిళంలో విడుదల కాగా... త్వరలో తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    మళ్లీ వాయిదా

    మళ్లీ వాయిదా

    జూలై 1న చిత్రాన్ని విడుదల చేస్తారంటూ ప్రచారం జరిగినా రీసెంట్‌గా మరోసారి వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇదే కావచ్చు..

    ఇదే కావచ్చు..

    జూలై 15న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారని సమాచారం.

    భారీగా అంచనాలు

    భారీగా అంచనాలు

    రజనీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఇక్కడ కష్టమే..

    ఇక్కడ కష్టమే..

    అయితే అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ రిలీజ్ కష్టమే అంటున్నారు.

    కంప్లైంట్

    కంప్లైంట్

    ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రజనీ గత చిత్రం కొచ్చిడియాన్(విక్రమ్ సింహా)పై ఓ కంప్లైంట్ పెండింగ్ లో ఉంది.

    అప్పట్లో...

    అప్పట్లో...

    కొచ్చిడియాన్(విక్రమ్ సింహా)ని డిస్ట్రిబ్యూటర్ లక్ష్మి గణపతి ఫిల్మ్స్ వారు, ఫైనాన్సియర్ శోభన్ బాబు ఈ చిత్రం పంపిణీ చేసి భారీగా నష్టం పొందారు.

    హామీ

    హామీ


    అయితే కొచ్చిడియాన్(విక్రమ్ సింహా) నష్టాలు విషయమై రజనీ భార్య లత..7.60 కోట్లకు వీరికి హామీ ఇచ్చి ఉన్నారు.

    నిలబెట్టుకోలేదు

    నిలబెట్టుకోలేదు


    కానీ ఆమె ఆ తర్వాత హామీని నిలబెట్టుకోలేదు. దాంతో ఇప్పుడు ఆ నష్టం రికవరీ విషయమై తేలకుండా కబాలిని విడుదల చేసేది లేదు అంటున్నారు.

    డిజాస్టర్

    డిజాస్టర్

    మరో ప్రక్క రజనీ గత చిత్రం లింగా డిజాస్టర్ సైతం ఇక్కడ పంపిణీదారులను భయపెడుతోంది.

    ఈ నేపధ్యంలో...

    ఈ నేపధ్యంలో...

    ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్న కేసుని లెక్క చేయకుండా ఉండి రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్ దొరికితేనే ఈ సినిమా ఇక్కడ తెలుగులో రిలీజ్ అవుతుంది.

    మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గా

    మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గా

    తెల్లని గెడ్డంతో రజినీకాంత్ తనదైన శైలిలో చాల విభిన్నంగా స్టైలిష్ గా కనిపించి అభిమానులకు పండుగ చేసారు. రజినీకాంత్ స్టైలిష్ నడకతో ఈ సాంగ్ టీజర్ ప్రారంభమైంది.

    టీజర్ డైలాగు

    టీజర్ డైలాగు

    ముఖ్యంగా ‘పాత తెలుగు చిత్రాల్లో బుగ్గపై గాటు పెట్టుకుని, మీసాలు తిప్పుకొంటూ, లుంగీ కట్టుకుని పాత విలన్‌ ఏయ్‌! కబాలి అని పిలవగానే... వంగుని వినయంగా ఎస్‌ బాస్‌ అంటూ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నావా?.. కబాలి... రా' అంటూ చెప్పిన డైలాగ్‌ అదరగొట్టిందంటున్నారు ఫ్యాన్స్.

    మరోపక్క

    మరోపక్క

    కబాలి త‌మిళ‌ టీజర్‌కు గంటలోనే మిలియన్‌ వ్యూస్‌ వచ్చేశాయి. అంతేకాకుండా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని అందరు ప్రముఖులు రజనీ స్టైల్‌కు ఫిదా అయిపోయారు.

    జోడీగా

    జోడీగా

    ఈ చిత్రంలో రజనీకాంత్‌కి జోడీగా రాధికా ఆప్టే నటించారు.

    సంగీతం

    సంగీతం


    కలైపులి ఎస్‌. థను నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

    ప్రధాన పాత్రల్లో

    ప్రధాన పాత్రల్లో

    ధన్షిక, కిషోర్‌, దినేష్‌ రవి, జాన్‌ విజయ్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

    విలన్ గా...

    విలన్ గా...

    చైనాకు చెందిన విల్సన్‌ చౌ విలన్ గా చేస్తున్నారు.

    ఎక్కువ భాగం

    ఎక్కువ భాగం

    ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం మలేసియాలో జరిగింది.

    నిర్మాత మాట్లాడుతూ...

    నిర్మాత మాట్లాడుతూ...

    ''తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న చిత్రిమిది. సంతోష్‌ నారాయణ్‌ బాణీలు అందిస్తున్నారు. తెలుగులో సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌ సాహిత్యాన్ని అందిస్తున్నారు''అన్నారు.

    వీలైనన్ని

    వీలైనన్ని

    రజనీకు ఒక్క తమిళనాటే కాక ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండడంతో ఈ సినిమాను వీలైనంత మేరకు అన్ని ఏరియాల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    అనేక భాషల్లో

    అనేక భాషల్లో

    రజనీకాంత్‌ ఫాలోయింగ్‌ బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని ఇప్పటికే అనేక భాషల్లో డబ్‌ చేస్తున్నారు.

    కొత్తగా..

    కొత్తగా..


    ఈ జాబితాలోకి మరో భాష వచ్చి చేరింది. మలేషియాలో తమిళ చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 'కబాలి'ని మలయ్‌( మలేషియా బాష)లోకి అనువదిస్తున్నారు.

    ఇదో రికార్డ్

    ఇదో రికార్డ్


    దీంతో మలయ్‌ బాషలోకి డబ్‌ అయిన తొలి తమిళ చిత్రంగా కబాలి రికార్డు సృష్టించింది. మలేషియా మీడియా కంపెనీ అయిన మాలిక్‌ స్ట్రీమ్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని మలేషియాలో విడుదల చేయనుంది.

     సాంగ్ టీజర్ కేక‌: అల్లు అరవింద్ కు ఆనందం, తల పట్టుకుంటున్న మిగతా ఇండస్ట్రీ

    సాంగ్ టీజర్ కేక‌: అల్లు అరవింద్ కు ఆనందం, తల పట్టుకుంటున్న మిగతా ఇండస్ట్రీ

    నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు భావిస్తున్న ఈ సినిమాలో రజనీ వృద్ధ డాన్‌గా రెండు పార్శ్వాలున్న వైవిధ్యమైన పాత్రను పోషిస్తుండగా..కథ అండర్‌ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి మాటలు: సాహితి, ఛాయాగ్రహణం:మురళీ, కళ: రామలింగం

    English summary
    Kabali is an upcoming 2016 Indian Tamil-language film written and directed by Pa Ranjith. The film stars Rajinikanth, Radhika Apte and Dinesh. Music composed by Santhosh Narayanan. Think Music has acquired the audio rights for all three languages – Tamil, Telugu and Hindi. Kabali Songs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X