twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బ్రూస్‌లీ' : US కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్‌: శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం 'బ్రూస్‌లీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. దసరా సందర్భంగా ఈ నెల 16న 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఓవర్ సీస్ లో ఫ్లాఫ్ అని తేలినట్లే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రామ్ చరణ్ కు తొలి నుంచి ఓవర్ సీస్ లో మార్కెట్ లేదు అనే వాదన ఒకటి ఉంది...

    ముఖ్యంగా యుఎస్ భాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షో తర్వాత కలెక్షన్స్ ఆటోమేటిక్ గా డ్రాప్ అయ్యాయని తెలుస్తోంది. రివ్యూల కన్నా స్ట్రాంగ్ గా ఉన్న మౌత్ టాక్ సినిమాని ముంచేసింది అని చెప్తున్నారు. మొదట యుఎస్ లో 50% పోతుందని అంచనా వేసారు. అయితే తర్వాత ఇప్పుడు కలెక్షన్స్ పరిస్ధితి చూసాక... అరవై నుంచి డబ్బై శాతం వరకూ పోతుందని భావిస్తున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత ఓవర్ సీస్ మార్కెట్ బాగా పెరిగిందని అనుకున్నవాళ్లకు ఇదే సమధానం అంటున్నారు. సినిమాలో కంటెంట్ లేకపోతే ఎంత మార్కెట్ పెరిగినా ఉపయోగం లేదని చెప్తున్నారు. అంతేకాదు చిరంజీవి ఫాక్టర్ సైతం సినిమాని నిలబెట్టలేకపోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు.

    Ramcharan's Bruce Lee : The Mega disaster!

    ఇక్కడ ఇండియాలో నూ మార్నింగ్ షోకే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్ లు రెండోరోజుకే డ్రాప్ అయ్యాయి. మెదటి రోజు ఆంధ్రా మరియు తెలంగాణ లో 12.66 కోట్లమేర షేర్ రాగా, రెండో రోజు మౌత్ టాక్ స్ర్పెడ్ అవడంతో 4 కోట్ల షేర్ కి పడిపోయింది. చాలా ధియోటర్స్ రుద్రమదేవితో రెండో వారం వేసే అవకాసం ఉంది.

    చిత్రం కథేమిటంటే.....

    అందరూ లక్ష్యం వైపే పరుగెడతారు...కొందరు మాత్రమే తన వాళ్ల కోసం నిలబడతారు..అటువంటి వారిలో ఒకడు బ్రూస్ లీ (రామ్ చరణ్). అక్క (కీర్తి కర్బంద) అంటే ప్రాణంగా పెరిగిన బ్రూస్ లీ... చిన్నప్పటి నుంచీ ఆమె కోసం తన చదువును,కెరీర్ ని సైతం త్యాగం చేస్తాడు. ఆమె కలెక్టర్ కావాలని తన తండ్రికి ఇష్టం లేకపోయినా చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టి స్టంట్ మ్యాన్ గా లైఫ్ ప్రారంభిస్తాడు. అంతేకాకుండా తప్పుడు కేసు పెట్టి తన అక్క కలెక్టర్ అవ్వాలనే లక్ష్యంకు అడ్డుపడబోయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్)కు బుద్ది చెప్తాడు.

    ఇలా అక్క...తను అన్నట్లు నడుస్తూండగా.. ఓ ట్విస్ట్. తన తండ్రి (రావు రమేష్) పని చేసే సంస్ధ యజమాని జయరాజ్(సంపత్ రాజ్), నదియాల కుమారుడుతో వివాహం నిశ్చియం అవుతుంది. అయితే జయరాజ్ పైకి కనిపించినంత మంచి వాడు కాదు. అతనికో దుర్మార్గమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది దాచి పెద్దమనిషిలా చెలామణి అవుతూంటాడు. అది తెలిసిన హీరో...ఆ విషయాన్ని ఎలా బయిటపెట్టి, విలన్ కు ఎలా బుద్ది చెప్పాడు. కథలో రియా (రకుల్) పాత్ర ఏమిటి... చిరు ఎంట్రీ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    English summary
    According to latest collections Bruce Lee - The Fighter investors will be losing up to 60 to 70% in USA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X