twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ ‘వంగవీటి’ టాక్: వాటిని టచ్ చేయలేదు, మైనస్ లు,ప్లస్ లు ఇవే

    సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన వంగ‌వీటి చిత్రం ఈ రోజు విడుదలైంది.

    By Srikanya
    |

    హైదరాబాద్ : విజయవాడ రౌడీయీజం బ్యాక్ డ్రాప్‌లో తీసిన వంగవీటిపై మొత్తం టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వంగవీటిని వర్మ ప్రమోట్ చేస్తున్నారు.

    వర్మ సినిమాలో ఈ మధ్య కాలంలో లేనన్ని వివాదాల్ని వంగవీటి సృష్టించింది. ఈ చిత్రం మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందా? లేక సాదాసాదా చిత్రంగా వర్మ, రెగ్యులర్ రొటీన్ కథగా మిగిలిపోతుందా అనే విషయం ఈ రోజు తేలనుంది.

    రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం 'వంగవీటి'. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సెన్సేషనల్ మూవీ ఈ రోజు (డిసెంబర్ 23న) ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. రీసెంట్ గా విడుదలైన పాటలు, థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో భారీ అంచనాల మేరకు ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేసారు. ఈ చిత్రం టాక్ ఏంటి...అనేది చూద్దాం.

    ఇదే హాట్ టాపిక్

    ఇదే హాట్ టాపిక్

    ఈ చిత్రంలో వర్మ వంగవీటి కుటుంబం వైపుకు మొగ్గు చూపుతారా.. లేక దేవినేని కుటుంబంపై మొగ్గు చూపుతారా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇరు వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సినిమాను రూపొందించడం జరిగిందని వర్మ ఇప్పటికే ప్రకటించారు.

    కత్తిమీద సామే

    కత్తిమీద సామే

    కానీ చిత్ర టైటిల్ వంగవీటి అని పెట్టడం.. వాస్తవమైన పేర్లను సినిమాలోని పాత్రలకు పెట్టడంతో కత్తి మీద సాము లాంటి ఈ పనిని వర్మ ఎలా సెల్యూలాయిడ్ పై చిత్రించి ఉంటారా అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.

    ఏ వివాదాన్ని కూడా..

    ఏ వివాదాన్ని కూడా..

    ఇప్పటికే ఈ చిత్రం రిలీజైంది. అక్కడ నుంచి మా రిపోర్టర్ అందిస్తున్న సమాచారం ప్రకారం వంగవీటిలో రామ్ గోపాల్ వర్మ ..ఏ వివాదాన్ని, కాంట్రవర్శిని ముట్టుకోలేదు. ఆయన రాధ, రంగ, నెహ్రూలకు సంభందించి లోతుగా వెళ్లలేదు. చీకటి కోణాలను టచ్ చేయలేదు.

    స్పృశించలేదు

    స్పృశించలేదు

    ఒక మర్డర్, దాన్ని అనుసరించి మరో మర్డర్, చలసాని వెంకటరత్నం నుంచి రంగా దాకా వరస మర్డర్స్ ను చూపించుకుంటూ వెళ్లిపోయారు. అంతేతప్ప పెద్దగా లోకల్ పాటిటిక్స్ ని స్పృశించలేదు.

    మిగతావి పట్టించుకోలేదు

    మిగతావి పట్టించుకోలేదు

    మర్డర్స్ ని హైలెట్ చేస్తూ, ఓ డాక్యుమెంటరీలాగ సినిమా ని నడిపేసాడు. అంతేతప్ప అప్పటి సమాజ పరిస్దితులను, అప్పటి సమాజిక, ఆర్దిక పరిస్దితులను పరిగణనలోకి తీసుకుని స్క్రిప్టు రాసుకోలేదు. అసలు సామాన్యుడు వెర్షన్ అనేది ఎక్కడా లేదు. కేవలం అప్పటి రాజకీయ హత్యలను చూపటమే సినిమా అంతా సరిపోయింది.

     నిరాశే

    నిరాశే

    వంగవీటి ఎమ్ ఎల్ ఏ అవటం నుంచి అతని మరణం దాకా అతి తక్కువ టైం ఫ్రేమ్ తీసుకుని వివాదాలు రాకుండా తప్పించుకున్నాడు. ఆ విషయంలో ఎక్కువ ఎక్సెపెక్ట్ చేసిన వారికి ఇది పూర్తి నిరాశే. రక్త చరిత్ర స్దాయిలో కూడా కథలోతుల్లోకి వెళ్లలేదు.

    సేఫ్ టర్న్

    సేఫ్ టర్న్

    హింస ఎక్కువ అవటంతో ఇది ఆడవాళ్లకు కానీ, పిల్లలకు కానీ సజెస్టబుల్ చిత్రం అసలుకాదు. అసలు వర్మ తను చాలా ధైర్యవంతుడులా ఈ సినిమా విషయమై స్టేట్మెంట్స్ ఇస్తూ ఇలా ఓ సేఫ్ టర్న్ తీసుకోవటం ఆయన అభిమానులకు ఆశ్చర్యపరిచే అంశం.

    క్యూరియాసిటీ లేదు

    క్యూరియాసిటీ లేదు

    ఎవరైతే రంగా, నెహ్రూలకు అభిమానులు ఉంటారో, లేక వారి గురించి తెలుసుకోవాలనకుంటారో వారికి ఇది ఏ మాత్రం క్యూరియాసిటీ కలిగించని విషయం. ప్రొడక్షన్ చూస్తే టీవి సీరియల్ నాణ్యతతో ఉంటుంది. కేవలం సొమ్ము చేసుకోవటానికే రంగా ఈవెంట్ ని వర్మ ఎంచుకున్నారని అర్దమవుతుంది.

    ఆ ప్రచారమే లేకపోతే

    ఆ ప్రచారమే లేకపోతే

    విజయవాడ మాజీ ఎం.ఎల్.ఏ., కాపు ఉద్యమ నాయకుడు వంగవీటి మోహనరంగ జీవితాన్ని ఆధారంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం కావటమే ఈ సినిమా బిజినెస్ కు ఓపినింగ్స్ కు కారణమైంది. ముఖ్యంగా ఈ చిత్రం ఎలా ఉంటుందోననే అంశంపై తీవ్ర చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. 1980వ దశకంలో విజయవాడలో చోటుచేసుకున్న వర్గ పోరాటాలు, కుల పోరాటాల నేపథ్యంతో ముడిపడిన కథ వంగవీటి అనే ప్రచారమే కలిసొచ్చే అంశం.

    వర్మకు వార్నింగ్

    వర్మకు వార్నింగ్

    వంగవీటి టీజర్ వదలగానే వివాదాలు మొదలయ్యాయి. సినిమాలో రంగాపై అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే అడ్డుకుంటామని రంగా కుమారుడు రాథా హెచ్చరించారు. ఇంతలోనే రెండు సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ పాట విడుదల కావడంతో మరో విదాదం తలెత్తింది. వంగవీటి అభిమానులు వర్మకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వంగవీటి కుటుంబ సభ్యులతో వర్మ భేటీ అయ్యారు. ఎవరేమన్నా సినిమా విడుదల చేసి తీరతానని వర్మ గట్టిగా చెప్పారు.

    వర్మకు మద్దుతు పలకలకటంతో..

    వర్మకు మద్దుతు పలకలకటంతో..

    వంగవీటి అభిమానులు భారీగా ఉన్నవిజయవాడలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే థియేటర్ల యజమానులు మాత్రం ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రాలేదని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వంగవీటిని సినిమాగానే చూస్తున్నామని, ఇందులో వ్యక్తిగత అంశాలకు తావులేదని ప్రకటించిన నెహ్రూ, వర్మకు మద్దతు పలికారు. దీంతో వంగవీటి టీమ్ కాస్త ఊపిరి పీల్చుకుంది.

    రీక్రియేషన్ సూపర్బ్

    రీక్రియేషన్ సూపర్బ్

    సినిమా హైలెట్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయవాడ అప్పట్లో అంటే 1970,80లలో ఎలా ఉండేదో దాన్ని రీక్రియేట్ చేయటం అని చెప్పాలి. అలాగే మరిచిపోయిన ఆ రోజుల నాటి మనుష్యులను మళ్లీ తిరిగి గుర్తు చేసే ప్రయత్నం.

    ఇదే టీమ్

    ఇదే టీమ్

    వంగవీటికి పనిచేసింది వీళ్లే
    బ్యానర్ః రామ‌దూత క్రియేష‌న్స్‌,
    ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌,
    సాహిత్యంః సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌,
    సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి,
    ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోలు,
    మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌,
    ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ః మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు,
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు,
    కో ప్రొడ్యూస‌ర్ః సుధీర్ చంద్ర ప‌డిరి,
    నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌,
    ద‌ర్శ‌క‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

    English summary
    RGV's Vangaveeti movie today released. Here is the First report and talk of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X