twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈసారైనా: 'రుద్రమదేవి'కొత్త విడుదల తేదీ

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘రుద్రమదేవి' విడుదల తేదీ రీసెంట్ గా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం మేరకు కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 17న గానీ, 24న గానీ ‘రుద్రమదేవి' సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

    ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ కింగ్ గా పేరొందిన దిల్ రాజు నైజాం మాత్రమే కాకుండా మిగతా ఏరియాలలో కొన్ని తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇంతకుముందు పటాస్, బాహుబలి చిత్రాల విజయాలు అంచనా వేసి తీసుకుని లాభాలు గడించిన దిల్ రాజు ఈ చిత్రం పంపిణీ హక్కులు పోటీపడి తీసుకోవటంతో బిజినెస్ ఒక్కసారిగా వేడిక్కింది.

    ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న దిల్ రాజు ..రీసెంట్ గా చిత్రం ఫైనల్ కట్ చూసి ఇంప్రెస్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన నైజాం రైట్స్ మాత్రమే కాక, ఆంద్రాలో కొన్ని ప్రాంతాలు వైజాగ్ తో సహా తీసుకున్నారు. ఆయన గుణ శేఖర్..ఈ చిత్రం చిత్రీకరించిన తీరుని చూసి ముచ్చడపడినట్లు చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్, అనుష్క లు కూడా చిత్రానికి ప్లస్ అవుతారని భావిస్తున్నారు.

    మరో ప్రక్క వారాహీ చలన చిత్రం బ్యానర్ నిర్మాత కొర్రిపాటి సాయి ..'రుద్రమదేవి' చిత్రం కృష్ణా ఏరియా రైట్స్ తీసుకున్నారని సమాచారం. ఆ ఏరియాకు ఆయన రెండు కోట్ల ఎనభై లక్షలు చెల్లించారని తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపడుతున్నారు. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతోందీ ఈ చిత్రం. 'రుద్రమదేవి' చిత్రంలో అనుష్క రుద్రమదేవిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కథలో ప్రధాన పాత్రల్లో ఒకటైన మహామంత్రి 'శివదేవయ్య' పాత్రను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ పోషించారు.

    Rudramadevi:gets a new release date

    దర్శకనిర్మాత మాట్లాడుతూ '' సాంకేతికంగా సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మరి కొంత సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.

    మరో ప్రక్క గుణశేఖర్ తన తాజా చిత్రం 'రుద్రమదేవి' కి కొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నారు. కళ్లద్దాలు లేని త్రీడిలో తమ సినిమాని చూడెపడతాను అంటున్నారు. ఆ ఎక్సపీరియన్స్ పూర్తి డిటేల్స్ ఇక్కడ...

    సాధారణంగా త్రీడి సినిమాలను చూడడానికి ప్రత్యేక కళ్లజోళ్లను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కళ్లజోళ్లు అవసరం లేకుండానే త్రీడీ సినిమా చూడగలిగితే అనే ఆలోచనను నిజం చేయబోతున్నారు. అలాంటి ఎక్సపీరియన్స్ నే 'రుద్రమదేవి' సినిమా ఇవ్వనుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో సరికొత్త సాంకేతిక విధానాన్ని వినియోగించారు దర్శకుడు గుణశేఖర్‌.

    'ఎన్‌హ్యాన్స్‌డ్‌ డెప్త్‌ సొల్యూషన్‌' (ఈడీఎస్‌) అనే విధానం ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన 'యింగ్‌ గ్రూప్‌' సంస్థ ఆధ్వర్యంలో జేమ్స్‌ ఆష్‌బే, మైల్స్‌ ఆడమ్స్‌ బృందం ఈ పనులు నిర్వహిస్తోంది. 'కింగ్‌ కాంగ్‌', 'కుంగ్‌ ఫూ పాండా', 'ఇన్‌సెప్షన్‌', 'అవతార్‌' వంటి చిత్రాలకు త్రీడీ విభాగంలో ఈ సంస్థ పని చేసింది.

    గుణశేఖర్ మాట్లాడుతూ ''రుద్రమదేవి'ని టూడీ, త్రీడీ విధానాల్లో తెరకెక్కించారు. అయితే త్రీడీలో సినిమా చూసే అవకాశం అందరికీ ఉండదు. అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు త్రీడీ కళ్లద్దాలను అందించలేని పరిస్థితి. అందుకే అందరికీ త్రీడీ అనుభూతి కలిగించాలని యింగ్‌ గ్రూప్‌ను సంప్రదించాం. వాళ్లకు త్రీడీ విధానంలో మంచి అవగాహన ఉంది. టూడీ థియేటర్లలోనూ త్రీడీ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించే ఈడీఎస్‌ విధానం గురించి చెప్పారు. అలా టూడీలో చిత్రీకరించిన సినిమాను ఈడీఎస్‌ ద్వారా మార్పు చేశాం'' అని వివరించారు.

    ఈడీఎస్‌ విధానంలో ఫొటో డెప్త్‌ను పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి ప్రతి ఫ్రేమ్‌ మీద రెండు సార్లు పనిచేయాల్సి ఉంటుంది. అయితే డెప్త్‌ పెంచే క్రమంలో రీల్‌లోని బొమ్మల రంగులు మారాయి. దాంతో మరింత శ్రద్ధ తీసుకుని ఆ తేడా కనిపించకుండా చేశారు. ఫైట్ సీన్స్ విషయంలో ఈడీఎస్‌ మార్పు కష్టమైంది. అయినా జాగ్రత్తగా కొనసాగించారు. సుమారు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమం సాగుతోంది.

    ఈడీఎస్‌ ద్వారా మార్చిన రీల్‌లో ఇమేజ్‌ షార్ప్‌నెస్‌ కొద్దిగా తగ్గినట్టు అనిపించినా సన్నివేశాలన్నీ సహజంగా కనిపిస్తాయి. మరోవైపు కళ్లజోళ్లు పెట్టుకుని చూసేలా కూడా కొన్ని ప్రింట్లను రూపొందిస్తున్నారు. మొత్తానికి 'రుద్రమదేవి' సినిమాను రెండు విధాలుగా చూడొచ్చన్నమాట.

    మరో ప్రక్క ... ఈ చిత్రం నిర్మాతలు...బాహుబలి తరహాలోనే సీరిస్ ఆఫ్ పోస్టర్స్ ని విడుదల చేయటానికి రెడీ అవుతున్నారు. అయితే మరి బాహుబలి కు అంతర్జాతీయ స్ధాయిలో ప్రమోషన్ చేసారు. మరి ఇక్కడ కూడా చేస్తారో లేదో చూడాలి.

    సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మేనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మేనన్‌, అజయ్‌ తదితరులు నటించారు. చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ.

    English summary
    Gunasekhar’s Rudhramadevi makers are planning to release the film on September 17th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X