»   » చాపకింద నీరులా రారండోయ్‌ కలెక్షన్లు.. జోష్‌లో నిర్మాత నాగ్

చాపకింద నీరులా రారండోయ్‌ కలెక్షన్లు.. జోష్‌లో నిర్మాత నాగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమైనా ఆ చిత్రం కలెక్షన్లపరంగా జోరును కొనసాగిస్తున్నది. మే 26వ తేదీన రిలీజైన ఈ చిత్రం కలెక్షన్లలో ఎక్కడ తగ్గుముఖం పట్టకుండా గ్రాప్ స్టడీగా సాగుతున్నట్టు తెలుస్తున్నది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ పెరుగడంతో చాప కింద నీరులా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసుకొనేందుకు పరుగులు పెడుతున్నది. ఈ సినిమాకు సంబంధించి తొలివారం ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తొలివారంల్లోనే లాభాల వైపు

తొలివారంల్లోనే లాభాల వైపు

నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రం దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. విడుదలకు ముందే శాటిలైట్ బిజినెస్ రూపంలో రూ.4 కోట్లు, పలు ఏరియాల బిజినెస్ వల్ల సుమారు రూ.3 కోట్లు వచ్చినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కృష్ణా, నైజాంలో అన్నపూర్ణ సంస్థ నేరుగా డిస్ట్రిబ్యూషన్ చేసుకొన్నది.


17 కోట్ల షేర్..

17 కోట్ల షేర్..

నైజాంలో రారండోయ్ చిత్రం నైజాంలో రూ.5.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.20 కోట్లు, సీడెడ్‌లో సుమారు రూ.2 కోట్లు, ఈస్ట్, వెస్ట్‌ గోదావరిలో రూ.2.13 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. మిగితా ఏరియాలు, కర్ణాటకతో కలుపుకొని మొత్తం రూ.17 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ప్రాథమిక సమాచారం.


నాగ్ ఉత్సాహం..

నాగ్ ఉత్సాహం..

అందరి అంచనాలను తలదన్నే విధంగా రారండోయ్ వేడుక చూద్దాం కలెక్షన్లు సానుకూలంగా ఉండటంపై నిర్మాత నాగార్జున అక్కినేని తన సన్నిహితుల వద్ద సంతోషాన్ని పంచుకొన్నట్టు సమాచారం. విడుదలకు ముందే ఈ చిత్ర విజయంపై నాగ్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రికార్డులు కొల్లగొట్టకున్నా పెట్టిన బడ్జెట్‌కు మించి లాభం వస్తుందనే ఆశాభావాన్ని మీడియాకు వ్యక్తం చేశారు కూడా.


బిజినెస్‌పై పక్కా పట్టు..

బిజినెస్‌పై పక్కా పట్టు..

రారండోయ్ వేడుక చూద్దాంపై మొదటి నుంచి పెట్టుకొన్న అంచనాలు తనకు అనుకూలంగా ఉండటంతో బిజినెస్‌పై నాగ్‌కు ఉన్న పట్టు మరోసారి రుజువు చేసింది. సినిమాను పక్కాగా అంచనా వేసే టాలెంట్ ఉన్న సినీ వ్యాపారవేత్తల్లో నాగ్‌ ముందుంటారనేది ఇండస్ట్రీ టాక్. ఏది ఏమైనా గుట్టుచప్పుడు కాకుండా వేడుక చేసుకొంటున్న రారండోయ్‌పై చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తున్నది.


English summary
Rarandoi Veduka Chuddam featuring Yuva Samrat Naga Chaitanya doing good business in all areas. Reports Suggest that film is just five crores away from registering a successful hit at the box office. At the moment, the collections are flowing steadily and there is no dip in the graph. The main reason for that is the family audience.
Please Wait while comments are loading...