» 

‘రౌడీ’ ఫస్ట్‌డే ఎంత వసూలు చేసాడంటే...?

Posted by:

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'రౌడీ'. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ముందు నుండీ ప్రచారం అదరగొట్టడంతో ఫస్ట్ డే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం, మోహన్ బాబు విగ్గులేకుండా ఒరిజినల్ గెటప్‌లో పవర్ ఫుల్ సీమ ఫ్యాక్షనిస్టు పాత్రలో కనిపించడం, ట్రైలర్లు, ప్రోమోలు ఆసక్తికరంగా ఉండటంతో నిన్న విడుదలైన ఈచిత్రం తొలి రోజు రూ. 4.13 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఎ.వి. పిక్చర్స్ పతాకంపై రూపొందించబడిన ఈ చిత్రంలో మంచు విష్ణు - శాన్వి జంటగా నటించారు. సహజనటి జయసుధ ఈ చిత్రంలో చాలాకాలం తరువాత మోహన్‌బాబు సరసన నటించారు. రాంగోపాల్ వర్మ స్టైల్ ఆఫ్ మేకింగ్ డిఫరెంటుగా ఉండటం కూడా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఈ రేంజిలో రావడం వెనక ఉన్న మరో కారణం.

‘రౌడీ’ ఫస్ట్‌డే ఎంత వసూలు చేసాడంటే...?

అయితే సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో.....మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 'రౌడీ' చిత్రం తొలి రోజు కలెక్షన్ వివరాలు ఏరియా వైజ్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం- రూ. 1.25 కోట్లు
సీడెడ్ - రూ. 86 లక్షలు
వైజాగ్- రూ. 25 లక్షలు
ఈస్ట్ గోదావరి- రూ. 26 లక్షలు
వెస్ట్ గోదావరి - రూ. 20 లక్షలు
కృష్ణా- రూ. 32 లక్షలు
గుంటూరు- రూ. 60 లక్షలు
నెల్లూరు- రూ. 14 లక్షలు
కర్నాటక- రూ. 25 లక్షలు
టోటల్ ఫస్ట్ డే షేర్ రూ. 4.13 కోట్లు

Read more about: rowdy, ram gopal varma, mohan babu, manchu vishnu, రౌడీ, మోహన్ బాబు, మంచు విష్ణు, రామ్ గోపాల్ వర్మ
English summary
Mohan Babu, Manchu Vishnu starrrer 'Rowdy' has now earned Rs. 4.13 crores on the first day of its release.

Telugu Photos

Go to : More Photos