twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రుద్రమదేవి’ ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంత?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అనుష్క టైటిల్ రోల్ లో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి' సినిమా బాక్సాఫీసు వద్ద విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకుంది. తొలి వారం ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డీసెండ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తొల 7 రోజుల్లో దాదాపు రూ. 55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

    భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో కేవలం తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ రూ. 25 కోట్లకు పైగా షేర్ సాధించి తెలుగులో టాప్ 3 చిత్రంగా నిలిచింది. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియో స్కోపిక్ 3డి మూవీ ‘రుద్రమదేవి'. అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. దాదాపు రూ. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పెట్టిన పెట్టబడి తిరిగి తెస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది.

    మనకు చారిత్రక చిత్రాలు చాలా అరుదనే చెప్పాలి. అప్పుడప్పుడు వచ్చినా అవి భక్తిరక ప్రధానంగా ఉండి, అసలు చరిత్రను మరుగుపరిచేలా తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో మన తెలుగు జాతి గొప్పతనాన్ని,మన వారసత్వాన్ని గుర్తు చేస్తూ వస్తున్న చిత్రం 'రుద్రమదేవి' . చిన్నప్పటినుంచీ పాఠాల్లో చదువుకున్న ఈ చరిత్ర ఇప్పుడు కళ్ల ముందు ఉంచారు గుణశేఖర్.

    'Rudhramadevi' 1st week box office collection

    ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ హైలెట్. చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటించారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

    English summary
    'Rudhramadevi' 1st week box office collection
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X