twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ' క‌బాలి' బ‌స్‌ హంగామా....ఫ్యాన్స్ వీరంగం (వీడియోలు)

    By Srikanya
    |

    ముంబై: కబాలి చిత్రం క్రేజ్ ని ఎంతవరకూ పెంచగలమో అంతవరకూ తీసుకెళ్దాం అన్నట్లుగా నిర్మాతలు వ్యవహిస్తున్నారు. అందులో బాగంగా రకరకాలుగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పటికే దేశానికి కబాలి ఫీవర్ పట్టించటంలో సక్సెస్ అయ్యారు. ఏ మూల చూసినా క‌బాలి మానియా ఏదో ఒక రూపంలో క‌నిపిస్తూనే ఉంది.

    అందులో భాగంగా ఇప్పుడు కో ప్రొడ్యూసర్స్ గా ఉన్న ఫాక్స్ స్టార్ స్టూడియోవారు కొత్త ఎత్తు వేసారు. కొద్ది రోజులు క్రితం ఎయిర్ ఏషియా విమానాన్ని కబాలి థీమ్‌తో ముస్తాబు చేసి ప్ర‌మోష‌న్‌ను కొత్త పుంతలు తొక్కించారు. తాజాగా ముంబైలో ఫాక్స్‌స్టార్ స్టూడియో క‌బాలి బ‌స్‌ను లాంచ్ చేసింది.

    ఈ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్ న‌గ‌రంలోని వాడాలా నుంచి ఇనార్బిట్ మాల్ వ‌ర‌కు తిరిగింది. మ‌ధ్య‌లో మాతుంగ‌లోని ఆరోరా థియేట‌ర్‌ను కూడా క‌లుపుతూ ఈ క‌బాలి బ‌స్ యాత్ర సాగింది. బ‌స్‌లోని యువ‌కులు మ‌ధ్య‌మ‌ధ్య‌లో డ్యాన్స్‌లు చేస్తూ అభిమానులను ఉత్సాహ‌ప‌రిచారు.

    విదేశాల్లో ఉంటున్న కొందరు రజనీ అభిమానులు కేవలం కబాలి సినిమా చూసేందుకే దుబాయ్, జపాన్, మలేషియా, లండన్ తదితర ప్రాంతాల నుండి చెన్నై చేరుకుంటున్నారు. సొంత దేశంలో సొంత రాష్ట్రంలో తమ అభిమాన హీరో సినిమా చూడాలనే ఆత్రుతే ఇందుకు కారణం. వీరంతా చెన్నైలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు భారీగా ఖర్చు చేసి టిక్కెట్లు కొనుగోలు చేయడం గమనార్హం.

    కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో 'కబాలి' స్పెషల్ షోలు సైతం వేస్తున్నారు..... సూపర్ స్టార్ సినిమాను... సూపర్ లగ్జరీగా చూడాలనుకునే వారికోసం భారీ ఖర్చుతో కూడిన ప్యాకేజీలతో ఈ షోలు ఏర్పాటు చేసారు. ఇండియాలో ఒక సినిమా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ప్రత్యేక స్క్రీన్లలో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. బెంగుళూరు సిటీలో టాప్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఈ షోలు వేస్తున్నారు.

    సెన్సార్ పూర్తి

    సెన్సార్ పూర్తి

    సోమవారం సెన్సార్‌ ముందుకెళ్లిన ఈ సినిమా 'యు'సర్టిఫికేట్ పొందింది.

    రిలీజ్ డేట్

    రిలీజ్ డేట్

    ఈ నెల 22న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

    నిర్మాత మాట్లాడుతూ...

    నిర్మాత మాట్లాడుతూ...

    ''నేటితో 'కబాలి' పండగ మొదలైంది. రజనీ మరోసారి మాయ చేయబోతున్నారు. 152 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం కనుల పండువగా ఉంటుంది''అన్నారు.

    ఆ భాషల్లోకి కూడా

    ఆ భాషల్లోకి కూడా

    సినిమాను మలాయ్‌, చైనా భాషల్లోకి కూడా అనువాదం చేస్తున్నారు.

    భారీ ఎత్తున బ్రాండ్

    భారీ ఎత్తున బ్రాండ్

    ఈ చిత్రం కోసం ఎయిరేషియాతో టై అప్ అయ్యి.. బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

    అమేజాన్ లో కీచైన్లు

    అమేజాన్ లో కీచైన్లు

    అమెజాన్‌ ద్వారా "కబాలి" థీమ్‌ కీచైన్లు, మైనపు బొమ్మలు అమ్మకానికి ఉంచింది. ఇప్పటికే స్మార్ట్ ఫోనె కవర్లూ, టీ షర్టులూ హల్ చల్ చేస్తున్నాయ్.

    స్పెషల్ యాప్

    స్పెషల్ యాప్

    'కబాలి' కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఇందులో 'కబాలి'కి సంబంధించిన చిత్రవిశేషాలు అందించారు.

    స్పెషల్ స్పెట్స్

    స్పెషల్ స్పెట్స్

    ఈ చిత్రంలో రజనీ "కుతు" అనే తమిళ సంప్రదాయ నృత్యం చేసే సన్నివేశం ఉందట. రజనీ స్టెప్పులు అభిమానులను అలరిస్తాయని అంటున్నారు.

    మలేషియాలో..

    మలేషియాలో..

    'కబాలి' చిత్రీకరణ ఎక్కువ భాగం మలేసియాలో జరిగింది.

    విదేశీయులే..

    విదేశీయులే..

    ఇందులో విలన్‌తో పాటు కొన్ని ఇతర కీలక పాత్రల్లో విదేశీ నటులు నటించడం విశేషం.

    విలన్ గా తైవాన్ నుంచి..

    విలన్ గా తైవాన్ నుంచి..

    ప్రముఖ తైవాన్‌ నటుడు విన్‌స్టన్‌ చావొ ప్రతినాయకుడిగా నటించాడు.

    విలన్ రైట్ హ్యాండ్

    విలన్ రైట్ హ్యాండ్

    విలన్ ..రైట్‌హ్యాండ్‌గా మలేసియన్‌ నటుడు రోసియమ్‌ నొర్‌ నటించారు.

    భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    'బాషా' తర్వాత మళ్లీ రజనీ డాన్‌గా నటిస్తున్న 'కబాలి'పై భారీ అంచనాలున్నాయి.

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    అందుకు తగ్గట్లే ఆ సినిమా బిజినెస్‌ ఆకాశన్నంటుతోంది. ప్రి రిలీజ్‌లోనే రూ.200 కోట్లకుపైగా బిజినెస్‌ జరుగుతున్నట్లు సమాచారం.

    అక్కడి ఫ్యాన్స్

    అక్కడి ఫ్యాన్స్

    మలేసియాలో చిత్రీకరణ జరుగుతున్నపుడు రజనీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారట.

    ఫ్యాన్సే..

    ఫ్యాన్సే..

    మలేషియాలో షూటింగ్‌ కోసం 25 లగ్జరీ కార్లు అవసరం కాగా అక్కడి అభిమానులే వాటిని సమకూర్చారట.

    అలాగే

    అలాగే


    ఆడియో రిలీజ్‌ రోజున మలేషియాలో కార్ల యజమానులు 'కబాలి' పోస్టర్లతో రోడ్‌షో చేశారు.

    మేనియా

    మేనియా

    రజనీ మానియా విదేశాలకూ పాకింది. గతంలో రజనీ చిత్రాలకు జపాన్‌ తదితర దేశాల్లో మంచి ఆదరణ దక్కింది.

    మరిన్ని దేశాల్లో

    మరిన్ని దేశాల్లో


    ఇప్పుడు 'కబాలి' మరిన్ని దేశాల్లో సంచలనాలు చేయడానికి సిద్ధమవుతోంది.

    పదివేలు

    పదివేలు

    ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో విడుదలవుతోంది.

    చైనాలో...

    చైనాలో...

    'పీకే', 'బాహుబలి' తర్వాత ఐదు వేల థియేటర్లలో విడుదలవుతన్న మూడో భారతీయ చిత్రమిది.

    ఆ విధంగా తొలి..

    ఆ విధంగా తొలి..

    చైనీస్‌, మలై, థాయ్‌, జపనీస్‌ భాషల్లోకి అనువాదమవుతున్న తొలి తమిళ చిత్రమిది.

     స్పెషల్ ఏర్పాట్లు

    స్పెషల్ ఏర్పాట్లు

    'కబాలి' ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోనే చూడాలనుకునే అభిమానుల కోసం ఆ చిత్ర నిర్మాతలు ఓ ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు.

    ప్రత్యేకమైన ప్లైట్

    ప్రత్యేకమైన ప్లైట్

    'కబాలి' చూడ్డానికొచ్చేవారి కోసం బెంగళూరు నుంచి చెన్నైకి విమానాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం ఎయిర్‌ ఏసియా విమాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

    ఆఫర్ కు..

    ఆఫర్ కు..

    విమానం టికెట్‌తో పాటు 'కబాలి' టికెట్‌, ఆడియో సీడీ, భోజనం తదితర సౌకర్యాలు అందిస్తారట. ఈ ఆఫర్‌కు విశేష స్పందన వస్తోంది.

    ఏజెడ్

    ఏజెడ్

    'కబాలి'లో వయసు పైబడిన మాఫియా డాన్‌గా సూట్‌లు, నెరిసిన గడ్డంతో రజనీ గెటప్‌ ఆకట్టుకుంటోంది.

    స్పెషల్ కాస్ట్యూమ్స్

    స్పెషల్ కాస్ట్యూమ్స్

    అను వర్ధన్‌ అనే అమ్మాయి రజనీకి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసింది. లండన్‌లోని ఓ ప్రముఖ స్టోర్‌ నుంచి కాస్ట్యూమ్స్‌కు కావాల్సిన ముడి వస్త్రాలు కొనుగోలు చేశారట.

    లోకల్ స్టోర్స్ నుంచే...

    లోకల్ స్టోర్స్ నుంచే...

    మలేసియాలో జరిగే సన్నివేశాల కోసం అక్కడి ట్రెండ్స్‌ను ప్రతిబింబించేలా లోకల్‌ స్టోర్స్‌లో నుంచే కాస్ట్యూమ్స్‌ తెప్పించారట.

    ధన్సిక..

    ధన్సిక..

    'కబాలి'లో లేడీ డాన్‌గా నటించింది ధన్సిక. ఈ పాత్ర కోసం నా తలవెంట్రుకలను కత్తిరించి సరికొత్త గెటప్‌లోకి రంజిత్‌ మార్చారు.

     ‘కబాలి’అఫీషియల్ న్యూస్: అల్లు అరవింద్ కు రిలీఫ్, జుట్టు కట్ చేయించుకుని మరీ

    ‘కబాలి’అఫీషియల్ న్యూస్: అల్లు అరవింద్ కు రిలీఫ్, జుట్టు కట్ చేయించుకుని మరీ


    'కాలకూత్తు' సినిమాలో నటిస్తుండగా రంజిత్‌ నాకు ఫోన్‌ చేసి తనను ఓసారి కలవమన్నారు. దీంతో ఆయన దగ్గరకు వెళ్లగా ఓ పాత్ర గురించి వివరించారు. 'చాలా చక్కటి రోల్‌. దానికోసం తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి' అన్నారు.తలవెంట్రుకలు క్రాప్‌ చేసుకోవాలని చెప్పిన వెంటనే కొంచెం సందిగ్ధతకు గురయ్యా అంది ధన్సిక.

    కబాలి అని తెలిసి ఆనందం..

    కబాలి అని తెలిసి ఆనందం..

    తర్వాత నాకు నేనే నచ్చజెప్పుకుని సమ్మతించాను. ఆ తర్వాతి నాలుగు రోజులకు అది 'కబాలి' చిత్రంలోని పాత్ర అనే విషయం తెలిసింది. రజనీ సార్‌తో నటిస్తున్నానని తెలియడంతో నా ఆనందానికి అవధుల్లేవు.

    ఒరిజినాలిటీ

    ఒరిజినాలిటీ

    సినిమాలో చిత్రీకరణలో ఉన్నప్పుడు 'ఎందుకు తలవెంట్రుకలు కత్తిరించుకున్నావు? విగ్‌ పెట్టుకోవచ్చుకదా' అంటూ పలువురు నన్ను ప్రశ్నించారు. విగ్‌తో నటిస్తే ఒరిజినాలిటీ ఉండదు. 'కబాలి'లో నా పాత్ర కీలకంగా ఉండటంతో శిరోజాల కత్తిరింపు తప్పలేదు. సినిమా చూసేటప్పుడు నా గెటప్‌ ప్రాధాన్యత ఏమిటో మీకే అర్థమవుతోంది.

    English summary
    In an effort to cash in on the film’s craze, FoxStar Studio launched a ‘Kabali bus’, a double deck bus painted with posters. It will start from Wadala bus depot in the city, and make its way to InOrbit Malad via Aurora theatre in Matunga. It will stop at Dadar, Bandra and Andheri, enroute. Aurora theatre has a strong association with Rajinikanth. It has, in the past, seen long runs of his films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X