»   » ‘సన్నాఫ్ సత్యమూర్తి’: కేరళలో రిలీజైంది...పరిస్ధితి ఏంటి?

‘సన్నాఫ్ సత్యమూర్తి’: కేరళలో రిలీజైంది...పరిస్ధితి ఏంటి?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' . ఈ చిత్రంలో మళయాళ వెర్షన్ క్రిందటి 24 న విడుదలైంది. కేరళలో అల్లు అర్జున్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాఫ్ చిత్రంగా నమోదైందని సమాచారం. రెండో రోజు నుంచే కలెక్షన్స్ డ్రాప్ అవటం అక్కడ సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కు చెమటలు పట్టిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కేరళలో ఈ చిత్రం 71 థియోటర్లలో విడుదలైంది. కేరళ మార్కెట్ కు అది పెద్ద సంఖ్యే. అయితే తొలి రోజే చాలా నిరాశాజనకంగా ప్రారంభమైంది. కేవలం 61 లక్షలు షేర్ మాత్రమే అక్కడ మొదటి రోజు వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది.


S/O Satyamurthy is biggest failure in Bunny’s career

యావరేజ్ గా స్టార్ట్ అయిన ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యే సరికి 2.05 మాత్రమే వసూలు చేసింది. రెండో వారానికే భారీగా డ్రాప్ అవటం మొదలైంది. కేరళలోని ట్రేడ్ పండితులు ఈ చిత్రాన్ని బన్నికు వచ్చిన అతి పెద్ద ఫెయిల్యూర్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు.


అల్లు అర్జున్ సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది కుటుంబ ప్రేక్షకులను తనదైన సెంటిమెంట్, భావోద్వేగాలు, ఫన్ తో ఆకట్టుకునే త్రివిక్రమ్ జత కలిస్తే ఇంకేముంది. జులాయి ని మించిపోతుంది. ఇప్పుడు అందరి అంచనా ఇదే. దానికి తోడు విభిన్నమైన టైటిల్, అత్తారింటికి దారేది వంటి మెగా హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి, రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ వస్తున్న చిత్రం కావటం మరింతగా అంచనాలు పెంచేసింది. దాంతో టాక్ తో సంభందం లేకుండా ముందుకు వెళ్తోంది.


S/O Satyamurthy is biggest failure in Bunny’s career

విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. 'రేసు గుర్రం'లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను అన్నారు.


త్రివిక్రమ్ సినిమాలంటే పంచ్ డైలాగులు ఉంటాయని..సగటు ప్రేక్షకుడ్ని కూడా అలరిస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఆయన మాటల్లోని పంచ్‌లు ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా ఏదీ చూసిన తన డైలాగుల మార్క్ కనబడుతుంది. దానికి తగ్గట్టుగా త్రివిక్రమ్ డైలాగ్స్‌ ‘సత్యమూర్తి'కి సరికొత్త లుక్‌ని తీసుకొచ్చాడని చెబుతున్నారు.

English summary
Malayalam version of S/O Satyamurthy failed to attract audience and it proved as biggest failure in Allu Arjun’s career at Mollywood BO.
Please Wait while comments are loading...