» 

‘రొమాన్స్‌’ కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

హైదరాబాద్ :ఈరోజుల్లో' టీమ్‌ రూపొందించిన తాజా సినిమా 'రొమాన్స్‌'. 'ఎవ్వెరిబడి నీడ్స్‌' అనేది ఉపశీర్షిక. ప్రిన్స్‌ హీరో. డింపుల్‌, మానస హీరోయిన్స్. 'డార్లింగ్‌' స్వామి దర్శకుడు. మారుతి సమర్పణలో గుడ్‌ సినిమా గ్రూప్‌-మారుతి మీడియా హౌస్‌ సంయుక్తంగా నిర్మించాయి. జి.శ్రీనివాసరావు-ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారు. ఇటీవల చిత్రం రిలీజ్‌ చేశారు. చిత్రం మరీ నాశిరకంగా ఉండటంతో మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపినింగ్స్ తెచ్చుకోకపోయినా వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే సంపాదించింది.

ఇక ఈ చిత్రం నైజాం రైట్స్ ని రవితేజ తో కృష్ణ చిత్రం తీసిన కాశి విశ్వనాధం ...ఎనభై లక్షలు చెల్లించి తీసుకున్నారు. ఆయన ఈ చిత్రం కలెక్షన్స్ తో చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలియచేసారు. మొదటి మూడు రోజుల్లోనే తమ షేర్ 80 లక్షలు వెనక్కి తీసుకు వ్చిచందని అన్నారు. అలాగే ఈ చిత్రం ఇలాగే రన్ అయితే కోటి డభై లక్షలు వరకూ వసూలు చేస్తుందని నమ్మకం వెల్లబుచ్చారు. యూనిట్ కష్టపడి తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతోందని అన్నారు.

నైజాం విషయం ప్రక్కన పెడితే.. మిగతా ఏరియాల్లో ఎక్కడా చెప్పుకోతగ్గ కలెక్షన్స్ ఈ చిత్రానికి లేవని తెలుస్తోంది. బంద్ ప్రభావం కూడా ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ కు కారణమని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే సినిమాలో విషయం లేకపోవటమే ఎవరినీ ఎట్రాక్ట్ చేయకపోవటానికి కారణమని ఇండస్ట్రీ పీపుల్ అంటున్నారు. ఇక ఈ చిత్రం రెండు కోట్ల బడ్జెట్ లో నిర్మితమైంది. హైదరాబాద్ లోనే 54 థియోటర్స్ లో ఈ చిత్రం భారిగా విడుదలైంది. అలాగే...ఈ చిత్రానికి మారుతి చాలా ఎగ్రిసివ్ గా ప్రమేషన్ చేసారు.

Topics: romance, swamy, manasa, prince, maruthi, busstop, రొమాన్స్, డార్లింగ్ స్వామి, మారుతి, బస్ స్టాప్
English summary
Made with a budget of 2 crores, Romance was released with a lot of hype on friday (2 August) in lots of theaters (54 screens in Hyderabad). The aggressive promotions and brand value (3 consecutive hits associated with Maruthi) ensured good openings.

Telugu Photos

Go to : More Photos