»   » ‘S/O సత్యమూర్తి ’ 2 వీక్స్ కలెక్షన్ ఎంత?

‘S/O సత్యమూర్తి ’ 2 వీక్స్ కలెక్షన్ ఎంత?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘S/O సత్యమూర్తి ' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. తొలివారం పూర్తయ్యే నాటికి రూ. 37 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం, రెండో వారం పూర్తయ్యే నాటికి రూ. 44 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి.

ఏరియా వైజ్ షేర్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.


నైజాం: రూ. 12.53 కోట్లు
సీడెడ్: రూ. 5.55 కోట్లు
నెల్లూరు: రూ. 1.18 కోట్లు
కృష్ణా: రూ. 2.20 కోట్లు
గుంటూరు: రూ. 2.83 కోట్లు
వైజాగ్: రూ. 3.30 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ. 2.39 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ. 2.04 కోట్లు


రెండు వారాల్లో ఏపీ, తెలంగాణ షేర్ రూ. 32.02 కోట్లు
కర్ణాటక: రూ. 5.30 కోట్లు
రెస్టాఫ్ ఇండియా రూ. 1.35 కోట్లు
ఓవర్సీస్: రూ. 6.22 కోట్లు
టోటల్ 2 వీక్స్ షేర్ రూ. 44.89 కోట్లు


S/O Satyamurthy 2 weeks collection

మొత్తం కలెక్షన్స్‌ను గ్రాస్ కలెక్షన్లుగా.... థియేటర్ల రెంట్, ఇతర ఖర్చలు పోగా మిగిలిన మొత్తాన్ని షేర్‌గా పిలుస్తారు.


విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
S/O Satyamurthy movie 2 weeks collections details.
Please Wait while comments are loading...